Anchor Suma: 4 రోజులు స్నానం చేయని ప్రేరణ, గర్ల్‌ఫ్రెండ్ బ్రష్ వాడిన గౌతమ్.. బిగ్ బాస్‌లో సుమ టాస్క్ (వీడియో)-anchor suma enters bigg boss telugu 8 house fun with top 5 finalists bigg boss 8 telugu december 14 episode highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anchor Suma: 4 రోజులు స్నానం చేయని ప్రేరణ, గర్ల్‌ఫ్రెండ్ బ్రష్ వాడిన గౌతమ్.. బిగ్ బాస్‌లో సుమ టాస్క్ (వీడియో)

Anchor Suma: 4 రోజులు స్నానం చేయని ప్రేరణ, గర్ల్‌ఫ్రెండ్ బ్రష్ వాడిన గౌతమ్.. బిగ్ బాస్‌లో సుమ టాస్క్ (వీడియో)

Sanjiv Kumar HT Telugu
Dec 14, 2024 01:38 PM IST

Bigg Boss Telugu 8 December 14 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8లోకి యాంకర్ సుమ అడుగుపెట్టింది. హౌజ్‌లో ఉన్న టాప్ 5 ఫైనలిస్ట్స్‌లతో సుమ టాస్క్ ఆడించింది. ఈ టాస్క్‌లో 4 రోజుల వరకు స్నానం చేయకుండా ఉన్నట్లు ప్రేరణ చెప్పింది. బిగ్ బాస్ తెలుగు 8 డిసెంబర్ 14 ఎపిసోడ్ ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు.

4 రోజులు స్నానం చేయని ప్రేరణ, గర్ల్‌ఫ్రెండ్ బ్రష్ వాడిన గౌతమ్.. బిగ్ బాస్‌లో సుమ టాస్క్ (వీడియో)
4 రోజులు స్నానం చేయని ప్రేరణ, గర్ల్‌ఫ్రెండ్ బ్రష్ వాడిన గౌతమ్.. బిగ్ బాస్‌లో సుమ టాస్క్ (వీడియో) (Star Maa/YouTube)

Bigg Boss 8 Telugu Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లో టాప్ 5 ఫైనలిస్ట్స్ అందరూ ఇంకా ఒక్కరోజే ఉండనున్నారు. వారందరికి బిగ్ బాస్ హౌజ్‌లో ఇవాళే (డిసెంబర్ 14) ఆఖరి రోజు. రేపు (డిసెంబర్ 15) గ్రాండ్ ఫినాలే నిర్వహించి బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌ను ప్రకటించనున్నారు.

మీ వాయిస్-నా నాయిస్

అయితే, బిగ్ బాస్ తెలుగు 8 చివరి రోజు స్పెషల్‌గా ఉండాలన్న ఉద్దేశంతో స్టార్ యాంకర్ సుమ కనకాలను హౌజ్‌లోకి దింపారు. "మీ వాయిస్.. నా నాయిస్ ఎప్పటికీ ఓల్డ్ అయిపోదు" అని బిగ్ బాస్‌తో సుమ అంది. తర్వాత టాప్ 5 ఫైనలిస్ట్‌లతో యాంకర్ సుమ ఒక టాస్క్ ఆడించింది. సుమ కొన్ని ప్రశ్నలు వేస్తుంది. అవి నిజం అయితే వారు పక్కన ఉన్న డ్రింక్స్ తాగాలి.

"నేను ఎప్పుడు ఈ పని చేయలేదు అనేది టాస్క్. మూడు రోజులు స్నానం చేయకుండా ఉండలేదు" అని యాంకర్ సుమ అడిగింది. దాంతో వెంటనే ప్రేరణ డ్రింక్ తాగడానికి వెళ్లింది. "అర్థమై వెళ్తుందా, అర్థం కాకుండా వెళ్తుందా" అని సుమ కనకాల పంచ్ వేసింది. దాంతో "ఫోర్ డేస్" అని ప్రేరణ అంది. దానికి షాక్ అయిన సుమ "నాలుగు రోజులు స్నానం చేయకుండా ఉన్నావా" అని ఆశ్చర్యపోయి అడిగింది.

యాక్టివ్‌గా ఉండను

"నా ఎక్స్ అటెన్షన్‌ను గ్రాబ్ చేయడానికి ఎప్పుడు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయలేదు" అని సుమ అడిగితే ప్రేరణ, గౌతమ్ వెళ్లారు. "చేశావా.. అన్ని చేసే ఉంటావ్" అని ప్రేరణను యాంకర్ సుమ అంది. "నిఖిల్ ఒక్కసారి కూడా అలాంటి పోస్ట్‌లు పెట్టలేదా" అని సుమ అడిగింది. "బేసిక్‌గా నేను సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండను" అని నిఖిల్ సమాధానం ఇచ్చాడు.

దానికి "బిగ్ బాస్‌కు వచ్చిన 5 డేస్ కూడా అంతగా యాక్టివ్‌గా లేకుండే" అని ఇన్‌డైరెక్ట్‌గా సోనియా ఆకులను లాగుతూ పంచ్ వేశాడు అవినాష్. దాంతో అవినాష్ భుజంపై చేయి వేసి నొక్కాడు నిఖిల్. దానికి అంతా నవ్వేశారు. "నేను ఎప్పుడు వేరేవాళ్ల టూత్ బ్రష్ వాడలేదు" అని యాంకర్ సుమ అడిగింది. దాంతో ప్రేరణ తప్పా గౌతమ్, నిఖిల్, అవినాష్, నబీల్ నలుగురు డ్రింక్ తాగడానికి వెళ్లారు.

డేట్ చేసిన గర్ల్‌ఫ్రెండ్

అది చూసి ప్రేరణ నోరెళ్లబెట్టింది. "బాబోయ్.. బాయ్స్.. బాయ్స్.. యూ గలీజ్.. గలీజ్ ఫెలోస్.." అని యాంకర్ సుమ చీదరించుకుంది. "వేరేవాళ్లంటే ఎవరో కాదండి.. డేట్ చేసిన గర్ల్‌ఫ్రెండ్" అని గౌతమ్ వివరణ ఇచ్చుకున్నాడు. అంటే, తన లవర్ టూత్ బ్రష్‌ను వాడినట్లు గౌతమ్ ఒప్పుకున్నట్లు అయింది. గౌతమ్ ఆన్సర్‌కు "అది కూడా యాక్" అని ప్రేరణ అంది.

"పబ్లిక్‌లో ఎప్పుడు ఫార్ట్ చేయలేదు" అని సుమ అడిగితే.. అవినాష్ ఒక్కడే డ్రింక్ తాగడానికి వెళ్లాడు. దాంతో "ఇక్కడే వేస్తూ ఉంటాడు" అని నిఖిల్ అంటే "నాలుగు వదిలేసి వెళ్లాడు" అని ప్రేరణ అంది. "అదేమైనా ఈశాన్య మూల, ఆగ్నేయ మూల అనుకున్నావా" అన్న సుమ స్నేహితుడు సినిమాలోని ఫార్టింగ్‌పై చెప్పే స్పీచ్ డైలాగ్‌లు కొట్టింది.

ప్రాణ సంకటం

"డర్రు.. బుర్రు భయం నాస్తి.. ఈయి.. కుయి.. ఇంచుక్తిపయ్యి.. ప్రాణ సంకటం" అని యాంకర్ సుమ అంటే.. అవినాష్ వచ్చి కింద కూర్చున్నాడు. దీంట్లో కూడా ఎంత గొప్పగా చెప్పారమ్మా మీరు అని చేతులెత్తి దండం పెట్డాడు అవినాష్. దాంతో సుమ నవ్వుకుంటూ పక్కకు వెళ్లింది. ఇలా బిగ్ బాస్ తెలుగు 8 డిసెంబర్ 14 ఎపిసోడ్ ప్రోమో వీడియో ముగిసింది.

Whats_app_banner