Skoda Kylaq : స్కోడా కొత్త ఎస్‌యూవీకి క్రేజీ డిమాండ్- హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే..
Best SUV in India : ఇటీవలే లాంచ్ అయిన స్కోడా కైలాక్ ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయిత హైదరాబాద్‌లో స్కోడా కైలాక్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి. మీ బడ్జెట్ ప్లాన్స్‌కి ఈ డేటా ఉపయోగపడుతుంది.
భారత దేశ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్యూవీ సెగ్మెంట్లో ఇటీవలే లాంచ్ అయిన స్కోడా కైలాక్ సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం 10 రోజుల్లోనే 10,000కు పైగా బుకింగ్‌లను సాధించి సరికొత్త రికార్డును రాసింది. మరి ఈ ఎస్‌యూవీని మీరు కూడా కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. హైదరాబాద్‌లో స్కోడా కైలాక్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్‌లో స్కోడా కైలాక్ ఆన్‌రోడ్ ప్రైజ్..
- స్కోడా కైలాక్ క్లాసిక్- రూ. 9.35 లక్షలు
- సిగ్నేచర్- రూ. 11.35 లక్షలు
- సిగ్నేచర్ ఏటీ- రూ. 12.95 లక్షలు
- సిగ్నేచర్ ప్లస్- రూ. 13.95 లక్షలు
- సిగ్నేచర్ ప్లస్ ఏటీ- రూ. 15.15 లక్షలు
- ప్రెస్టీజ్- రూ. 16.30 లక్షలు
- ప్రెస్టీజ్ ఏటీ- రూ. 17.58 లక్షలు
అంటే హైదరాబాద్‌లో స్కోడా కైలాక్ ఎస్యూవీ ఆన్‌రోడ్ ప్రైజ్ ధరలు రూ. 9.35లక్షలు- రూ. 17.58 లక్షల మధ్యలో ఉంటుంది. ఈ ఎస్యూవీ వేరియంట్లన్నీ పెట్రోల్ ఇంజిన్‌తోనే వస్తాయి. డీజిల్ ఇంజిన్ని సంస్థ లాంచ్ చేయలేదు.
సాధారణంగా వెహికల్‌కి ఎక్స్‌షోరూం ప్రైజ్, ఆన్‌రోడ్ ప్రైజ్‌లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్‌ని లాంచ్ చేసే సమయంలో ఆటోమొబైల్ సంస్థలు ఎక్స్‌షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్‌రోడ్ ప్రైజ్ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్‌ని కొనే ముందు, ఎక్స్‌షోరూం ప్రైజ్ కాకుండా ఆన్‌రోడ్ ప్రైజ్ తెలుసుకుని బడ్జెట్ వేసుకోవాలి.
మీ సమీప డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శిస్తే స్కోడా కైలాక్ టెస్ట్ డ్రైవ్‌తో పాటు ఆఫర్స్, డిస్కౌంట్స్ వంటి వివరాలపైనా క్లారిటీ వస్తుంది. ఆ మేరకు మీరు మీ బడ్జెట్‌ని ప్లాన్ చేసుకోవచ్చు.
బుకింగ్స్.. డెలివరీలు..
గత నెల లాంచ్ అయిన స్కోడా కైలాక్ బుకింగ్స్ డిసెంబర్ 2న ప్రారంభమయ్యాయి. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు జనవరి 27 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. కాగా స్కోడా ఇండియా కైలాక్‌ని ఇప్పటికే ను బుక్ చేసుకున్న మొదటి 33,333 కస్టమర్‌లకు పరిమిత ఆఫర్‌ను ప్రకటించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. వారు కాంప్లిమెంటరీగా 3 సంవత్సరాల స్టాండర్డ్ మెయింటెనెన్స్ ప్యాకేజీని పొందుతారు. అలాగే ఈ కారు మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుందని స్కోడా హామీ ఇస్తోంది.
స్కోడా కైలాక్ లో 1.0-లీటర్ టీఎస్ఐ ఇంజిన్ ఉంటుంది. ఇది 115 బీహెచ్పీ పవర్, 178 ఎన్ఎం టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.
ఈ స్కోడా కైలాక్ ఎస్యూవీ కియా సోనెట్, టాటా పంచ్, హోండా ఎలివేట్, హ్యుందాయ్ క్రేటా వంటి మోడల్స్‌కి గట్టిపోటీ ఇస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం