AP Civil Assistant Surgeon Jobs : ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు- దరఖాస్తు గడువు పొడిగింపు-apmsrb civil assistant surgeon recruitment 2024 application last date extended ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Civil Assistant Surgeon Jobs : ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు- దరఖాస్తు గడువు పొడిగింపు

AP Civil Assistant Surgeon Jobs : ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు- దరఖాస్తు గడువు పొడిగింపు

AP Civil Assistant Surgeon Jobs : ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 97 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌, 280 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబర్ 13తో గడువు ముగియగా...దరఖాస్తు గడువును డిసెంబర్ 16 వరకు పెంచారు.

ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు- దరఖాస్తు గడువు పొడిగింపు

AP Civil Assistant Surgeon Jobs : ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీగా వైద్యుల పోస్టుల భర్తీకి ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల దరఖాస్తు గడువును ఏపీ వైద్యారోగ్య శాఖ పెంచింది. దరఖాస్తు గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించినట్లు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ సూర్యకళ ప్రకటించారు. నోటిఫికేషన్లలో పేర్కొన్న దరఖాస్తు గడువు 13.12.2024తో ముగియగా...తాజాగా ఈ గడువును 16.12.2024 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 97 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌, 280 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి డిసెంబర్ 2న నోటిఫికేషన్‌లు జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు http:apmsrb.ap.gov.in/msrb/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు

ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు...ఇటీవల రెగ్యులర్‌ పోస్టులతో పాటు బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రభుత్వ ఆసుత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి విడివిడిగా రెండు నోటిఫికేషన్లను జారీచేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో, ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఖాళీల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన జరిగే నియామకాలతో పాటు బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. నోటిఫికేషన్‌ ప్రకారం ఎంపికైన వారిని పీహెచ్‌సీలు/ఇతర వైద్య సంస్థల్లో నియమిస్తారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. https://apmsrb.ap.gov.in/msrb/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారం ఉంటుంది.

సెకండరీ ఆసుపత్రుల్లో 97 వైద్యుల పోస్టులు

డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ - ఏపీ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 97 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్/సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టుల కోసం మరో నోటిఫికేషన్‌ జారీ అయింది. వీటిలోనూ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్, సర్జన్‌ జనరల్ పోస్టుల అర్హతలు, మార్గదర్శకాలు https://apmsrb.ap.gov.in/msrb/ , https://hmfw.ap.gov.in/ , https://cfw.ap.nic.in/ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచారు.

సంబంధిత కథనం