తెలుగు న్యూస్ / ఫోటో /
Araku Simhachalam Tour : ఒకే ట్రిప్ లో అరకు, సింహాచలం దర్శనం - ఈ టూరిస్ట్ ప్లేసులన్నీ చూడొచ్చు, తాజా ప్యాకేజీ వివరాలు
- Simhachalam Arakku Tour 2024: అరకు అందాలను చూడటంతో పాటు సింహాచలం అప్పన్నను దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. విశాఖ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. టికెట్ ధరలు , టూర్ షెడ్యూల్ వివరాలను ఇక్కడ చూడండి……
- Simhachalam Arakku Tour 2024: అరకు అందాలను చూడటంతో పాటు సింహాచలం అప్పన్నను దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. విశాఖ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. టికెట్ ధరలు , టూర్ షెడ్యూల్ వివరాలను ఇక్కడ చూడండి……
(1 / 8)
వేర్వేురు టూరిజం ప్రదేశాలను చూసేందుకు IRCTC టూరిజం కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది . తక్కువ ధరలోనే వీటిని ఆపరేట్ చేస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని టూరిస్టుల కోసం అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది.(image source unsplash.com)
(2 / 8)
'వైజాగ్ రీట్రీట్' పేరుతో ప్యాకేజీని తీసుకువచ్చింది IRCTC టూరిజం. ఇందులో భాగంగా విశాఖ, అరకు, సింహాచలం చూసి రావొచ్చు. (image source unsplash.com)
(3 / 8)
ప్రస్తుతం ఈ ప్యాకేజీ డిసెంబర్ 05 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. బస్సు జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. (image source unsplash.com)
(4 / 8)
టూర్ షెడ్యూల్ ప్రకారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ నుంచి టూరిస్టులను పికప్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత తొట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్, రామానాయుడు ఫిలిం స్టూడియో, ఫిషింగ్ హార్బర్ లాంటి టూరిస్ట్ స్పాట్స్‌కి తీసుకెళ్తారు. రాత్రి వైజాగ్ లోనే ఉంటారు.(image source unsplash.com)
(5 / 8)
రెండో రోజు ఉదయం 8 గంటలకు అరకు బయల్దేరుతారు. ఈ జర్నీచాలా బాగుంటుంది. దారిలో పద్మపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శించిన తర్వాత రాత్రికి విశాఖపట్నం చేరుకుంటారు. మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సింహాచలం హాఫ్ డే టూర్ ఉంటుంది. ఆ తర్వాత విశాఖపట్నం తిరిగి రావాలి. లంచ్ తర్వాత Submarine Museum ను చూడొచ్చు,(image source unsplash.com)
(6 / 8)
టూరిస్టులు ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ దగ్గర దిగొచ్చు. దీంతో ప్యాకేజీ ముగుస్తుంది.(image source unsplash.com)
(7 / 8)
వైజాగ్ రీట్రీట్ టూర్ ప్యాకేజీ ధరలు : కంఫర్ట్ క్లాస్ లో ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.7990, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.10980, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.19,950గా ఉన్నాయి. 5 - 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు(image source unsplash.com)
ఇతర గ్యాలరీలు