TSPSC Group 4 Results : తెలంగాణ గ్రూప్- 4 ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి
TSPSC Group 4 Results Updates: తెలంగాణ గ్రూప్ - 4 ఫలితాలు వచ్చేశాయ్. ఈ వివరాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
TSPSC Group 4 Results Updates: తెలంగాణ గ్రూప్-4 ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు (TSPSC Group 4 Results) విడుదలయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ర్యాంకుల వివరాలను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంకులను అందుబాటులో ఉంచామని పేర్కొంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కమిషన్ తెలిపింది.
గ్రూప్-4 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 8,180 ఉద్యోగాల భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 7,26,837 మంది ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడించనుంది టీఎస్పీఎస్సీ.
ఈ లింక్ పై క్లిక్ చేసి గ్రూప్ 4 ర్యాకింగ్ లిస్ట్ జాబితాను పొందవచ్చు.
రాష్ట్రంలో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్ - 4 నోటిఫికేషన్ ఇవ్వగా..... జూలై 1న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది అప్లై చేయగా....అందులో 7,62,872 మంది పేపర్ -1 రాయగా....7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు.ఇక 5 నెలల క్రిందటే ఫైనల్ కీ విడుదల కాగా....గ్రూప్ -4 మెరిట్ జాబితా వివరాలను ఇవాళ విడుదల చేశారు. అనంతరం అభ్యర్థులకు ర్యాంకు కేటాయించనున్నారు. మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్లవారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
గ్రూప్ - 1 అభ్యర్థుల వయోపరిమితి పెంపు
తెలంగాణ గ్రూప్ -1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన…వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతామని ప్రకటించారు. త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. గ్రూప్-1లో అదనంగా మరో 60 పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. గతంలో టీఎస్పీఎస్సీ 503 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీటికి మరో 60 పోస్టులను అదనంగా చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిపై వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఈ కొత్త పోస్టులకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారా? పాత నోటిఫికేషన్ రద్దు చేసి మరో నోటిఫికేషన్ జారీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. వయోపరిమితి విషయంలో చాలా మంది అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనం