AP EAGLE Police: డ్రగ్స్, గంజాయిపై ఉక్కు పాదం మోపేందుకు పోలీస్ శాఖలో కొత్తగా ఈగల్ ఏర్పాటు
AP EAGLE Police: ఏపీ పోలీస్ శాఖలో కొత్త దళం ఏర్పాటైంది. గంజాయి,మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ - ఈగల్ ఏర్పాటైంది. మొత్తం 459 మంది సిబ్బంది పనిచేసే ఈగల్‌ను ఏర్పాటు హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
AP EAGLE Police: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కొత్త వ్యవస్థ ఏర్పాటైంది. వ్యవస్థీకృతంగా మారిన గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణా అరికట్టేందుకు పోలీస్ శాఖలో కొత్త దళాన్ని ఏర్పాటు చేశారు. ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ - ఈగల్ పేరుతో కొత్త జట్టును ఏర్పాటు చేస్తూ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈగల్ ఏర్పాటులో దానికి రూపురేఖలు తీసుకువచ్చారు. అమరావతిలో రాష్ట్రస్థాయి నార్కోటిక్స్ పోలీసుస్టేషన్, జిల్లాకొకటి చొప్పున 26 నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలు ఉంటాయి. పోలీస్ శాఖలో గతంలో ఉన్న స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. వైసీపీ హయంలో ఎక్సైజ్, పోలీసులతో కలిపి అక్రమ మద్యం,ఇసుక, మైనింగ్‌లపై నిఘా కోసం సెబ్‌ను ఏర్పాటు చేశారు. దాని వల్ల ప్రత్యేకంగా ఏమి సాధించలేకపోయారనే అపప్రదను వైసీపీ మూటగట్టుకుంది. దానిని టీడీపీ రద్దు చేసింది. కొత్తగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ హోంశాఖ ఉత్త ర్వులు జారీ చేసింది.
ఈగల్ బృందానికి గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఎస్పీగా, తర్వాత సుదీర్ఘ కాలం ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన ఐజీ ఆకే రవికృష్ణ సారథ్యం వహిస్తారు. ఈగల్ కోసం అమరావతిలో రెండు స్టేషన్లు, గంజాయి సమస్య తీవ్రంగా ఉన్న ఏవోబీలోని విశాఖపట్నం, పాడేరు కేంద్రాలుగా మరో రెండు కలిపి మొత్తం నాలుగు రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు ఈగల్‌లో పనిచేస్తాయి.
అమరావతిలో రాష్ట్రస్థాయి నార్కోటిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేస్తారు. కేసుల విచారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు చోట్ల ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ 1972 ఏర్పాటు చేశారు. నార్కొటిక్స్ స్టేషను రాష్ట్రమంతటా పరిధి కల్పించారు. అమరావతిలో ఏర్పాటుచేసే నార్కోటిక్స్ పోలీస్ సిబ్బందికి రాష్ట్రంలో ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ సంబందిత కేసుల దర్యాప్తు చేయొచ్చు. కేసుల విచారణకు విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిల్లో ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
మాదక ద్రవ్యాలపై ఫిర్యాదులు చేసేం టోల్ ఫ్రీ నంబర్ (1972)ను ఏర్పాటు చేశాడు ఆమరావతిలో ఏర్పాటు చేసే కాల్ సెంటర్ 24 గంటలూ పనిచేస్తుంది. నార్కోటిక్స్ పోలీసు, నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాల్లో మొత్తం 450 మంది సిబ్బంది పని చేయ నున్నారు. ప్రధాన కార్యాలయానికి 200 మందిని, జిల్లాల్లోని స్టేషన్ విభాగాలకు 181 పోస్టులు కేటాయించారు. పోలీసు శాఖలోని సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకొని ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఈ విభాగంలో పనిచేసే వారికి అదనపు ఇన్సెంటివ్‌లు చెల్లిస్తారు.
ఈగల్ హెడ్ ఆఫీస్, నార్కోటిక్ పోలీస్ స్టేషన్, జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సెల్ లో పని చేసే వారికి విధి నిర్వహణ కాలంలో 30శాతం స్పెషల్ అలోవెన్స్ చెల్లిస్తారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆధ్వర్యంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో 5 స్పెషల్ కోర్టులు లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటును డీజీపీ నేరుగా పర్యవేక్షిస్తారు. ఒక్కో నార్కోటిక్ పోలీస్ స్టేషన్ లో 66 మంది సిబ్బంది డిప్యుటేషన్ లో విధులు నిర్వర్తిస్తారు.
జిల్లాలవారీగా నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ లో 144 మంది పనిచేస్తారు. మొత్తం 358 మంది అధికారులతో ఈగల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా కలుపుకుని డ్రగ్స్ నియంత్రణ కోసం మొత్తం 459 మందితో కూడిన ఈగల్ వ్యవస్థలో ఉంటారు. అందులో డిప్యూటేషన్ పద్ధతిలో 341 మంది, రెగ్యులర్ పద్ధతిలో 17 మందికి విధులు అప్పగించారు. రూ.8.59 కోట్ల ఖర్చుతో ఈగల్ నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేశారు.
పరిశోధన పర్యవేక్షణ మరియు లీగల్ వింగ్, డాక్యుమెంటేషన్ ట్రైనింగ్ మరియు అవార్నెస్ వింగ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ లాజిస్టిక్స్ వింగ్, టెక్నికల్ వింగ్, స్టేట్ టాస్క్ ఫోర్స్ ల వంటి 5 కీలక విభాగాల ఏర్పాటుకు మార్గదర్శకాలు చేశారు. 1972 టోల్ ఫ్రీ నంబర్ నిర్వహణ కోసం సెంట్రల్ కంట్రోల్ రూమ్ లో 12 మంది కాల్ టేకర్ల నియమించారు.
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ సీసీ టీవీల ద్వారా సెంట్రల్ డిపాజిటరీ ద్వారా నిరంతర నిఘా ఉంచుతారు. నార్కోటిక్ ప్రధాన పోలీస్ స్టేషన్ లో 66మంది పోలీస్ అధికారుల బృందం సేవలు అందిస్తారు. ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున ఏపీ వ్యాప్తంగా 26 డిస్ట్రిక్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ (డీఎన్ సీసీ)ల ఏర్పాటు చేస్తారు.