Bigg Boss Finale: బిగ్ బాస్ ఫినాలేకి స్పెషల్ గెస్టుగా రామ్ చరణ్- కన్నడ, తమిళ స్టార్ హీరోలు, తెలుగు హీరోయిన్స్ ఎంట్రీ!
Bigg Boss Telugu 8 Finale Chief Guest Ram Charan: బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్స్‌కు చీఫ్ గెస్ట్‌గా రామ్ చరణ్ రానున్నాడని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో తమిళం, కన్నడ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఉపేంద్ర, సాయి ధరమ్ తేజ్ సందడి చేయనున్నారని సమాచారం.
Bigg Boss 8 Telugu Grand Finale Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ అంటే డిసెంబర్ 15న బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే ఈవెంట్ నిర్వహించి టైటిల్ విన్నర్‌ను ప్రకటించనున్నారు. అందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది.
విజయ్ సేతుపతి ఎంట్రీ
అయితే, బిగ్ బాస్ తెలుగు 8 ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ శనివారం (డిసెంబర్ 14) పూర్తి అయింది. ఈ ఈవెంట్‌కు వచ్చి సందడి చేసే గెస్ట్‌లు సెలబ్రిటీలు ఎవరెవరో బిగ్ బాస్ వర్గాల నుంచి లీక్ అయిపోయింది. దీని ప్రకారం బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌కు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి రానున్నారు. తమిళ బిగ్ బాస్ సీజన్‌కు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
రియల్ స్టార్ ఉపేంద్ర సందడి
ఈ సందర్భంగానే తెలుగు బిగ్ బాస్ 8 ఫైనల్స్‌కు విజయ్ సేతుపతి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా బిగ్ బాస్ హౌజ్‌లో సందడి చేసినట్లు సమాచారం. యూఐ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఉపేంద్ర స్టేజీపై అట్రాక్ట్ చేశారట. అంతేకాకుండా మొదటి ఫైనలిస్ట్‌గా సెలెక్ట్ అయన అవినాష్‌ను టాప్ 5 కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ చేసి హౌజ్ నుంచి స్టేజీపైకి ఉపేంద్రనే తీసుకొచ్చారని సమాచారం.
డాకు మహారాజ్-పుష్ప 2 టీమ్స్
ఈ సీజన్ ఫినాలేకు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ టీమ్ వచ్చి ప్రమోషన్స్ చేసిందట. అయితే, నందమూరి నటసింహం బాలకృష్ణ మాత్రం రాలేదని సమాచారం. దీంతోపాటు పుష్ప 2 టీమ్ కూడా సందడి చేసిందని బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. వీరితోపాటు మెగా సుప్రీమ్ సాయి ధరమ్ తేజ్ కూడా బిగ్ బాస్ స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చాడట.
సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ
సంబరాల ఏటిగట్టు (SYG) మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సాయి ధరమ్ తేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. వీరితోపాటు తెలుగు హీరోయిన్స్ ఇస్మార్ట్ శంకర్ బ్యూటి నభా నటేష్, అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఎంట్రీ ఇచ్చి ఆకర్షించారని సమాచారం. నభా నటేష్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేయగా.. టాప్ 3 ఫైనలిస్ట్ అయిన ప్రేరణను టాప్ 4 కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ హౌజ్ నుంచి స్టేజీ మీదకు తీసుకొచ్చిందట ప్రగ్యా జైస్వాల్.
చీఫ్ గెస్ట్‌గా రామ్ చరణ్
ఇక టాప్ 5 ఫైనలిస్ట్స్‌లో ఇద్దరు ఎలిమినేట్ కాగా టాప్ 3లో గౌతమ్, నిఖిల్, నబీల్ మిగిలారు. వీరిలో బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరు అనేది ఇవాళ (డిసెంబర్ 15) రాత్రి ప్రసారం అయ్యే గ్రాండ్ ఫినాలేలో బయటపడనుంది. అయితే, ఈ బిగ్ బాస్ 8 తెలుగు విజేతకు ట్రోఫీని అందజేసేది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని జోరుగా టాక్ నడుస్తోంది.
అల్లు అర్జున్‌కు బదులుగా
ఇదివరకు బిగ్ బాస్ తెలుగు 8కు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్ రానున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో స్పెషల్ గెస్ట్‌గా రావడం నుంచి బన్నీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. దాంతో అల్లు అర్జున్‌కు బదులుగా బిగ్ బాస్ 8 తెలుగు ఫినాలేకు స్పెషల్ గెస్ట్‌గా రామ్ చరణ్ వచ్చే అవకాశం 99.99 శాతం ఉందని బీబీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు అయితే చెర్రీ చేతుల మీదుగానే బిగ్ బాస్ విన్నర్‌కు ట్రోఫీ అందజేస్తారని తెలుస్తోంది.
టాపిక్