Pushpa 2 Collection: ఒక్కరోజులోనే 74 శాతం పెరిగిన పుష్ప 2 కలెక్షన్స్- RRR మూవీనే టార్గెట్- ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Pushpa 2 The Rule 10 Days Worldwide Box Office Collection: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ మూవీ కలెక్షన్స్ ఒక్కరోజులో 70 శాతం వరకు పెరిగాయి. అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్ నేపథ్యంలో పుష్ప 2 కలెక్షన్స్ పెరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పుష్ప 2 ది రూల్ 10 రోజుల కలెక్షన్స్ చూస్తే..
Pushpa 2 Box Office Collection Day 10: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, రిలీజ్ సంఘటన హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 ది రూల్ కలెక్షన్స్ పెరుగుదల, తగ్గింపుపై ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, అల్లు అర్జున్ రిలీజ్ తర్వాత రోజే పుష్ప 2 ది రూల్ కలెక్షన్స్ భారీగా పెరిగిపోయాయి.
పదో రోజునే 70 శాతానికి పైగా
అలాగే, పుష్ప 2 కలెక్షన్స్ పెరగడానికి శనివారం అయిన వీకెండ్ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన పుష్ప 2 దేశీయ మార్కెట్లో ఒక్క పదో రోజునే 73.93 శాతం అంటే సుమారుగా 74 శాతం, వరల్డ్ వైడ్‌గా 70% కలెక్షన్స్ పెరిగినట్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది.
పుష్ప 2 డే 10 కలెక్షన్స్
పుష్ప 2 ది రూల్ సినిమా పదో రోజున ఇండియాలో రూ. 63.3 కోట్ల నెట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. వాటిలో తెలుగు నుంచి రూ. 13.75 కోట్లు, హిందీ నుంచి 46 కోట్లు, తమిళం వెర్షన్‌కు 2.7 కోట్లు, కర్ణాటకలో 45 లక్షలు, మలయాళంలో 4 లక్షలు కలెక్ట్ చేసింది. ఇక 10 రోజుల్లో పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 825.5 కోట్లు కొల్లగొట్టింది.
ఒక్కో రాష్ట్రంలోని కలెక్షన్స్
ఇందులో తెలుగు ద్వారా రూ. 263.35 కోట్లు, హిందీ నుంచి 498.1 కోట్లు, తమిళంలో 45.1 కోట్లు, కన్నడ వెర్షన్‌కు 5.95 కోట్లు, మలయాళంలో రూ. 13 కోట్లు వసూలు చేసింది పుష్ప 2 ది రూల్ మూవీ. ఇక వరల్డ్ వైడ్‌గా పుష్ప 2 సినిమాకు 10 రోజుల్లో రూ. 1190 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయినట్లు సమాచారం. అంటే, దాదాపుగా రూ. 1200 కోట్లను పది రోజుల్లోనే పుష్ప 2 కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.
రెండు సినిమాలను బీట్ చేసేలా
అయితే, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ లైఫ్ టైమ్ టోటల్ కలెక్షన్స్ (రూ. 1148 కోట్లు)ను పుష్ప 2 పది రోజుల్లోనే బీట్ చేయడం విశేషం. అలాగే, కన్నడ స్టార్ హీరో యశ్ బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్ 2 టోటల్ కలెక్షన్స్ (రూ. 1208 కోట్లు) ఇవాళ అంటే 11 రోజుల్లో బీట్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ లైఫ్ టైమ్ కలెక్షన్స్
ఈ రెండింటితోపాటు మరికొన్ని రోజుల్లో ఆర్ఆర్ఆర్ లైఫ్ టైమ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ (రూ. 1300 కోట్లు)ను కూడా పుష్ప 2 క్రాస్ చేసే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, రూ. 620 కోట్ల వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన పుష్ప 2 ది రూల్ మూవీకి ఇంకా రూ. 60 కోట్లకుపైగా కలెక్షన్స్ వస్తేనే క్లీన్ హిట్‌గా నిలుస్తుందని సమాచారం.