TSPSC Group 1 Updates : గ్రూప్‌- 1 అభ్యర్థులకు శుభవార్త... వయోపరిమితి పెంపు-key updates about tspsc group 1 aspirants age relaxation ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tspsc Group 1 Updates : గ్రూప్‌- 1 అభ్యర్థులకు శుభవార్త... వయోపరిమితి పెంపు

TSPSC Group 1 Updates : గ్రూప్‌- 1 అభ్యర్థులకు శుభవార్త... వయోపరిమితి పెంపు

Feb 09, 2024, 07:08 PM IST Maheshwaram Mahendra Chary
Feb 09, 2024, 07:08 PM , IST

  • Telangana Group 1 Updates : తెలంగాణ గ్రూప్ -1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన…వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతామని ప్రకటించారు. త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు.

త్వరలోనే తెలంగాణ గ్రూప్ - 1 నోటిఫికేషన్ రానుంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో మార్పులు చూస్తే… ఇచ్చేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం.

(1 / 6)

త్వరలోనే తెలంగాణ గ్రూప్ - 1 నోటిఫికేషన్ రానుంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో మార్పులు చూస్తే… ఇచ్చేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇదే అంశంపై శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

(2 / 6)

ఇదే అంశంపై శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.(Twitter)

వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  త్వరలోనే గ్రూప్‌-1 నిర్వహిస్తామని అసెంబ్లీ వేదికగా తెలిపారు.

(3 / 6)

వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  త్వరలోనే గ్రూప్‌-1 నిర్వహిస్తామని అసెంబ్లీ వేదికగా తెలిపారు.(https://www.tspsc.gov.in/)

గ్రూప్-1లో అదనంగా మరో 60 పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. గతంలో టీఎస్పీఎస్సీ 503 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీటికి మరో 60 పోస్టులను అదనంగా చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

(4 / 6)

గ్రూప్-1లో అదనంగా మరో 60 పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. గతంలో టీఎస్పీఎస్సీ 503 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీటికి మరో 60 పోస్టులను అదనంగా చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది(https://www.tspsc.gov.in/)

వీటిపై వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఈ కొత్త పోస్టుల‌కు స‌ప్లిమెంట‌రీ నోటిఫికేష‌న్ ఇస్తారా? పాత నోటిఫికేష‌న్ ర‌ద్దు చేసి మరో నోటిఫికేష‌న్ జారీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

(5 / 6)

వీటిపై వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఈ కొత్త పోస్టుల‌కు స‌ప్లిమెంట‌రీ నోటిఫికేష‌న్ ఇస్తారా? పాత నోటిఫికేష‌న్ ర‌ద్దు చేసి మరో నోటిఫికేష‌న్ జారీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.(https://www.tspsc.gov.in/)

వయోపరిమితి విషయంలో చాలా మంది అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

(6 / 6)

వయోపరిమితి విషయంలో చాలా మంది అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.(https://www.tspsc.gov.in/)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు