కిడ్నీలో రాళ్లు ఉంటే విపరీతమైన నొప్పి వస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించేందుకు మాంస పదార్థాలు, సోడా, డ్రైఫ్రూట్స్ వంటి ట్రిగ్గర్లకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
pexels
By Bandaru Satyaprasad Dec 14, 2024
Hindustan Times Telugu
లంచ్ మీట్ లో సోడియం, కొవ్వు, నైట్రేట్ ల వంటి ప్రిజర్వేటివ్ లు అధికంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కారణం అవుతాయని వైద్యులు అంటున్నారు.
pexels
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యకరమైనప్పటికీ వీటిలో ఆక్సలేట్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి యూరిన్ లోని కాల్ఫియంతో....కాల్షియం ఆక్సలేట్ రాళ్లను ఏర్పరుస్తాయి.
pexels
చక్కెర పానీయాలు, సోడా పాప్ ముఖ్యంగా కోలాస్ లో ఫాస్పోరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇందులోని అధిక చక్కెర కంటెంట్ ఊబకాయాన్ని పెంచడానికి, ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది.
pexels
లంచ్ మీట్ లో అధిక ఉప్పు, సోడియం, రుచిని పెంచే రసాయనాలు మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దోహదం చేస్తాయి.
pexels
పెరుగు లేదా చీజ్ వంటి పాల ఉత్పత్తులు కిడ్నీల్లో రాళ్లను నిరోధిస్తాయి.
pexels
బీన్స్ లేదా కాయ ధాన్యాల వంటి మొక్కల ఆధారిత ప్రొటీన్లు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
pexels
సిట్రిక్ పండ్లు -నిమ్మకాయలు లేదా నారింజ వంటి సిట్రిక్ పండ్లు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి.
pexels
పాలు లేదా బ్రోకలీ వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
pexels
నీరు ఎక్కువగా తాగండి. నీరు కిడ్నీలో స్టోన్ ఏర్పడకుండా నివారిస్తుంది.
pexels
ఆహారంలో చేర్చాల్సిన బ్లాక్ ఫుడ్స్, వీటిని తరచూ తినాల్సిందే