Exercises for Belly Fat: బెల్లీ ఫ్యాట్‍ను కరిగించాలని అనుకుంటున్నారా? 5 రకాల ఎక్సర్‌సైజ్‍లు రెగ్యులర్‌గా చేయండి!-best and simple 5 exercises for reduced belly fat ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Exercises For Belly Fat: బెల్లీ ఫ్యాట్‍ను కరిగించాలని అనుకుంటున్నారా? 5 రకాల ఎక్సర్‌సైజ్‍లు రెగ్యులర్‌గా చేయండి!

Exercises for Belly Fat: బెల్లీ ఫ్యాట్‍ను కరిగించాలని అనుకుంటున్నారా? 5 రకాల ఎక్సర్‌సైజ్‍లు రెగ్యులర్‌గా చేయండి!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 15, 2024 06:00 AM IST

Exercises for Belly Fat: బెల్లీ ఫ్యాట్ కరిగేందుకు కొన్ని వ్యాయామాలు రెగ్యులర్‌గా చేయాలి. వీటివల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఊబకాయం తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు ఉపయోగపడే వ్యాయమాలు ఏవంటే..

Exercises for Belly Fat: బెల్లీ ఫ్యాట్‍ను కరిగించాలనుకుంటున్నారా? 5 రకాల సింపుల్ ఎక్సర్‌సైజ్‍లు.. రెగ్యులర్‌గా చేయాలి!
Exercises for Belly Fat: బెల్లీ ఫ్యాట్‍ను కరిగించాలనుకుంటున్నారా? 5 రకాల సింపుల్ ఎక్సర్‌సైజ్‍లు.. రెగ్యులర్‌గా చేయాలి!

ప్రస్తుతం చాలా మందికి బెల్లీ ఫ్యాట్‍ పెద్ద సమస్యగా మారింది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి బొజ్జ వచ్చేస్తోంది. అధికంగా బరువు పెరుగుతున్నామనేందుకు ఈ బెల్లీ ఫ్యాట్ చాలా మందికి ఓ సంకేతంగా ఉంటుంది. పొట్ట చుట్టూ కొవ్వు (బెల్లీ ఫ్యాట్) పెరిగిపోతే ఊబకాయానికి దారితీస్తుంది. దీనివల్ల ఆరోగ్యానికి చాలా సమస్యలు ఎదురవుతాయి. అందుకే బెల్లీ ఫ్యాట్ కరిగించేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఇది తగ్గేందుకు కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‍లు రెగ్యులర్‌గా చేయడం ఉపయోగపడతాయి.

yearly horoscope entry point

బెల్లీ ఫ్యాట్ కరిగించాలంటే సరైన ఆహారంతో పాటు వ్యాయామం చాలా ముఖ్యం. కొన్ని వర్కౌట్లు సమర్థవంతంగా ఫ్యాట్ కరిగిస్తాయి. ఊబకాయం, బరువు తగ్గేలా చేస్తాయి. బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు చేయాల్సిన వ్యాయామాలు ఏవంటే..

స్పాట్ రన్నింగ్

ఉన్న చోట ఉంటే పరుగెత్తినట్టుగా కాళ్లను వేగంగా ఆడించాలి. దీన్ని స్పాట్ రన్నింగ్ అంటారు. ఇలా ఉన్న చోటే సుమారు 2 నిమిషాల పాటు పరుగెత్తాలి. ఆ తర్వాత కాస్త విరామం తీసుకొని మళ్లీ వీలైనంచసేపు చేయాలి. క్యాలరీలు, బెల్లీ ఫ్యాట్ కరిగేందుకు ఈ స్పాట్ రన్నింగ్ ప్రభావవంతంగా పని చేస్తుంది. శరీర ఫ్లెక్సిబులిటీ కూడా పెంచుతుంది.

ప్లాంక్

ప్లాంక్ చేయడం వల్ల పొత్తి కడుపుపై ఒత్తిడి పెరిగి.. బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది. దీని కోసం ముందుగా ఓ చోట బోర్లా పడుకోవాలి. ఆ తర్వాత మోచేతులను మడిచి.. ముంజేతులపై భారం వేస్తూ శరీర ముందు భాగాన్న లేపాలి. బరువు ముంజేతులపై ఉంటుంది. ఈ ప్లాంక్ భంగిమలో కాసేపు ఉండాలి. ఆ తర్వాత పైకి లేచి.. మళ్లీ రిపీట్ చేయాలి. సుమారు 20 సార్లు ప్లాంక్ చేయాలి.

మోకాలు ఎత్తుతూ ‘హై నీ’

'హై నీ' వ్యాయమం చాలా సులువైనది. ముందుగా ఓ చోట నిల్చొని ఓ మోకాలిని మడవాలి. ఛాతి వరకు మెకాలిని తీసుకొచ్చేలా కాలిని పైకి పుష్ చేయాలి. ఒకదాని తర్వాత మరొకటి రెండు కాళ్లతో ఇలా చేయాలి. కాస్త వేగంగా ఇది చేయాలి. హై నీ వ్యాయమం వల్ల శరీరంలో క్యాలరీలు వేగంగా బర్న్ అవుతాయి. పొత్తి కడుపుపై బాగా ఒత్తిడి పడి కొవ్వు కరుగుతుంది. కాళ్ల దృఢత్వం కూడా మెరుగవుతుంది.

లెగ్ రైజ్

లైగ్ రైజ్ చేయడం వల్ల నడుము, కడుపు భాగంలో ప్రెజర్ ఎక్కువవుతుంది. పొట్ట అవయవాలకు మసాజ్ చేసినట్టు అవుతుంది. కొవ్వు కరిగేందుకు ఉపయోగపడుతుంది. లెగ్ రైజ్ చేసేందుకు, ముందుగా వెల్లకిలా పడుకోవాలి. ఆ తర్వాత కాళ్లను నిటారుగా పైకి లేపాలి. శరీర ముందు భాగం అలాగే ఉంచి.. నడుము నుంచి ఉంచి కాళ్లను పైకి లేపాలి. కాసేపటి తర్వాత సాధారణ పొజిషన్‍కు రావాలి. మళ్లీ కాళ్లు ఎత్తి భంగిమ చేయాలి. ఇలా ఓ 15సార్లు అయినా చేయాలి.

మౌంటైన్ క్లైంబర్స్

మౌంటైన్ క్లైంబర్స్ చేయడం వల్ల క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. కడుపులో కదలిక మెరుగ్గా వస్తుంది. దీంతో బెల్లీ ఫ్యాట్ కరిగేందుకు ఉపకరిస్తుంది. పుషప్ చేసేందుకు ఉన్నట్టుగా అరచేతులపై శరీర భారం వేసి ఉండాలి. ఆ భంగిమలో కాళ్లను ఒకదాని తర్వాత మరొక దాన్ని ముందుకు వెనక్కి ఆడిస్తూ ఉండాలి. చూసేందుకు కొండను పాకుతున్నట్టుగా మౌంటైన్ క్లైంబర్స్ ఎక్సర్‌సైజ్ ఉంటుంది.

జంపింగ్ జాక్స్, క్రంచెస్ కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు ఉపయోగపడతాయి. కొవ్వు కరిగి బరువు తగ్గాలంటే రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయాలి.

Whats_app_banner

సంబంధిత కథనం