Thermos Flask Cleaning Tips: పాలు, టీ నిల్వ చేసిన ఫ్లాస్క్ నుంచి వాసన వస్తోందా? ఇలా క్లీన్ చేస్తే వదిలిపోతుంది
Thermos Flask Cleaning Tips: ఫ్లాస్క్‌లో టీ, కాఫీ, పాలు చాలాసేపు పెట్టాల్సి ఉంటుంది. దీంతో ఒక్కోసారి ఫ్లాస్క్ నుంచి వాసన ఎక్కువగా వస్తుంది. అలాంటి సమయాల్లో కొన్ని టిప్స్ పాటిస్తే ఫ్లాస్క్ నుంచి వాసన తొలగిపోతుంది.
చలికాలంలో తరచూ వేడిగా తాగేందుకు ఫ్లాస్క్‌లను ఎక్కువగా ఉపయోగిస్తారు. పాలు, టీ, కాఫీ, నీరు ఎక్కువ సేపు వేడిగా ఉండేలా థెర్మోస్ ఫ్లాస్క్ చేయగలదు. ఒక్కసారి వేడి చేసి దాంట్లో పోస్తే కొన్ని గంటల పాటు హాట్‍గానే ఉంటుంది. అయితే, ఇలా రకరకాల పానియాలు పోసే ఫ్లాస్క్‌ను శుభ్రం చేయడం ఒక్కోసారి కష్టమవుతుంది. గంటల పాటు టీ, కాఫీ, పాలు అలాగే ఉంచడం వల్ల ఒక్కోసారి ఫ్లాస్క్ నుంచి వాసన వస్తుంది. చాలాసేపు మూత పెట్టి ఉంచడం వల్ల వాసన ఏర్పడుతుంది. సాధారణంగా క్లీన్ చేసినా వాసన ఉండిపోతుంది.
థెర్మోస్ ఫ్లాస్క్ నుంచి వాసన పోవాలంటే కొన్ని చిట్కాలు పాటించి శుభ్రం చేయాలి. దీనివల్ల స్మెల్ వదిలిపోతుంది. ఫ్రెష్‍గా ఉన్న ఫీలింగ్ ఇస్తుంది. ఆ చిట్కాలు ఇవే.
వెనిగర్, వంట సోడాతో..
- వాసన పోయేలా శుభ్రం చేసేందుకు ముందుగా ఫ్లాస్క్ ఖాళీగా ఉండేలా చేసుకోవాలి.
- అప్పుడు ఫ్లాస్క్‌లో అరకప్పు వైట్ వెనిగర్ వేయాలి.
- అందులోనే ఓ టీస్పూన్ వంట సోడా వేయాలి.
- ఆ తర్వాత దాంట్లో గోరువెచ్చని నీరు పోసి పది నిమిషాలు పక్కనపెట్టాలి.
- ఆ తర్వాత బ్రష్ తీసుకొని ఫ్లాస్క్‌లోపల మృధువుగా రుద్దాలి. నీటితో కడగాలి.
- ఇలా చేయడం వల్ల థెర్మోస్ ఫ్లాస్క్‌లో వాసన వెళ్లిపోతుంది. ఫ్రెష్‍గా ఉంటుంది.
డెంచర్ క్లెన్సర్ ట్యాబ్లెట్లతో..
- డెంచర్ క్లెన్సర్ బిళ్లలను ఉపయోగించి కూడా ఫ్లాస్క్‌లో వాసనను వదలగొట్టొచ్చు.
- ముందుగా ఫ్లాస్క్‌లో సగం వరకు వేడి నీటిని పోయాలి. ఆ తర్వాత దాంట్లో రెండు డెంచర్ క్లెన్సర్ బిళ్లలను వేయాలి. ఓ 10 నిమిషాలు పక్కనపెట్టాలి.
- ఆ తర్వాత ఫ్లాస్క్‌లోపల బ్రష్‍తో క్లీన్ చేయాలి. నీటితో పూర్తిగా కడగాలి. ఇలా చేస్తే వాసన పోవడంతో పాటు పేరుకుపోయిన దుమ్ము కూడా సులభంగా వదిలేస్తుంది.
ఐస్, ఉప్పుతో..
- ముందుగా క్రష్ చేసిన ఐస్‍ను ఫ్లాస్క్‌లో పావు భాగం నింపాలి దాన్ని షేక్ చేయాలి.
- ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్‍ల ఉప్పు వేయాలి. ఉప్పులో నేచులర్ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.
- ఆ తర్వాత ఫ్లాస్క్ మూత మూసి బాగా షేక్ చేయాలి. ఐస్, ఉప్పు మిశ్రమం ఫ్లాస్క్‌లోపల బాగా రబ్ అయ్యేలా షేక్ చేయాలి.
- కాసేపటి తర్వాత మూత తీసి ఐస్, ఉప్పును బయటికి వేయాలి.
- బ్రష్ వేసి నీటితో శుభ్రంగా ఫ్లాస్క్ కడగాలి. ఇలా చేసినా వాసన, పేరుకుపోయిన దుమ్ము ప్రభావంతంగా పోతాయి.
ఫ్లాస్క్ ఎక్కువ కాలం బాగా ఉండాలంటే వాడిన ప్రతీసారి క్లీన్ చేయాలి. పక్కన పెట్టాలంటే పూర్తిగా ఆరిన తర్వాతే మూత మూయాలి. హార్ష్ కెమికల్స్ ఉన్న వాటితో శుభ్రం చేయకూడదు. సాఫ్ట్ బ్రష్ వినియోగించాలి. డిష్‍వాషర్ వాడకూడదు. మరీ వేడిగా ఉన్న నీరు కాకుండా గోరువెచ్చని నీటితోనే శుభ్రం చేయాలి.
సంబంధిత కథనం