శివుడిని పూజించేటప్పుడు ఉపయోగించకూడనివి ఏంటి? చాలా మందికి తెలియని విషయం ఇది!-lord shiva worship rules do not use these things while worship mahadev ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  శివుడిని పూజించేటప్పుడు ఉపయోగించకూడనివి ఏంటి? చాలా మందికి తెలియని విషయం ఇది!

శివుడిని పూజించేటప్పుడు ఉపయోగించకూడనివి ఏంటి? చాలా మందికి తెలియని విషయం ఇది!

Oct 13, 2024, 06:57 PM IST Anand Sai
Oct 13, 2024, 06:57 PM , IST

Lord Shiva Worship Rules In Telugu : సోమవారం శివుడిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. కానీ శివుడిని పూజించేటప్పుడు చేసే పొరపాట్లు పూజ ఫలాలను ఇవ్వవు అని నమ్మకం. మహాదేవుని ఆరాధనలో ఏం ఉపయోగించకూడదో తెలుసుకోండి.

సోమవారం శివుడికి పూజలు చేస్తుంటారు. ఈ రోజున భక్తులు మహాదేవుడిని పూజిస్తారు. శివుడిని పూజించేటప్పుడు కొన్ని వస్తువులను ఉపయోగించకూడదని చెబుతారు. ఏ వస్తువులను ఉపయోగించకూడదో తెలుసుకోండి.

(1 / 5)

సోమవారం శివుడికి పూజలు చేస్తుంటారు. ఈ రోజున భక్తులు మహాదేవుడిని పూజిస్తారు. శివుడిని పూజించేటప్పుడు కొన్ని వస్తువులను ఉపయోగించకూడదని చెబుతారు. ఏ వస్తువులను ఉపయోగించకూడదో తెలుసుకోండి.

తులసి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. అయితే దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ శివుని పూజించడానికి ఉపయోగించకూడదు. పూర్వజన్మలో తులసి బృంద అనే అసుర కుటుంబంలో జన్మించిందని చెబుతారు. శివుడు తన భర్తను చంపినందుకే బృంద శివుడిని ద్వేషించడం ప్రారంభించిందని ఒక కథ ఉంది. కాబట్టి తులసిని శివుడికి సమర్పించకూడదని అంటారు.

(2 / 5)

తులసి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. అయితే దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ శివుని పూజించడానికి ఉపయోగించకూడదు. పూర్వజన్మలో తులసి బృంద అనే అసుర కుటుంబంలో జన్మించిందని చెబుతారు. శివుడు తన భర్తను చంపినందుకే బృంద శివుడిని ద్వేషించడం ప్రారంభించిందని ఒక కథ ఉంది. కాబట్టి తులసిని శివుడికి సమర్పించకూడదని అంటారు.(PC: Unsplash)

శివుని పూజించేటప్పుడు శంఖం శబ్ధం చేయకూడదు. నీటితో శంఖం అభిషేకం చేయకూడదు. శివుడిని పూజించేటప్పుడు శంఖాన్ని ఉపయోగించడం నిషిద్ధం. ఎందుకంటే ఆయన శంకరాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని నమ్ముతారు.

(3 / 5)

శివుని పూజించేటప్పుడు శంఖం శబ్ధం చేయకూడదు. నీటితో శంఖం అభిషేకం చేయకూడదు. శివుడిని పూజించేటప్పుడు శంఖాన్ని ఉపయోగించడం నిషిద్ధం. ఎందుకంటే ఆయన శంకరాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని నమ్ముతారు.

కుంకుమ, గులాబీ వంటి ఎరుపు రంగు పువ్వులను శివుడికి సమర్పించకూడదు. ఇది శివుడికి ప్రీతికరమైనదిగా కానిదిగా పరిగణిస్తారు.

(4 / 5)

కుంకుమ, గులాబీ వంటి ఎరుపు రంగు పువ్వులను శివుడికి సమర్పించకూడదు. ఇది శివుడికి ప్రీతికరమైనదిగా కానిదిగా పరిగణిస్తారు.

దేవుడికి చేసే పంచామృత అభిషేకంలో కూడా కొబ్బరినీళ్లను ఉపయోగిస్తారు. అయితే కొబ్బరి నీళ్లను శివుడికి వాడకూడదు. దీనివల్ల ఆటంకాలు కలుగుతాయని చెబుతారు. గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. వాటిని అనుకరించే ముందు సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించాలి.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు