TSPSC Group-1 : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, మరో 60 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్-hyderabad news in telugu ts govt green signal to recruitment to tspsc group 1 with 60 posts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group-1 : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, మరో 60 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

TSPSC Group-1 : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, మరో 60 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Bandaru Satyaprasad HT Telugu
Published Feb 06, 2024 04:15 PM IST

TSPSC Group-1 : మరో 60 గ్రూప్-1 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిపై త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

మరో 60 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మరో 60 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TSPSC Group-1 : తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1లో అదనంగా మరో 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. గతంలో టీఎస్పీఎస్సీ 503 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీటికి మరో 60 పోస్టులను అదనంగా చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిపై వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఈ కొత్త పోస్టుల‌కు స‌ప్లిమెంట‌రీ నోటిఫికేష‌న్ ఇస్తారా? పాత నోటిఫికేష‌న్ ర‌ద్దు చేసి మరో నోటిఫికేష‌న్ జారీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. గతేడాది జూన్ 11న 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అయితే పేపర్ లీకేజీ వ్యవహారంతో హైకోర్టు ఈ ప‌రీక్షను ర‌ద్దు చేసింది.

మొత్తం 563 పోస్టులు

2022 ఏప్రిల్ లో టీఎస్పీఎస్సీ 503 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు 3,50,000 మంది దరఖాస్తు చేసుకోగా... 2022 అక్టోబర్‌లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 2,80,000 మంది హాజరయ్యారు. అయితే పేపర్ లీకేజీ వ్యవహారంతో ఈ పరీక్ష రద్దయ్యింది. తిరిగి 2023 జూన్‌లో మళ్లీ గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ప్రిలిమ్స్ నిర్వహణలో లోపాల ఉన్నాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఈ పరీక్షలను రద్దు చేసింది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి సర్కార్ గ్రూప్‌-1 నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. మరో 60 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. మొత్తం 563 పోస్టులకు త్వరలో పరీక్ష నిర్వహించనున్నారు.

త్వరలో గ్రూప్-4 ఫలితాలు

ఇటీవల నియామకమైన కొత్త టీఎస్పీఎస్సీ బోర్డు ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు ఆగిపోయిన పనుల్లో కదలిక స్టార్ట్ అయింది. ఇప్పటికే పూర్తైన రాత పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం అనుమతి తీసుకుని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్-4 ఫలితాలు విడుదల చేసేందుకు ముమ్మరం చేసింది. ఇక రాష్ట్రంలో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్ - 4 నోటిఫికేషన్ ఇవ్వగా.....2023 జులై 1న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది అప్లై చేయగా....అందులో 7,62,872 మంది పేపర్ -1 రాయగా....7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు. ఇక 5 నెలల క్రిందటే ఫైనల్ కీ విడుదల కాగా....గ్రూప్ -4 తుది ఫలితాలు మాత్రం ఇప్పటివరకు విడుదల కాలేదు. అయితే ఫలితాలు విడుదల చేసే ప్రక్రియ మాత్రం బోర్డు పూర్తి చేయగా...మరో వారం రోజుల్లో గ్రూప్ - 4 ఫలితాలను విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. ముందుగా జనరల్ ర్యాంకు లిస్టును ప్రకటించి ఆ తర్వాత పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకు కేటాయించనున్నారు. మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్లవారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం