తెలంగాణ సైనిక సంక్షేమశాఖ...టీజీఎస్ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులకు మాజీ సైనికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన రాష్ట్రంలోని 1201 డ్రైవర్ పోస్టులకు సైనిక సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపికైనా వారికి నెలకు రూ.26 వేల వేతనం, రోజు వారి అలవెన్స్ రూ.150 చెల్లిస్తారు.
మాజీ సైనికుల్లో హెవీ డ్యూటీ లైసెన్స్ కలిగి, 18 నెలల డ్రైవింగ్ అనుభవం ఉన్న వారు దరఖాస్తులకు అర్హులు. వయస్సు 58 కంటే తక్కువ ఉండాలి. ఎత్తు 160 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. ఆసక్తి గల మాజీ సైనికులు దరఖాస్తును నింపి నవంబర్ 30వ తేదీ లోపు porsb-ts@nic.in & emprsb-ts@nic.in మెయిల్ చేయాలని డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ తెలిపారు. వీలైనంతవరకు అభ్యర్థులు కోరుకున్న డిపోలో ఉద్యోగం ఇవ్వటానికి ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్ ల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఇవాళ్టితో(నవంబర్ 23) పూర్తి కానుంది. మొత్తం 33 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. క్లర్క్ పోస్టులకు 3 లేదా 5 సంవత్సరాల లా డిగ్రీని కలిగిన అభ్యర్థులు అర్హులవుతారు.
తెలంగాణహైకోర్టులో పనిచేసేందుకు 31 లా క్లర్క్‌లు, సికింద్రాబాద్ లోని స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో పనిచేసేందుకు 2 లా క్లర్క్‌ల పోస్టులు భర్తీ చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక సంవత్సరం వ్యవధికి భర్తీ చేస్తారు.
సంబంధిత కథనం