నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి పార్ట్ టైమ్(పార్ట్‌టైమ్/ గెస్ట్ ఫ్యాకల్టీ) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 14 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆన్ లైన్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని.. ఆఫ్ లైన్ పంపాల్సి ఉంటుంది.
అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 28వ తేదీలోగా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. https://mguniversity.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను "ది రిజిస్ట్రార్, మహాత్మ గాంధీ యూనివర్శిటీ, ఎల్లారెడ్డిగూడెం, నల్గొండ -508 254’’కు పంపాల్సి ఉంటుంది.
వివరాలు సరిగా లేకుంటే దరఖాస్తును పరిగణలోకి తీసుకోమని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. దరఖాస్తులను పరిశీలించి… అర్హత ఉన్న అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. అకడమిక్ క్వాలిఫికేషన్స్ కు వెయిటేజీ ఇస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీతో పాటు నెట్ లేదా సెట్, స్లెట్, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వరంగల్‌లోని నిట్(NIT) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. నాన్ - టీచింగ్ ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. మొత్తం 56 జాబ్స్ ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తులకు జనవరి 07, 2025వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
సంబంధిత కథనం