TGPSC Group 2 Exams 2024 : తెలంగాణలో నేటి నుంచి గ్రూప్‌ 2 పరీక్షలు - ఈసారి వేగంగా ఫలితాలు..!-tgpsc group 2 exams will start in telangana from today and the results will be announced soon ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tgpsc Group 2 Exams 2024 : తెలంగాణలో నేటి నుంచి గ్రూప్‌ 2 పరీక్షలు - ఈసారి వేగంగా ఫలితాలు..!

TGPSC Group 2 Exams 2024 : తెలంగాణలో నేటి నుంచి గ్రూప్‌ 2 పరీక్షలు - ఈసారి వేగంగా ఫలితాలు..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 15, 2024 05:20 AM IST

TGPSC Group 2 Exams 2024 : తెలంగాణలో ఇవాళ్టి నుంచి గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రేపటితో పూర్తి అవుతాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇవాళ రెండు పేపర్లు, రేపు మరో 2 పేపర్లు రాయాల్సి ఉంటుంది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ఖులు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు తీసుకోవాలి.

తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు
తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు

నేటి నుంచి తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఇవాళ, రేపు జరిగే ఈ పరీక్షల కోసం సెంటర్ల వద్ద పకడ్బందీ చర్యలను చేపట్టింది. ఇందుకోసం రాష్ట్ర వ్యప్తంగా 1,368 కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటికే హాల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

బయోమెట్రిక్‌ తప్పనిసరి….

గ్రూప్-2 లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఇవాళ పేపర్-1 ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఉంటుంది.ఇక రేపు పేపర్​3, 4 పరీక్షలు రాయాల్సి ఉంటుంది. గ్రూప్-2 ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహించనున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు.

పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు మూసివేస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ మేరకు అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా వెల్లడించింది. అభ్యర్థులందరూ బయోమెట్రిక్‌ తప్పనిసరి వేయాలని స్పష్టం చేసింది. లేదంటే ఓఎంఆర్‌ పత్రాలు మూల్యాంకనం చేయబోమని పేర్కొంది.

హాల్ టికెట్ ఉన్నవారినే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఒరిజినల్ ఐడీని(Passport, Pan Card, Voter ID, Aadhaar Card, Government Employee ID లేదా డ్రైవింగ్ లైసెన్స్ ) చూపించాల్సి ఉంటుంది. హాల్ టికెట్ పై క్లియర్ గా కనిపించేలా ఫొటో ఉండాలి. ఇలా లేకపోతే గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకోవాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి తీసుకెళ్లరాదు. మాల్ ప్రాక్టీసింగ్, చీటింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. టీజీపీఎస్సీ పరీక్షలు రాయకుండా చర్యలు తీసుకుంటారు.

మొత్తం 783 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత గతేడాది ఆగస్టు 29, 30న గ్రూప్‌-2 పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. వరుసగా గ్రూప్‌-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు. దీంతో వాయిదా పడుతూ వచ్చాయి.

త్వరలోనే ఫలితాలు...!

రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మందికి పైగా అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షలు రాయనున్నారని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రశ్నా పత్రాలకు సంబంధించి 58 స్టోరేజ్ పాయింట్లు పెట్టామన్నారు. 2015లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అమలుకు చాలా సమయం పట్టిందని, కానీ ఈసారి చాలా వేగంగా ఫలితాలు ఇస్తామని స్పష్టం చేశారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం