SSC GD Final Result 2024: ఎస్సెస్సీ జీడీ ఫైనల్ రిజల్ట్స్ విడుదల; ఇలా చెక్ చేసుకోండి..-ssc gd final result 2024 out direct link to check merit list here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ssc Gd Final Result 2024: ఎస్సెస్సీ జీడీ ఫైనల్ రిజల్ట్స్ విడుదల; ఇలా చెక్ చేసుకోండి..

SSC GD Final Result 2024: ఎస్సెస్సీ జీడీ ఫైనల్ రిజల్ట్స్ విడుదల; ఇలా చెక్ చేసుకోండి..

Sudarshan V HT Telugu
Dec 14, 2024 03:58 PM IST

SSC GD Final Result: ఎస్ఎస్సీ జీడీ ఫైనల్ రిజల్ట్ 2024 శనివారం వెల్లడయ్యాయి. ఈ పరీక్ష రాసి, ఫిజికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరైన అభ్యర్థులు ఎస్సెస్సీ అధికారిక వెబ్ సైట్ ssc.gov.in లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్ చూసుకునేందుకు స్టెప్ బై స్టెప్ గైడ్ కోసం కింద చదవండి.

ఎస్సెస్సీ జీడీ ఫైనల్ రిజల్ట్స్ విడుదల
ఎస్సెస్సీ జీడీ ఫైనల్ రిజల్ట్స్ విడుదల

SSC GD Final Result 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ జీడీ ఫైనల్ రిజల్ట్ 2024ను శనివారం విడుదల చేసింది. ఫిజికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరైన అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. తుది ఫలితాల ప్రకారం, మొత్తం 4891 మంది మహిళా అభ్యర్థులు, 39375 మంది పురుష అభ్యర్థులను కమిషన్ ఎంపిక చేసింది. వీరు అస్సాం రైఫిల్స్ లో రైఫిల్ మెన్ (GD)గా, సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), ఎస్ఎస్ఎఫ్ లో కానిస్టేబుల్స్ (GD) గా విధుల్లో చేరుతారు. కాగా, కోర్టు ఆదేశాలు/ అనుమానాస్పద అవకతవకల కారణంగా 845 మంది అభ్యర్థుల తుది ఫలితాలను నిలిపివేశారు.

త్వరలోనే అందరి మార్కుల వివరాలు

ఎంపికైన, ఎంపిక కాని అభ్యర్థుల సమగ్ర మార్కులను త్వరలోనే అధికారిక వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తామని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (staff selection commission) తెలిపింది.

ఎంపిక ప్రక్రియలోని దశలు

  1. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (CBE)
  2. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
  3. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
  4. వైద్య పరీక్షలు
  5. డాక్యుమెంట్ వెరిఫికేషన్.

ఈ సాయుధ దళాల్లో రిక్రూట్మెంట్

జీడీ రిక్రూట్మెంట్ (recruitment) డ్రైవ్ ద్వారా వివిధ సాయుధ దళాలకు 46617 పోస్టులను ఎస్ఎస్సీ భర్తీ చేయనుంది. వీటిలో బీఎస్ఎఫ్ కు 12076, సీఐఎస్ఎఫ్ కు 13632, సీఆర్పీఎఫ్ కు 9410, ఎస్ఎస్బీకి 1926, ఐటీబీపీకి 6287, ఏఆర్ కు 2990, ఎస్ఎస్ఎఫ్ కు 296 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్సీ జీడీ రాత పరీక్షను 2024 ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు, 2024 మార్చి 30న నిర్వహించారు. ఫలితాలను 2024 జూలై 11న ప్రకటించారు.

ఎస్ఎస్సీ జీడీ ఫైనల్ రిజల్ట్ 2024: ఇలా డౌన్లోడ్ చేసుకోండి

తుది ఫలితాలను చెక్ చేసుకోవడానికి, అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించాలి.

  • ముందుగా ఎస్సెస్సీ అధికారిక వెబ్ సైట్ ssc.gov.in ను సందర్శించండి.
  • హోమ్ పేజీలో , "అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్, 2024 లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), ఎస్ఎస్ఎఫ్ మరియు రైఫిల్మాన్ (GD) రిక్రూట్మెంట్ - తుది ఫలితాల ప్రకటన" అనే లింక్ పై క్లిక్ చేయండి.
  • రిజల్ట్ పీడీఎఫ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • రిజల్ట్ పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ ను భవిష్యత్ రిఫరెన్స్ కోసం భద్రపరుచుకోవాలి.
  • మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.

Whats_app_banner