తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live November 22, 2024: TG Residential Schools : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరో 26 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 22 Nov 202404:50 PM IST
తెలంగాణ News Live: TG Residential Schools : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరో 26 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు
- TG Residential Schools : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో 26 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ బీ.వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 28 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేశారు.
Fri, 22 Nov 202402:54 PM IST
తెలంగాణ News Live: TG Samagra Kutumba Survey : రోడ్లపై తెలంగాణ ప్రజల బతుకు వివరాలు బట్టబయలు.. వీడియో
- TG Samagra Kutumba Survey : సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు నడిరోడ్డుపై దర్శనమిచ్చాయి. అయితే.. అవి ఖాళీ పేపర్లు కాదు. ప్రజల నుంచి వివరాలు సేకరించిన వాటిని రోడ్డుపై పడేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మాజీమంత్రి హరీష్ రావు స్పందించారు.
Fri, 22 Nov 202401:24 PM IST
తెలంగాణ News Live: Kawal Tiger Reserve : టైగర్ రిజర్వ్ పరిధిలోని గ్రామాల తరలింపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- Kawal Tiger Reserve : కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని గ్రామాల తరలింపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోని మైసంపేట్, రాంపూర్ గూడేలను తొలి విడతగా ఖాళీ చేయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అంశంపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు.
Fri, 22 Nov 202411:58 AM IST
తెలంగాణ News Live: TG Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్‌డేట్.. లబ్ధిదారుల ఎంపికపై క్లారిటీ! 8 ముఖ్యమైన అంశాలు
- TG Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో చాలామంది ఈ పథకం ద్వారా ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం అతి త్వరలోనే శుభవార్త చెప్పబోతోంది. తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చింది.
Fri, 22 Nov 202410:08 AM IST
తెలంగాణ News Live: Warangal : వరంగల్ భూములపై మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కన్ను.. గ్యాంగులతో బెదిరింపులు
- Warangal : మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదమవుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచే ఆయన వరంగల్ నగరంలో భూదందాలు మొదలుపెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా ఆ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
Fri, 22 Nov 202408:42 AM IST
తెలంగాణ News Live: Maoist Encounter : భద్రతా బలగాలు- మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. 10 మంది మృతి
- Maoist Encounter : సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇటు ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని దారుణంగా చంపేశారు.
Fri, 22 Nov 202407:07 AM IST
తెలంగాణ News Live: Warangal Robbery: ఖాకీలకు చుక్కలు చూపిస్తున్న ఎస్‌బిఐ దోపిడీ కేసు, మూడు రోజులు దాటినా పురోగతి శూన్యం
- Warangal Robbery: వరంగల్ కమిషనరేట్ పరిధి రాయపర్తి ఎస్ బీఐలో గోల్డ్ రాబరీ కేసు పోలీసులకు చుక్కలు చూపిస్తోంది. మాస్టర్ స్కెచ్ తో చోరీకి పాల్పడిన దుండగులు.. పోలీసులకు గట్టి క్లూ ఏదీ దొరకకుండా జాగ్రత్త పడగా.. ఘటనా స్థలంలో దొరికిన ఓ అగ్గిపెట్టేను ఇప్పటికే ఖాకీలు స్వాధీనం చేసుకున్నారు.
Fri, 22 Nov 202406:50 AM IST
తెలంగాణ News Live: Hyd Boy Killed in US: ప్రాణం తీసిన తుపాకీ మోజు,యూఎస్‌లో గన్ మిస్‌ఫైర్.. హైదరాబాద్ యువకుడి మృతి
- Hyd Boy Killed in US: తుపాకీ మోజు అమెరికాలో ఓ హైదరాబాద్ యువకుడి ప్రాణం తీసింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన హైదరాబాద్‌కు చెందిన యువకుడు లైసెన్స్ తుపాకీని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలడంతో ప్రాణాలు కోల్పోయాడు.
Fri, 22 Nov 202406:02 AM IST
తెలంగాణ News Live: TG Highcourt: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సింగల్ జడ్జి తీర్పు కొట్టేసిన డివిజన్ బెంచ్, స్పీకర్‌దే నిర్ణయాధికారం..
- TG Highcourt: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సెప్టెంబర్9న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు డివిజన్ బెంచ్ కొట్టేసింది. సహేతుకమైన కాల వ్యవధిలో అనర్హత పిటిషన్లపై విచారణ ముగించాలని స్పష్టం చేసింది.ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌దే నిర్ణయమని డివిజన్ బెంచ్ పేర్కొంది.
Fri, 22 Nov 202403:47 AM IST
తెలంగాణ News Live: TG Assembly Session: డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, ఆలోపే మంత్రి వర్గ విస్తరణ!
- TG Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 9 నుంచి శీతాకాల సమావేశాలను నిర్వహించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతోంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది.
Fri, 22 Nov 202403:13 AM IST
తెలంగాణ News Live: Mulugu Maoist Murders: ఇన్ఫార్మర్ నెపంతో అన్నదమ్ముల దారుణ హత్య.. ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
- Mulugu Maoist Murders: ములుగు జిల్లా మరోసారి ఉలిక్కిపడింది. ఇన్ ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరు అన్నదమ్ములను దారుణ హత్య చేశారు. వాళ్లిద్దరినీ గొడ్డళ్లతో నరికి చంపడంతో పాటు సీపీఐ మావోయిస్టు పార్టీ వెంకటాపురం– వాజేండు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరున లేఖ కూడా రిలీజ్ చేశారు.
Fri, 22 Nov 202403:01 AM IST
తెలంగాణ News Live: TG Group 2 Exams: తెలంగాణ గ్రూప్ 2 టైమ్ టేబుల్ విడుదల.. డిసెంబర్ 9 నుంచి హాల్ టిక్కెట్లు, 15, 16న పరీక్షలు
- TG Group 2 Exams: తెలంగాణ గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో 783 గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 9వ తేదీ నుంచి హాల్ టిక్కెట్‌లో కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 15,16 తేదీల్లో పరీక్షల్ని నిర్వహిస్తారు.
Fri, 22 Nov 202412:32 AM IST
తెలంగాణ News Live: Karimnagar PTC: పోలీసులంటే భయపడొద్దు... ప్రజల్లో నెగెటివ్ అభిప్రాయం పోవాలి… కానిస్టేబుల్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో డీజీ
- Karimnagar PTC: పోలీసులు అంటే ప్రజలకు భయం. వారిపై నెగెటివ్ అభిప్రాయం ఉంటుంది. కొడతారు, తిడతారు.. దురుసుగా ప్రవర్తిస్తాలనే అభిప్రాయం పోవాలంటే పోలీసులు సత్ప్రవర్తనతో మెలగాలని అన్నారు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిజీ కమలాసన్ రెడ్డి. కానిస్టేబుల్స్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు.
Fri, 22 Nov 202412:02 AM IST
తెలంగాణ News Live: TTD Temple: కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికై బీఆర్‌ఎస్ నేతల వినతి, సానుకూలంగా స్పందించిన ఛైర్మన్
- TTD Temple: కరీంనగర్ లో కలియుగ ప్రత్యక్ష దైవం కొలువుదీరనున్నారుజ జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టాలని ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు టీటీడీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.