Premium smartphones : ప్రీమియం సెగ్మెంట్​లో ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​దే హవా- ఏది బెస్ట్​?-vivo x200 pro vs iphone 16 pro know which is the best flagship pro model ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Premium Smartphones : ప్రీమియం సెగ్మెంట్​లో ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​దే హవా- ఏది బెస్ట్​?

Premium smartphones : ప్రీమియం సెగ్మెంట్​లో ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​దే హవా- ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Dec 15, 2024 07:24 AM IST

Vivo X200 Pro vs iPhone 16 Pro : వివో ఎక్స్200 ప్రో వర్సెస్ ఐఫోన్ 16 ప్రో.. ఈ రెండు ప్రీమియం స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? దేని కెమెరా క్వాలిటీ బెస్ట్​? వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

వివో ఎక్స్200 ప్రో వర్సెస్ ఐఫోన్ 16 ప్రో
వివో ఎక్స్200 ప్రో వర్సెస్ ఐఫోన్ 16 ప్రో (Vivo/ Apple)

వివో ఎక్స్​200 సిరీస్​ ఇటీవలే ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఇందులోని ప్రో మోడల్​పై కస్టమర్ల ఆసక్తి ఎక్కువగా ఉంది. ఈ మోడల్​.. దిగ్గజ యాపిల్​ సంస్థ నుంచి సెప్టెంబర్​లో లాంచ్​ అయిన ఐఫోన్​ 16ప్రోతో పోటీ పడుతోంది. ప్రీమియం సెగ్మెంట్​లో ఇప్పుడు ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​ హవా కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

yearly horoscope entry point

వివో ఎక్స్200 ప్రో వర్సెస్ ఐఫోన్ 16 ప్రో: డిజైన్- డిస్​ప్లే..

వివో ఎక్స్200 ప్రో స్మార్ట్​ఫోన్​లో అల్యూమినియం ఫ్రేమ్, మ్యాట్ రేర్ ప్యానెల్​తో వస్తుంది. ఇందులో మూడు కెమెరా సెన్సార్లతో కూడిన సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. మరోవైపు టైటానియం ఫ్రేమ్, ప్రీమియం బిల్డ్ కలిగిన స్మార్ట్​ఫోన్​లలో ఐఫోన్ 16 ప్రో ఒకటి.

డిస్​ప్లే కోసం, వివో ఎక్స్ 200 ప్రో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్​ పీక్ బ్రైట్​నెస్​తో 6.78 ఇంచ్​ ఎల్టీపీఓ అమోలెడ్ డిస్​ప్లేను కలిగి ఉంది. ఇందులో హెచ్​డీఆర్ 10+, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. ఐఫోన్ 16 ప్రోలో 6.3 ఇంచ్​ ఎల్టీపీఓ సూపర్ రెటీనా ఎక్స్​డీఆర్ ఓఎల్ఈడీ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్​ పీక్ బ్రైట్​నెస్ ఉన్నాయి.

వివో ఎక్స్200 ప్రో వర్సెస్ ఐఫోన్ 16 ప్రో- కెమెరా..

వివో ఎక్స్200 ప్రోలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ జెయిస్ ట్రూ కలర్ ప్రైమరీ కెమెరా, 200 మెగాపిక్సెల్ ఏపీఓ టెలిఫోటో కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

ఐఫోన్ 16 ప్రోలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 120 ఎంఎం ఫోకల్ లెంథ్​తో 12 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.

రెండు డివైజ్​లు 4కే 120 ఎఫ్​పీఎస్ వీడియోను అందిస్తాయి. అయితే వివో ఎక్స్200 ప్రో 8కే 30 ఎఫ్​పీఎస్ వీడియోను కూడా అందిస్తుంది.

వివో ఎక్స్200 ప్రో వర్సెస్ ఐఫోన్ 16 ప్రో: పర్ఫార్మెన్స్​- బ్యాటరీ..

వివో ఎక్స్200 ప్రో 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్​తో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఫన్ టచ్ 15 ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్​ఫోన్ పనిచేయనుండగా, వివో 4 ఏళ్ల సాఫ్ట్​వేర్ అప్​గ్రేడ్​లను అందిస్తోంది.

మరోవైపు ఐఫోన్ 16 ప్రోలో 8 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్​తో కూడిన కొత్త ఏ18 ప్రో చిప్ ఉంది.

వివో ఎక్స్200 ప్రో వర్సెస్ ఐఫోన్ 16 ప్రో: ధర

వివో ఎక్స్ 200 ప్రో 16 జీబీ ర్యామ్, 512 జిబి స్టోరేజ్ ప్రారంభ ధర రూ. 94999. ఐఫోన్ 16 ప్రో 128 జీబీ వేరియంట్ ధర రూ.119,900గా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం