Telangana Students : విద్యార్థులపై వరాల జల్లు.. కీలక ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-cm revanth promises free electricity to all government schools in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Students : విద్యార్థులపై వరాల జల్లు.. కీలక ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Telangana Students : విద్యార్థులపై వరాల జల్లు.. కీలక ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Basani Shiva Kumar HT Telugu
Dec 14, 2024 01:54 PM IST

Telangana Students : తెలంగాణ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. చిల్కూరులోని టీజీ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ స్కూల్​కు వచ్చిన సీఎం.. విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు కామన్ డైట్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరులోని టీజీ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ స్కూల్​కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కామన్ డైట్ ప్లాన్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులపై వరాల జల్లు కురిపించారు. 'పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అధికారులపై ఉంది. ఆ బాధ్యతను మనం గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులను నిర్లక్ష్యం చేయొద్దు. ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థిని చనిపోవడం బాధాకరం. డైట్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. బాధ్యులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదు' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

'విద్యార్థుల ఫుడ్ విషయంలో వస్తున్న సమస్యలపై స్వయంగా సమీక్షించాను. బిల్లుల సమస్య ఉందని చెప్పారు. అందుకే ఇకనుంచి ప్రతీనెల 10వ తేదీలోపు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు చెల్లిస్తాం. ఒక్కరూపాయి పెండింగ్ లేకుండా రెషిడెన్షియల్ విద్యాలయాలకు బిల్లులు చెల్లిస్తాం. స్వయంగా నేనే దీన్ని మానిటరింగ్ చేస్తా. పెండింగ్ లేకుండా చేస్తా. మహిళా సంఘాలకు విద్యార్థుల దుస్తులు కుట్టే బాధ్యతను అప్పగించాలి. దీనికి సంబంధించి రూ.30 ఛార్జీలను 70 రూపాయలకు పెంచుతాం' అని సీఎం ప్రకటించారు.

'చదువుకునే విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నాం. ఉచితంగా కరెంటు ఉవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. ఇప్పటికే రైతులకు ఉచితంగా 24 గంటలు, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. అందుకే విద్యార్థులకు ఎందుకు ఇవ్వొద్దని.. ఆలోచించాం. రాష్ట్రంలోని ప్రతీ ప్రభుత్వ పాఠశాల, గురుకులాలకు ఉచితంగా విద్యుత్ అందించాలని నిర్ణయించాం. ఒక్క రూపాయి కూడా కరెంట్ బిల్లు చెల్లించొద్దు' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

'జిల్లా కలెక్టర్ నుంచి లోకల్ ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎస్సై.. వరకు అందరు అధికారులు హాస్టళ్లను సందర్శిస్తారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తారు. సీఎస్ నుంచి లోకల్ అధికారుల వరకు మీ దగ్గరకు రావాలని ఆదేశాలు ఇచ్చాం. వారిని చూసి మన విద్యార్థులు ఇన్‌స్పైర్ అవుతారు. అలాగే విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచేలా ఆలోచన చేస్తున్నాం. విద్యార్థుల విషయంలో ప్రభుత్వ రాజీ పడటం లేదు. బాగా చదువుకొని నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి' అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Whats_app_banner