రూ. 223 లక్షల కోట్లు- 15వేల కోట్ల ట్రాన్సాక్షన్స్​.. యూపీఐ సరికొత్త రికార్డు..-upi achieves record 15 000 crore transactions worth 223 lakh crore by nov 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రూ. 223 లక్షల కోట్లు- 15వేల కోట్ల ట్రాన్సాక్షన్స్​.. యూపీఐ సరికొత్త రికార్డు..

రూ. 223 లక్షల కోట్లు- 15వేల కోట్ల ట్రాన్సాక్షన్స్​.. యూపీఐ సరికొత్త రికార్డు..

Dec 15, 2024, 01:30 PM IST Sharath Chitturi
Dec 15, 2024, 01:30 PM , IST

  • 2024 జనవరి నుంచి నవంబర్ వరకు యూపీఐ రూ.223 లక్షల కోట్ల విలువైన 15,547 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు రికార్డు స్థాయిలో రూ.223 లక్షల కోట్ల విలువైన 15,547 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.

(1 / 5)

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు రికార్డు స్థాయిలో రూ.223 లక్షల కోట్ల విలువైన 15,547 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.

ఇక 2024 అక్టోబర్​లో యూపీఐ రూ.23.49 లక్షల కోట్ల విలువైన 16.58 బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేసి కొత్త రికార్డును నెలకొల్పింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఇది 2023 అక్టోబర్​లో వచ్చిన 11.40 బిలియన్ లావాదేవీలతో పోలిస్తే 45% అధికం!

(2 / 5)

కోవిడ్ -19 సంక్షోభం అనంతరం వినియోగదారులు నగదుకు సురక్షితమైన, కాంటాక్ట్​లెస్​ ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నందున, ఈ వ్యవస్థ ఉపయోగం విపరీతంగా పెరిగింది. యూపీఐ డబ్బు పంపడానికి, స్వీకరించడానికి సులభమైన మార్గాన్ని అందిస్తుంది కాబట్టి వలస కార్మికులు, చిన్న కంపెనీలు, వీధి అమ్మకందారులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

(3 / 5)

కోవిడ్ -19 సంక్షోభం అనంతరం వినియోగదారులు నగదుకు సురక్షితమైన, కాంటాక్ట్​లెస్​ ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నందున, ఈ వ్యవస్థ ఉపయోగం విపరీతంగా పెరిగింది. యూపీఐ డబ్బు పంపడానికి, స్వీకరించడానికి సులభమైన మార్గాన్ని అందిస్తుంది కాబట్టి వలస కార్మికులు, చిన్న కంపెనీలు, వీధి అమ్మకందారులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.(REUTERS)

దేశంలోనే కూడా ఈ యూపీఐ, విదేశాల్లోనూ వేగంగా పురోగతి సాధిస్తుండటంతో భారత డిజిటల్ చెల్లింపుల విప్లవం ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంటోంది. యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ ప్రస్తుతం యూపీఐ ద్వారా పేమెంట్స్​ చేస్తున్న దేశాల జాబితాలో ఉన్నాయి.

(4 / 5)

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ) 2016 లో బ్యాంక్ ఖాతాల మధ్య తక్షణ నగదు బదిలీని అనుమతించే డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యూపీఐని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇది అనేక బ్యాంకు ఖాతాలను ఒకే స్మార్ట్​ఫోన్​ యాప్​లో కలపడం ద్వారా భారతదేశ పేమెంట్​ సిస్టెమ్​లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

(5 / 5)

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ) 2016 లో బ్యాంక్ ఖాతాల మధ్య తక్షణ నగదు బదిలీని అనుమతించే డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యూపీఐని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇది అనేక బ్యాంకు ఖాతాలను ఒకే స్మార్ట్​ఫోన్​ యాప్​లో కలపడం ద్వారా భారతదేశ పేమెంట్​ సిస్టెమ్​లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.(IANS)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు