Tourism: దక్షిణ భారతంలో మంచు కురిసే ఏకైక ప్రాంతం ఏదో తెలుసా? ఏపీలోనే.. అక్కడికి ఎలా వెళ్లాలంటే..-lambasingi is the only snow fall place in south india know how to reach there via bus train and flight ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tourism: దక్షిణ భారతంలో మంచు కురిసే ఏకైక ప్రాంతం ఏదో తెలుసా? ఏపీలోనే.. అక్కడికి ఎలా వెళ్లాలంటే..

Tourism: దక్షిణ భారతంలో మంచు కురిసే ఏకైక ప్రాంతం ఏదో తెలుసా? ఏపీలోనే.. అక్కడికి ఎలా వెళ్లాలంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 29, 2024 02:00 PM IST

Tourism: చలికాలంలో దక్షిణ భారతదేశంలో మంచు కురిసే ప్రాంతం కూడా ఉంది. పొగ మంచు కాకుండా.. నేరుగా మంచే ఎక్కడ కురుస్తుంది. ఈ ప్రాంతం ఉన్నది ఆంధ్రప్రదేశ్‍లోనే.

Tourism: దక్షిణ భారతంలో మంచు కురిసే ఏకైక ప్రాంతం ఏదో తెలుసా? ఏపీలోనే.. అక్కడికి ఎలా వెళ్లాలంటే..
Tourism: దక్షిణ భారతంలో మంచు కురిసే ఏకైక ప్రాంతం ఏదో తెలుసా? ఏపీలోనే.. అక్కడికి ఎలా వెళ్లాలంటే..

శీతాకాలంలో దక్షిణ భారత దేశంలో చలి తీవ్రత పెరుగుతుంది, పొగ మంచు ఎక్కువగా ఉంటుంది. కానీ కశ్మీర్‌లా మంచు కురవదు. కానీ, ఒక్క ప్రాంతానికి మాత్రం ఇది మినహాయింపు. దక్షిణ భారతంలోని ఓ ప్రాంతంలో చలికాలంలో మంచు కురుస్తుంది. అదే లంబసింగి. ఆంధ్రప్రదేశ్‍లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో లంబసింగి ఉంది. ఈ గ్రామంలో చలికాలంలో నిత్యం కాకపోయినా అప్పడప్పుడు మంచు కురుస్తుంది. సౌత్ ఇండియాలో మంచు పడే ఏకైక ప్రాంతంగా ఈ గ్రామం ఉంది. లంబసింగిని ‘ఆంధ్రప్రదేశ్ కశ్మీర్’ అని కూడా పిలుస్తారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

ప్రకృతి అందాలు.. సున్నా ఉష్ణోగ్రత

లంబసింగిలో కొండలు, పచ్చదనంతో ప్రకృతి అందాలు మనసును దోచేస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. చాలాసార్లు కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్ అంతకంటే తక్కువకు కూడా పడిపోతుంటాయి. చల్లటి వాతావరణంలో ఇక్కడ ఆహ్లాదకరమైన ప్రకృతి పరవశింపజేస్తుంది.

చలికాలంలో హిమపాతం ఎప్పుడు?

లంబసింగికి వెళ్లేందుకు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య సరైన సమయం. ఈ కాలంలో ఇక్కడ అప్పుడప్పుడు మంచు కురుస్తుంది. అయితే, ఎప్పుడూ కురుస్తూ ఉండదు. డిసెంబర్, జనవరి మధ్య వెళితే అదృష్టం ఉంటే ఇక్కడ మంచు కురవడం చూడొచ్చు. అయితే, ఈ కాలంలో మీరు వెళ్లిన సమయంలో లంబసింగిలో మంచు కురవకపోయినా వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉంటుంది. శీతల పరిస్థితులను బాగా ఆస్వాదించవచ్చు. ప్రకృతిని ఎంజాయ్ చేయవచ్చు. మంచి అనుభూతి కలుగుతుంది.

లంబసింగి ఎలా వెళ్లాలి?

లంబసింగికి సమీపంలో ఉన్న ప్రధానమైన నగరం విశాఖపట్నం. హైదరాబాద్ సహా ఇతర నగరాల నుంచి లంబసింగి వెళ్లాలంటే ముందుగా విశాఖపట్నం చేరాలి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో చేరుకోవచ్చు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా లంబసింగి వెళ్లవచ్చు.

హైదరాబాద్ నుంచి విశాఖకు రోడ్డు మార్గం ద్వారా బస్సులు లేదా సొంత వాహనాల్లో వెళ్లవచ్చు. రైళ్లు, విమానాలు కూడా రెగ్యులర్‌గా ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా లంబసింగి వెళ్లాలంటే ముందుగా విశాఖ చేరడం బెస్ట్. విశాఖపట్నం నుంచి లంబసింగి సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి రోడ్డు మార్గంలో వెళ్లాలి. అనకాపల్లి, తాళ్లపాలెం, నర్సీపట్నం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం కూడా మంచి మజా ఇస్తుంది.

లంబసింగి పరిసరాల్లో పర్యాటక ప్రాంతాలు

లంబసింగిలో వాతావరణాన్ని ఎంజాయ్ చేయవచ్చు. అలాగే చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి. లంబసింగికి రెండు కిలోమీటర్ల దూరంలో తాజంగి జలాశయం ఉంటుంది. ఇక్కడికి వెళ్లే దారి కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ రిజర్వాయర్ వద్ద బోటింగ్ కూడా చేయవచ్చు. ఇక్కడి జిప్‍వేలో జారుతూ ప్రకృతి అందాలు పైకి నుంచి తలకించవచ్చు. గిరిజన గూడేలు కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

లంబసింగికి 40 కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేయవచ్చు. జలపాతంలో స్నానం చేయవచ్చు. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలంలో ఈ జలపాతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. లంబసింగి సమీపంలోని వంజంగి కొండ కూడా ఆకట్టుకుంటుంది. ట్రెక్కింగ్ ఇష్టమైన వారు చెరువుల వేనంకు వెళ్లవచ్చు.

Whats_app_banner