OTT: 30 కోట్ల బడ్జెట్- ఐదు కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి వచ్చిన టాలీవుడ్ హీరోయిన్ కోలీవుడ్ డిజాస్టర్ మూవీ
OTT: జయం రవి హీరోగా నటించిన కోలీవుడ్ మూవీ బ్రదర్ ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ తమిళ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది.
OTT: జయం రవి, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ మూవీ బ్రదర్ ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. బ్రదర్ మూవీ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరిగింది. కానీ మేకర్స్ మాత్రం కేవలం తమిళ వెర్షన్‌ను మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో బ్రదర్ మూవీ తెలుగు స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు చెబుతోన్నారు.
ఫ్యామిలీ డ్రామా...
బ్రదర్ మూవీకి ఎమ్ రాజేష్ దర్శకత్వం వహించాడు. అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ఫ్యామిలీ డ్రామాను జోడించి తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఐదు కోట్ల లోపే కలెక్షన్స్‌ను రాబట్టింది. బ్రదర్ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఔట్‌డేటెడ్ స్టోరీ లైన్ కారణంగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
బ్రదర్ మూవీలో రావురమేష్, భూమికా చావ్లా, శరణ్య కీలక పాత్రల్లో నటించారు. హరీస్ జైరాజ్ మ్యూజిక్ అందించాడు.
బ్రదర్ మూవీ కథ ఇదే...
కళ్ల ముందు అన్యాయం జరిగితే ఎంతటివారినైనా ఎదురిస్తుంటాడు కార్తీక్. ఆ ప్రశ్నించేతత్వం వల్లే అందరితో గొడవలు పడుతుంటాడు. ఈ గొడవల మూలంగా కార్తీక్ తండ్రి కుమారస్వామి హాస్పిటల్ పాలవుతాడు. తల్లిదండ్రులకు దూరంగా కార్తీక్‌ను అతడి అక్కడ ఆనంది ఊటి తీసుకెళుతుంది.
ఆనంది మావయ్య శివగురునాథన్ (రావురమేష్) పెట్టే రూల్స్ వల్ల కార్తీక్ ఇబ్బందులు పడతాడు. అరవింద్ చెల్లెలు అర్చనతో (ప్రియాంక మోహన్) పాటు ఆనంది...కార్తీక్‌కు జాబ్స్ ఇప్పిస్తారు. మొదటిరోజే ఉద్యోగం పోగొట్టుకుంటాడు కార్తీక్. ఓ పల్లెటూరి సమస్యను పరిష్కరించే విషయంలో శివగురునాథన్‌కు నచ్చని పనిచేస్తాడు కార్తీక్. ఆ విషయంలో జరిగిన గొడవలు కార్తీక్‌తో పాటు ఆనంది ఇళ్లు వదిలిబయటకు వచ్చేస్తారు.
శివగురునాథన్, అరవింద్ తమకు సారీ చెప్పే వరకు ఇంట్లో అడుగుపెట్టమని కార్తీక్, ఆనంది ఎందుకు ఛాలెంజ్ చేశారు? తన వల్ల దూరమైన అక్క, బావలను కార్తీక్ తిరిగి ఎలా కలిపాడు?
కార్తీక్ పెళ్లి చేసుకోవాలని అనుకున్న అర్చన ఎవరు? కార్తీక్ పుట్టుక గురించి కుమారస్వామి బయటపెట్టిన నిజం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.
పొన్నియన్ సెల్వన్ తర్వాత...
మణిరత్నం పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్ తర్వాత జయం రవికి సరైన కమర్షియల్ హిట్టు లేదు. బ్రదర్‌తో పాటు అతడు హీరోగా నటించిన గత ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. మరోవైపు బ్రదర్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగుతో పాటు తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్‌ను అందుకుంటోంది. ఇటీవలే నాని సరిపోదా శనివారంతో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను అందుకున్నది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీలో హీరోయిన్‌గా నటిస్తోంది.