Cid Sequel: సూపర్‌హిట్ క్రైమ్ థ్రిల్లర్ సీరియల్‌కు సీక్వెల్ వస్తోంది - సీఐడీ 2 టెలికాస్ట్ డేట్, టైమింగ్స్ ఇవే!
Cid Sequel: బుల్లితెరపై ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన క్రైమ్ థ్రిల్లర్ సీరియల్ సీఐడీకి సీక్వెల్ వస్తోంది. సీఐడీ 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీక్వెల్ డిసెంబర్ 21 నుంచి సోనీ టీవీలో టెలికాస్ట్ కాబోతోంది. ఈ సీక్వెల్‌లో శివాజీ, ఆదిత్య శ్రీవాత్సవ, దయానంద్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Cid Sequel: క్రైమ్ థ్రిల్లర్ సీరియల్స్‌లో సీఐడీ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. అత్యధిక కాలం టీవీలో టెలికాస్ట్ అయిన సీరియల్‌గా రికార్డును నెలకొల్పిన సీఐడీకి సీక్వెల్ వస్తోంది. సీఐడీ 2 పేరుతో సీక్వెల్‌ను సోనీ టీవీ అనౌన్స్‌చేసింది. సీఐడీ 2కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్‌చేసింది.
డిసెంబర్ 21 నుంచి...
సీఐడీ 2 డిసెంబర్ 21 నుంచి సోనీ టీవీలో టెలికాస్ట్ కాబోతున్నట్లు సమాచారం. శని, ఆదివారాల్లో రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు సీఐడీ 2 ప్రసారమవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. సీఐడీ సీరియల్‌తో పాపులర్ అయిన ఆదిత్య శ్రీ వాత్సవ, దయానంద్ శెట్టి, శివాజీ ఈ సీక్వెల్‌లో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అభిజీత్ పాత్రలో ఆదిత్య శ్రీ వాత్సవ, దయాగా దయానంద్ శెట్టి కనిపించబోతున్నట్లు టీజర్‌లో చూపించారు.
ప్రాణ స్నేహితులు శత్రువులుగా...
ప్రాణ స్నేహితులైన అభిజీత్, దయా సీక్వెల్‌లో బద్ధ శత్రువులుగా కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. దయాను అభిజీత్ గన్‌తో షూట్ చేసినట్లుగా టీజర్‌లో చూపించడం ఆసక్తిని పంచుతోంది. నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా డిఫరెంట్ క్రైమ్ స్టోరీస్‌తో సీఐడీని మేకర్స్ తెరకెక్కిస్తోన్నట్లు సమాచారం.సీఐడీలో నటించిన చాలా మంది ఆర్టిస్టులు సీక్వెల్‌లో కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు.సీఐడీ 2 టీవీ సీరియల్ సోనీ టీవీతో పాటు సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
30 ఏళ్లు...
సీఐడీ సీరియల్ 1998లో మొదలైంది. 2018 వరకే 1500 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నది. 2018 అక్టోబర్‌లో 1547 ఎపిసోడ్స్‌తో సీరియల్ ఎండ్ అయ్యింది. దాదాపు 30 ఏళ్ల పాటు ఈ సీరియల్ ప్రసారమైంది. ఇండియాలోనే లాంగెస్ట్ రన్నింగ్ టీవీ సీరియల్‌గా సీఐడీ రికార్డ్ క్రియేట్ చేసింది.
సల్మాన్, షారుఖ్...
సీఐడీ సీరియల్‌కు క్రిస్టబెల్లే డిసౌజా డైరెక్టర్‌గా వ్యవహరించగా, బీపీ సింగ్ క్రియేటర్‌గా పనిచేశారు. సీఐడీ సీరియల్‌లో షారుఖ్‌ఖాన్, సల్మాన్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్ధికీ, భాగ్యశ్రీ, మందిరాబేడీ, మురళీశర్మ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు గెస్ట్ పాత్రల్లో కనిపించారు. కపిల్ దేవ్‌తో పాటు మరికొందరు క్రికెటర్లుగా గెస్ట్‌లుగా మెరిశారు. సీఐడీ సీరియల్‌తో ఫేమస్ అయిన శివాజీ, ఆదిత్య శ్రీవాత్సవ, దయానంద్ శెట్టి పలు బాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు.