Hot Water Bathing: చలికాలంలో వేడినీళ్లతో ఎక్కువగా స్నానం చేస్తున్నారాా? ఈ రిస్క్‌లు తెలుకోండి
Hot Water Bathing: వేడి అధికంగా ఉండే నీటితో కొందరు ఎక్కువసేపు స్నానం చేస్తుంటారు. శీతాకాలంలో చలి వల్ల వేడి నీటి మరింత ఎక్కువ వినియోగిస్తారు. అయితే, వేడి నీటితో ఎక్కువగా స్నానం చర్మానికి కొన్నిఇబ్బందులు తలెత్తుతాయి.
శీతాకాలంలో చల్లటి వాతావణం నుంచి ఉపశమనం పొందేందుకు కొందరు వేడివేడి నీటితో స్నానం చేస్తారు. సాధారణంగా కంటే ఎక్కువ వేడి అయిన నీటితో స్నానం చేసేందుకు ఇష్టపడతారు. వెచ్చగా ఫీల్ అవ్వాలని ఎక్కువసేపు హాట్‍వాటర్‌తో జలకాలు ఆడుతుంటారు. అయితే, అధికంగా వేడిగా ఉండే నీటితో ఎక్కువ సేపు స్నానం చేయడం వల్ల చర్మంపై దుష్ప్రభావాలు పడతాయి.
నీరు ఎక్కువగా వేడిగా ఉంటే అది చర్మానికి హానికరంగా ఉంటుంది. చలికాలంలో తరచూ ఆ స్థాయిలో వేడిగా ఉండే నీటితో ఎక్కువసేపు స్నానం చేస్తే స్కిన్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అసలే శీతాకాలంలో చర్మానికి సవాళ్లు ఎదురవుతాయి. వేడి నీటి వల్ల మరింత ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ వివరాలు ఇవే..
చర్మం మరింత పొడిగా..
వేడి నీటితో ఎక్కువసేపు స్నానం చేయడం వల్ల చర్మంలోని తేమ తగ్గిపోతుంది. డీహైట్రేడెట్‍గా అవుతుంది. దీంతో త్వరగా చర్మం పొడిబారుతుంది. సాధారణంగా గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడం వల్ల చలికాలంలో చర్మం పొడిబారుతుంది. ఇక వేడి నీటితో ఎక్కువ స్నానం చేస్తే ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. చర్మం అధికంగా పొడిబారే రిస్క్ అధికంగా ఉంటుంది.
ఇన్ఫెక్షన్లు, దురద
వేడి నీటితో ఎక్కువగా స్నానం చేస్తే శరీరంలో సేబుమ్ ఉత్పత్తికి ఆటంకంగా ఉంటుంది. చర్మంలోని సహజమైన ఆయిల్స్ తగ్గిపోతాయి. దీనివల్ల చర్మానికి ఇబ్బందులు ఎదురవుతాయి. చర్మం పొడిబారడంతో పాటు ఇన్ఫెక్షన్ల రిస్క్ పెరుగుతుంది. దురద ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. చర్మంపై మంట కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఈ సమస్యలు ఉంటే మరింత అధికం
ఇప్పటికే సోరియాసిస్, ఎగ్జేమా, రోసాసియా లాంటి చర్మ సమస్యలు ఉంటే వేడి నీరు మరింత ఇబ్బందిగా మారుతుంది. చర్మం నేచురల్ ఆయిల్స్ కోల్పోయి.. ఆ సమస్యలు అధికం అయ్యే రిస్క్ ఉంటుంది.
గోరువెచ్చగా అయితే ఓకే
ఎక్కువ వేడిగా ఉండే నీటితో స్నానం చేయడం చర్మానికి మంచిది కాదు. అయితే, గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. అది కూడా 10 నిమిషాలకు మించి కూడా చేయడం మేలు. స్నానం తర్వాత వెంటనే చర్మానికి హైడ్రేటింగ్ క్రీమ్ రాయాలి. దీనివల్ల చర్మంలో తేమ లాక్ అయి ఉంటుంది. వీలైతే చల్లటి నీటితో స్నానం చేస్తే చర్మానికి చాలా మంచిది.
వేడి నీటితో జుట్టుకు కూడా..
ఎక్కవ వేడిగా ఉండే నీటితో తల స్నానం చేస్తే జుట్టుకు కూడా చేటు జరుగుతుంది. వెంట్రుకలు బలహీనంగా మారి రాలే రిస్క్ పెరుగుతుంది. వేడి వల్ల జుట్టులోని కెరాటిన్, లిపిడ్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అందుకే జుట్టు డ్యామేజ్ జరగొచ్చు. అందుకే తలస్నానం చేసినా గోరువెచ్చని లేదా చల్లటి నీటితో చేయడమే మేలు.
సంబంధిత కథనం