Balayya Janareddy House Marks : కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణ పనులు-బాలయ్య, జానారెడ్డి ఇళ్లకు మార్కింగ్!
Balayya Janareddy House Marks : జూబ్లీహిల్స్ చెక్ పోస్టు్, కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, మాజీ మంత్రి జానారెడ్డి ఇంటి వద్ద అధికారులు మార్కింగ్ వేశారు. ఈ విషయంలో వీరిద్దరూ అసంతృప్తితో ఉన్న ప్రచారం జరుగుతోంది.స్థలం ఇచ్చేందుకు బాలయ్య గతంలో ఒప్పుకున్నారని సమాచారం.
Balayya Janareddy House Marks : జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణ పనుల కోసం మాజీ మంత్రి జానారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ వేశారు అధికారులు. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా జానారెడ్డి , బాలకృష్ణ ఇళ్లకు మార్కింగ్ వేశారు. రోడ్డు విస్తరణలో వీరి స్థలం అధికారులు కొంత మేర స్వాధీనం చేసుకోనున్నట్లు సమాచారం. అయితే మాజీ మంత్రి జానారెడ్డి, బాలకృష్ణ మార్కింగ్ విషయంలో అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
తన ఇంటికి మార్కింగ్ వేయడంపై కాంగ్రెస్ నేత జానారెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన స్థలం ఇచ్చే ప్రసక్తే లేదన్నారని సమాచారం. తాను సీఎంతో మాట్లాడతానని, తన ఇంటి వద్ద మార్కింగ్ చేసేందుకు వెళ్లిన అధికారులపై ఆయన అన్నట్లు తెలుస్తోంది.
ట్రాఫిక్ సమస్య
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించాలని బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలోని ఆలోచన చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో ఈ విషయం కొన్నాళ్లు పక్కన పడింది. సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు విస్తరణను స్పీడ్ అప్ చేయడంతో అధికారులు మార్కింగ్ చేపట్టారు.
బాలయ్య కొత్త ఇండ్లు
జూబ్లిహిల్స్ చెక్ పోస్టు దగ్గర, కేబీఆర్ పార్క్ వాకింగ్ ట్రాక్ కు అభిముఖంగా హీరో బాలకృష్ణ ఇల్లు ఉంటుంది. అయితే ఈ స్థలంలో కొంత రోడ్డు వైడెనింగ్ లో పోతుంది. చట్ట ప్రకారం పరిహారం తీసుకుని ఆ స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ ప్రభుత్వానికి అంగీకారపత్రం ఇచ్చారని తెలుస్తోంది. ఇందుకు ప్రతిగా ఆ స్థలంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని తెలుస్తోంది.
బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ పై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి టాలివుడ్ ను టార్గెట్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదని తెలుస్తోంది. బాలకృష్ణ ఇటీవలి జూబ్లిహిల్స్ లోనే రెండు ఇళ్లు కొనుగోలు చేశారని సమాచారం. ఆయన ప్రస్తుతం ఉన్న ఇంటి స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి, మరో ఇంటికి మారాలని బాలకృష్ణ భావిస్తున్నారని సమాచారం. అయితే ఇందులో ఎలాంటి వివాదం లేదని తెలుస్తోంది.
సంబంధిత కథనం