బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ఈ 6 రకాల పండ్లు తినండి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Dec 14, 2024

Hindustan Times
Telugu

బరువు తగ్గాలని అనుకునే వారు పండ్లు తినడం కూడా ముఖ్యం. విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు తినాలి. వెయిట్ లాస్‍కు సహకరించే ఆరు రకాల పండ్లు ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

కివీ పండ్లలో విటమిన్ ఈ, సీ, ఫైబర్, ఫోలెట్ మెండుగా ఉంటాయి. జీవక్రియను ఇది మెరుగుపరుస్తుంది. బరువు తగ్గేందుకు కివీ పండు సహకరిస్తుంది. 

Photo: Pexels

నారింజ పండ్లలో విటమిన్ సీ మెరుగ్గా ఉంటుంది. ఇది శరీరంలో జీవక్రియను, జీర్ణాన్ని మెరుగుపరుస్తుంది. వెయిట్ లాస్ అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. 

Photo: Pexels

పీచ్ పండ్లలో విటమిన్ ఏ, సీ సహా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గ్లెసెమిక్ ఇండెక్స్, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గేందుకు ఈ పండు తినడం సహకరిస్తుంది. 

Photo: Pexels

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు లాంటి బెర్రీ పండ్లలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో ఇవి తింటే వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి. తీపి పదార్థాలు తినాలనే కోరికను ఇవి తగ్గిస్తాయి. 

Photo: Pexels

యాపిల్ పండ్లలో డైయటరీ ఫైబర్, కెరెటోనాయిడ్స్, పాలిఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువే. ఆకలిని యాపిల్ తగ్గిస్తుంది. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. 

Photo: Pexels

ఖర్బూజ, పుచ్చకాయ పండ్లలో కొన్ని రకాల విటమిన్లతో పాటు వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎప్పుడు హైడ్రేటెడ్‍గా ఉంచడంతో పాటు వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపకరిస్తాయి. 

Photo: Pexels

మీ జేబులో ఉండే పర్సు  మీ అదృష్టాన్ని, ఆదాయాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? అవును మీ వ్యాలెట్ రంగును ఫ్యాషన్‌కు తగ్గట్టుగా కాకుండా మీ రాశికి తగ్గట్టుగా ఎంచుకోవడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది, ఆదాయం పెరుగుతుందని జ్యోతిష్య, వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి.

pexel