Tomato Ketchup Recipe: టమాటో ధరలు తగ్గాయి.. ఇంట్లోనే సాస్ సింపుల్‌గా ఇలా చేసుకోండి.. హెల్దీగా, టేస్టీగా..
Tomato Ketchup Recipe: టమాటో సాస్‍ను సులువుగా తయారు చేసుకోవచ్చు. హెల్దీగా చేసుకొని తినేయచ్చు. మార్కెట్లో దొరికే టేస్టుతోనే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఎలాగంటే..
Tomato Ketchup Recipe: టమాటో ధరలు తగ్గాయి.. ఇంట్లోనే సాస్ సింపుల్‌గా ఇలా చేసుకోండి
ప్రస్తుతం టమాటో ధరలు తగ్గాయి. సాధారణం కంటే కాస్త తక్కువ రేటుకు లభిస్తున్నాయి. అందుకే టమాటో సాస్ తయారు చేసుకునేందుకు ఇది సరైన సమయం. స్నాక్స్‌లో నంచుకునేందుకు, వివిధ వంటల కోసం టమాటో సాస్ వినియోగిస్తుంటారు. సాధారణంగా మార్కెట్ నుంచే కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇంట్లో కూడా టమాటో సాస్‍ను సులువుగా తయారు చేసుకోవచ్చు. ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్దీగా చేసుకోవచ్చు. టమాటో సాస్ తయారీ ఎలాగో ఇక్కడ చూడండి.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
టమాటో సాస్ తయారు చేసుకునేందుకు పదార్థాలు
- కిలో బాగా పండిన టమాటోలు (పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి)
- 100 గ్రాముల పంచదార
- నాలుగు వెల్లుల్లి రెబ్బలు
- ఇంచు అల్లం తరుగు
- ఓ చిన్న ఉల్లిపాయ తరుగు
- 80 మిల్లీగ్రాముల వైట్ వెనిగర్
- ఓ చిన్న బీట్‍రూట్ (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
- రెండు లవంగాలు
- అర టీస్పూన్ కారం
- ఓ టీస్పూన్ ఉప్పు
- 500 మిల్లీగ్రాముల నీరు
టమాటో కెచప్ తయారు చేసుకునే విధానం
- ముందుగా కుక్కర్‌లో పండిన టమాటోలో ముక్కలు వేసుకోవాలి. అందులో వెల్లుల్లి, అల్లం తరుగు, లవంగాలు, వెనిగర్, కారం, ఉప్పు, బీట్‍రూట్ ముక్కలు వేయాలి. అందులో నీరు పోయాలి.
- వాటిని కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి. మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి.
- మొత్తగా ఊడికాక టమాటో ముక్కలను మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
- టమాటో పేస్ట్‌ను స్టైయినర్‌లో వేసి వడగొట్టుకోవాలి. దీంతో గింజలు, పిప్పి లాంటివి పైనే ఉంటాయి. టమాటో గుజ్జు కిందికి వచ్చేస్తుంది. ఇలా చేస్తే సాస్ మృధువుగా ఉంటుంది.
- ఆ తర్వాత స్టవ్‍పై ప్యాన్ పెట్టి.. అందులో టమాటో గుజ్జు వేసేయాలి. అందులో చక్కెర వేసి బాగా కలపాలి. టమాటో సాస్ దగ్గరపడే వరకు మీడియం మంటపై ఉడికించుకోవాలి.
- నీరు దగ్గరపడి చిక్కగా అయ్యే వరకు టమాటో సాస్‍ను ఉడికించుకోవాలి. ఉడికే సమయంలో రుచిచూసి అవసరమైతే ఉప్పు, చక్కెర అడ్జస్ట్ చేసుకోవచ్చు.
- కలుపుతూ ఉడికించుకుంటే సుమారు 7 నుంచి 10 నిమిషాల్లో నీరు తగ్గిపోయి చిక్కగా అవుతుంది. అంతే టమాటో సాస్ రెడీ అయిపోతుంది.
ఈ టమాటో సాస్‍ను ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే సుమారు నెలన్నర నుంచి రెండు నెలలు నిల్వ ఉంటుంది. రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే ఫ్రెష్‍గా ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లో తయారు చేసుకునే ఈ సాస్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. రుచి కూడా బాగుంటుంది.