TSPSC Exam Results 2024 : టీఎస్‌పీఎస్సీ నుంచి మరో అప్డేట్... మరో 2 ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల
TSPSC Exam Results Updates : ఉద్యోగ నియామక పరీక్షలు రాసిన ఉద్యోగ అభ్యర్థులకు మరో అప్డేట్ ఇచ్చింది టీఎస్పీఎస్సీ. అగ్రికల్చర్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ ఫలితాల(General ranking list)ను విడుదల చేసింది.
TSPSC Exam Results 2024 Updates: కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కావటంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ స్పీడ్ అందుకుంటోంది. ఇటీవలే పలు నియామక పరీక్షల ఫలితాలను ప్రకటిస్తోంది. ఇప్పటికే ఆయా పరీక్షల జనరల్ ర్యాకింగ్ జాబితాలను ప్రకటించగా… త్వరలోనే ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో రెండు పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు జనరల్ ర్యాంకింగ్ మెరిట్ జాబితాల (general ranking list)ను వెబ్ సైట్ లో ఉంచింది.
బుధవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్(Municipal Administration and Urban Development department) లోని అకౌంట్స్ ఆఫీసర్స్ (AO) , అగ్రికల్చర్ అండ్ కోపరేటివ్ డిపార్టుమెంట్‌లోని అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష ఫలితాలను ప్రకటించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC). వీటికి సంబంధించిన పరీక్షలను గతేడాది మే మాసంలో నిర్వహించారు. ప్రాథమిక కీలను విడుదల చేయటం, వాటిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం….తాజాగా జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాలను ప్రకటించింది టీఎస్పీఎస్సీ. కమిషన్ అధికారిక https://www.tspsc.gov.in వెబ్ సైట్ లో వీటిని చెక్ చేసుకోవచ్చు. త్వరలోనే మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలపువనున్నారు.
ఇలా చెక్ చేసుకోండి…
- అగ్రికల్చర్ ఆఫీసర్ జనరల్ ర్యాకింగ్ లిస్ట్ ను https://notificationslist.tspsc.gov.in/notipdf/AGRIO_2722_GRL_DISPLAY.pdf లింక్ పై క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు.
- అకౌంట్ ఆఫీసర్స్ జనరల్ ర్యాకింగ్ లిస్ట్ ను https://notificationslist.tspsc.gov.in/notipdf/AOJAO_3222_GRL_DISPLAY.pdf లింక్ పై క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు.
ఇటీవలే తెలంగాణ గ్రూప్-4 ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు (TSPSC Group 4 Results) విడుదలయ్యాయి. ఈ మేరకు ర్యాంకుల వివరాలను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంకులను అందుబాటులో ఉంచింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కమిషన్ తెలిపింది. గ్రూప్-4 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 8,180 ఉద్యోగాల భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 7,26,837 మంది ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడించనుంది టీఎస్పీఎస్సీ. రాష్ట్రంలో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్ - 4 నోటిఫికేషన్ ఇవ్వగా..... జూలై 1న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది అప్లై చేయగా....అందులో 7,62,872 మంది పేపర్ -1 రాయగా....7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు.ఇక 5 నెలల క్రిందటే ఫైనల్ కీ విడుదల కాగా....గ్రూప్ -4 మెరిట్ జాబితా వివరాలను ఇటీవలే విడుదల చేశారు. అనంతరం అభ్యర్థులకు ర్యాంకు కేటాయించనున్నారు. మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్లవారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు గ్రూప్ 1 అభ్యర్థుల వయోపరిమితిని పెంచనున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది.
సంబంధిత కథనం