తెలుగు న్యూస్ / ఫోటో /
Trisha: 22 ఏళ్ల తర్వాత సూర్యతో త్రిష రొమాన్స్ - రొమాంటిక్ మూవీ కోసం జోడీ కుదిరింది!
Trisha: 22 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సూర్య, త్రిష జోడీ కొట్టబోతున్నారు. సూర్య కొత్త మూవీలో త్రిష హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది.
(1 / 5)
సూర్య హీరోగా ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ యాక్షన్ మూవీ రాబోతుంది. సూర్య హీరోగా నటిస్తోన్న 45వ సినిమా ఇది.
(2 / 5)
ఈ మూవీలో సూర్య సరసన త్రిష హీరోయిన్‌గా నటించబోతున్నట్లు శనివారం మేకర్స్ ప్రకటించారు.
(3 / 5)
సూర్య, త్రిష కాంబోలో గతంలో ఆరు, మౌనమ్ పేసియాదే (తెలుగులో కంచు) సినిమాలు వచ్చాయి. దాదాపు ఇరవై రెండేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి చేస్తోన్న సినిమా ఇదే కావడం గమనార్హం.
(4 / 5)
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఆరు సినిమాలు చేస్తోంది త్రిష. కమల్‌హాసన్ థగ్‌లైఫ్, అజిత్, గుడ్ బ్యాడ్ అగ్లీ, విదా ముయార్చి, చిరంజీవి విశ్వంభర సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇతర గ్యాలరీలు