2025 Kia Seltos : ఇండియాలోనే బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ- ఇప్పుడు సరికొత్త అవతారంలో..
2025 Kia Seltos : సెకెండ్ జెన్ కియా సెల్టోస్ ఎస్‌యూవీకి సంబంధించిన స్పై షాట్స్ మళ్లీ ఆన్లైన్లో దర్శనమిచ్చాయి. వీటిల్లో ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్.. ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా కొనసాగుతున్న సెల్టోస్‌కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని రెడీ చేస్తోంది. ఈ కియా సెల్టోస్ 2025 ద్వితీయార్థంలో అందుబాటులోకి రావొచ్చు. ఇక ఇప్పుడు ఈ మోడల్ స్పై షాట్స్ మళ్లీ ఆన్లైన్లో దర్శనమిచ్చాయి. కొత్త సపై షాట్స్ రాబోయే కాంపాక్ట్ ఎస్యూవీ ఫ్రంట్ ప్రొఫైల్‌ని కాస్త రివీల్ చేశాయి.
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్..
కియా సెల్టోస్ భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందిన ఎస్యూవీ. ముఖ్యంగా దాని అగ్రెసివ్ డిజైన్ లాంగ్వేజ్‌కి కస్టమర్స్ ఇంప్రెస్ అవుతున్నారు. సెకండ్ జనరేషన్ మోడల్‌తో కియా మరింత బోల్డ్‌గా వెళ్లినట్లు తెలుస్తోంది.
2025 కియా సెల్టోస్ ప్రస్తుత కోణీయా హెడ్ లైట్ల మాదిరిగా కాకుండా.. ఫ్లాట్, పెద్ద ఫ్రంట్ గ్రిల్‌ను పొందుతుందని తాజా స్పై షాట్లు సూచిస్తున్నాయి. అంతేకాకుండా, ప్రస్తుత తరం మోడల్ మాదిరిగా కాకుండా 2025 సెల్టోస్ ఫ్రంట్ గ్రిల్లో వర్టికల్ స్లాట్లు కలిగి ఉంటుంది.
2025 కియా సెల్టోస్: ఇతర డిజైన్ ఎలిమెంట్స్..
భారతదేశానికి చెందిన సెల్టోస్ మునుపటి స్పై షాట్లు రాబోయే కాంపాక్ట్ ఎస్యూవీ రేర్ ప్రొఫైల్‌ని ప్రదర్శించాయి. కియా ఈవీ5ని ప్రతిధ్వనించే డిజైన్‌తో టెయిల్ ల్యాంప్స్, సంప్రదాయ ఐసీఈ డిజైన్ సమకాలీన ఈవీ ప్రభావాలతో మిళితం చేస్తాయి. స్పై షాట్ టెయిల్ లైట్లు పొడవుగా ఉంటాయని సూచిస్తున్నాయి. రేర్ విండోస్-, బూట్‌ను కలిసే స్థానం నుంచి ఈ టెయిల్ లైట్లు ప్రారంభమై బంపర్ వరకు విస్తరించి ఉంటాయి.
ఇదిలావుండగా, సెల్టోస్ ఎస్యూవీ షేప్‌లో పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చని గతంలో బయటకు వచ్చిన స్పై షాట్స్ సూచించాయి. ఏదేమైనా, రెండవ తరం రూపంలో సెల్టోస్ కొంచెం పొడవుగా ఉండొచ్చు. ఇది ఎక్కువ క్యాబిన్ లేదా కార్గో స్పేస్‌కి ఉపయోగపడుతుంది. అల్లాయ్ వీల్స్ కోసం కొత్త డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి.
సెకెండ్ జెనరేషన్ కియా సెల్టోస్: ఇంజిన్..
2025 సెల్టోస్‌లో మరో కీలక మార్పు దాని ఇంజిన్ అని చెప్పుకోవాలి! వివరాలు ఇంకా గోప్యంగా ఉన్నప్పటికీ, రెండవ తరం కియా సెల్టోస్.. హ్యుండాయ్ కోనా హైబ్రిడ్కి చెందిన 1.6-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఇది 141 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది.
అదనంగా, ప్రస్తుత 158 బీహెచ్పీ టర్బో పెట్రోల్ ఇంజిన్, 114 బీహెచ్పీ డీజిల్ ఇంజిన్ కొత్త మోడల్‌తో కొనసాగే అవకాశం ఉంది. 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ క్లచ్‌లెస్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, సీవీటీ, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.
2025 కియా సెల్టోస్ ఎస్‌యూవీకి సంబంధించిన వివరాలు రానున్న కాలంలో అందుబాటులోకి రావొచ్చు.
సంబంధిత కథనం