Discounts on Honda cars : ఈ హోండా ఎస్​యూవీ, సెడాన్​లపై భారీ డిస్కౌంట్స్​- డబ్బులు ఆదా చేసుకోండి..-honda elevate city and 2nd gen amaze gets huge benefits check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Discounts On Honda Cars : ఈ హోండా ఎస్​యూవీ, సెడాన్​లపై భారీ డిస్కౌంట్స్​- డబ్బులు ఆదా చేసుకోండి..

Discounts on Honda cars : ఈ హోండా ఎస్​యూవీ, సెడాన్​లపై భారీ డిస్కౌంట్స్​- డబ్బులు ఆదా చేసుకోండి..

Sharath Chitturi HT Telugu
Dec 13, 2024 12:10 PM IST

Car discounts : హోండా ఎలివేట్​, హోండా సిటీ, సెకెండ్​ జెనరేషన్​ హోండా అమేజ్​లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ‘2025 జనవరిలో ధరలు పెరిగే లోపే ఈ డిస్కౌంట్స్​ని పొందండి’ అని సంస్థ ప్రకటించింది.

హోండా వాహనాలపై భారీ డిస్కౌంట్స్​.. చూసేయండి..
హోండా వాహనాలపై భారీ డిస్కౌంట్స్​.. చూసేయండి..

2025 జనవరిలో వాహనాల ధరలను పెంచుతున్న ఆటోమొబైల్​ సంస్థలు., 2024 ముగింపు సమయంలో సేల్స్​ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే హోండా సంస్థ తాజాగా తన పోర్ట్​ఫోలియోలోని పలు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​పై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించింది. హోండా తన సిటీ, సిటీ ఈ:హెచ్​ఈవీ, ఎలివేట్, అమేజ్ (సెకండ్ జనరేషన్) మోడళ్లపై రూ .1.14 లక్షల వరకు బెనిఫిట్స్​ని ప్రకటించింది. 

yearly horoscope entry point

జపనీస్ కార్ల తయారీదారు నుంచి హాలిడే సీజన్ ఆఫర్లలో 7 సంవత్సరాల వారంటీ (ప్రామాణిక 3 సంవత్సరాల వారంటీ, 4 నుంచి 7వ సంవత్సరం వరకు ఎక్స్​టెండెడ్​ కవరేజీని కలిగి ఉంటుంది.), 8 సంవత్సరాల అష్యూర్డ్​ బైబ్యాక్ ధర ప్రోగ్రామ్​ (3 నుంచి 8 వ సంవత్సరం ఓనర్​షిప్​) ఉన్నాయి. స్క్రాచ్ కార్డు ద్వారా రూ.4 లక్షల వరకు వివిధ బహుమతులను గెలుచుకునే అవకాశం కూడా హోండా అందిస్తోంది.

హోండా డిసెంబర్ ఆఫర్లు: ఈ బెనిఫిట్స్​..

హోండా సిటీపై 1.14 లక్షల వరకు ప్రయోజనాలు, సెకెండ్​ జెన్​ హోండా అమేజ్​పై రూ .1.12 లక్షల వరకు ప్రయోజనాలు, ఎలివేట్​ ఎస్​యూవీపై రూ .95,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. సిటీ ఈ:హెచ్​ఈవీ వేరియంట్​పై రూ .90,000 వరకు ప్రయోజనాలు పొందొచ్చు.

ఈ ఆఫర్లు తమిళనాడులో వర్తించవు అని గుర్తుపెట్టుకోవాలి. 2024 డిసెంబర్​ చివరి వరకు లేదా స్టాక్​ ఉన్నంత వరకే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. సిటీ ఈ:హెచ్​ఈవీ, ఎలివేట్ అపెక్స్ ఎడిషన్లకు ఎక్స్​టెండెడ్​ వారంటీ వర్తించదని హోండా పేర్కొంది.

డిసెంబర్ ఆఫర్లు: స్క్రాచ్ అండ్ విన్..

స్క్రాచ్​ అండ్ విన్ కార్డుల్లో విజేతలకు 3 డే/2 నైట్స్ హాలిడే వోచర్, రూ.4 లక్షలు, రూ.లక్ష చెక్కులు, ఐఫోన్ 16 128 జీబీ, ఎయిర్ ప్యూరిఫైయర్, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్, ఇతర బహుమతులను ఇస్తున్నట్టు సంస్థ వెల్లడిచింది.

జనవరిలో ధరల పెంపు ఖాయమేనా?

2025 జనవరి నుంచి వాహనాల ధరలను పెంచుతున్నట్టు ఇప్పటికే అనేక సంస్థలు ప్రకటించాయి. కానీ హోండా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, “2025 జనవరిలో ధరలు పెరిగే లోపే కొనేయండి,” అని ఒక పోస్టర్​ పెట్టింది. అంటే, హోండా కూడా వాహనాల ధరల పెంపు ఉద్దేశంలో ఉందని దీని ద్వారా స్పష్టమవుతుంది.

ఈ కార్లపై బంపర్ ఆఫర్స్..

మారుతీ సుజుకీ సంస్థ కూడ తన పోర్ట్​ఫోలియోలోని పలు వాహనాలపై డిస్కౌంట్స్​ని ప్రకటించింది.

మారుతీ సుజుకీ ఆల్టో K10 టాప్-స్పెక్ వీఎక్స్​ఐ+ (డ్రీమ్ సిరీస్) ట్రిమ్‌ని ఎంచుకోవాలనుకుంటే రూ. 43,302 నగదు తగ్గింపు లభిస్తుంది. అదే సమయంలో దాని మాన్యువల్, సీఎన్జీ వేరియంట్‌లపై రూ.40,000 నగదు తగ్గింపు అందుబాటులో ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం