Bigg Boss Vishnupriya: తనను తిట్టే సోనియా కాళ్లు మొక్కిన విష్ణుప్రియ.. జారుతున్నవురో అంటూ యశ్మీ వెటకారం.. పృథ్వీ అరాచకం
Bigg Boss Telugu 8 September 12th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో కంటిన్యూగా టాస్కులు ఆడించారు. బిగ్ బాస్ కట్ చేసిన రూ. 2 లక్షల ప్రైజ్ మనీని సంపాదించుకునేందుకు మూడు క్లాన్స్ గేమ్స్ ఆడారు. ఈ క్రమంలోనే తనను ఎప్పుడు తిట్టే సోనియా కాళ్లు మొక్కింది విష్ణుప్రియ.
Bigg Boss Telugu 8 Day 11 Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 12వ తేది ఎపిసోడ్‌లో ఊహించని సంఘనటలు జరిగాయి. సోనియా, యశ్మీ, పృథ్వీ మరి చిరాకు పెట్టించేలా ప్రవర్తించారు. గతంలో ఏ సీజన్ కంటెస్టెంట్స్ బిహేవ్ చేయనివిధంగా రచ్చ చేశారు. నోరు వేసుకుని ఇతరులపై పడిపోవడం తప్పితే వాళ్లు చేసింది ఏం కనిపించలేదు.
ఈ ముగ్గురు టాస్క్‌లు ఆడేది తక్కువ అరచుకోవడం ఎక్కువ అన్నట్లుగా కనిపించారు. టాస్క్‌లను నిజాయతీగా ఆడటం కంటే ఎదుటి కంటెస్టెంట్ గేమ్ చెడగొట్టడంలో పృథ్వీరాజ్ ముందున్నాడు. అయినా, ఏ ఒక్క టాస్క్ గెలవలేదు. ఇక సోనియా అయితే ఎదుటివాళ్లను విమర్శించడం, బాధ్యత, పర్ఫెక్షన్ అని మాటలు చెప్పడం తప్పితే చేతల్లో మాత్రం అవేం కనిపించట్లేదు.
5 లక్షలు గెలుచుకున్నా
యశ్మీకి తెలిసేది, అర్థమయ్యేది తక్కువ తన చేష్టలతో, హ్యాండ్ మూమెంట్స్‌తో ఛీ అనిపించుకోవడం ఎక్కువ అయిపోయింది. అయితే, బిగ్ బాస్ 8 తెలుగు డే 11 ఎపిసోడ్‌లో మూడు క్లాన్స్‌తో టాస్కులు ఆడించాడు బిగ్ బాస్. గత ఆదివారం నాగార్జున వచ్చి హౌజ్ మేట్స్ అంతా ఆ మొదటి వారంలో రూ. 5 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కానీ, 5 లక్షల నుంచి రెండు లక్షలు కట్ చేశాడు బిగ్ బాస్. ఆ రూ. 2 లక్షలను ప్రైజ్ మనీగా గెలిచేందుకు బిగ్ బాస్ ప్లీజ్ అనే టాస్కులు ఆడించారు. ఇందులో భాగంగానే వాక్సింగ్ ఛాలెంజ్ పెట్టారు. యశ్మీ టీమ్ నుంచి పృథ్వీ త్వరగానే గివప్ ఇచ్చి చేసుకోలేదు. ఇక తాను వాక్స్ చేసుకోను అని చెప్పాడు. నిఖిల్, నబీల్ పోటాపోటీగా వాక్స్ చేయించుకున్నారు.
అయితే, నిఖిల్ కంటే పర్ఫెక్ట్‌గా, అంతకుముందు ఉన్న హెయిర్ క్వాంటిటీ బట్టి, ఎఫర్ట్ బట్టి వాక్సింగ్ ఛాలెంజ్ విన్నర్ నబీల్ అని సంచాలక్‌గా ఉన్న సోనియా డిక్లేర్ చేసింది. దాంతో తన క్లాన్ టీమ్‌ను గెలిపించిందన్న సంతోషంతో థ్యాంక్స్ థ్యాంక్స్ అంటూ సోనియా కాళ్లు మొక్కింది విష్ణుప్రియ.
అమాయకంగా విష్ణుప్రియ
అయితే, రెండో వారం నామినేషన్స్ నుంచి విష్ణుప్రియను విమర్శించడం, నానా మాటలు అనడం, ఫ్యామిలీ నుంచి పర్సనల్ క్యారెక్టర్ వరకు తప్పుగా మాట్లాడుతూనే ఉంది సోనియా. అలాంటి సోనియా కాళ్లు విష్ణుప్రియ మొక్కడం ఆశ్చర్యం కలిగించింది. కానీ, విష్ణుప్రియ అమాయకంగా, ఫ్రెండ్లీగా, సంతోషంగా అలా చేసింది. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా అందరితో జెన్యూన్‌గా బాగుండే క్యారెక్టర్ విష్ణుప్రియది అని తెలుస్తోంది.
ఆ తర్వాత లక్ష రూపాయలు గెలుచుకునేందుకు సాక్స్ ఛాలెంజ్ ఇచ్చారు. ప్రతి టీమ్ నుంచి ఇద్దరు సభ్యులు పాల్గొంటారు. మరొకరి సాక్స్‌ను పోగొట్టేలా చేయాలి. దీనికి సంచాలక్‌గా వ్యవహరించిన ప్రేరణను యశ్మీ టీమ్ తమ మాటలతో, చేష్టలతో కన్ఫ్యూజ్ చేశారు. దాంతో విష్ణుప్రియ, నబీల్‌ను ఔట్ అని చెప్పింది ప్రేరణ. నైనిక టీమ్ ఓడిపోవడం, తన టీమ్ మెంబర్ అయిన అభయ్ పోటీలో ఇంకా ఉండటంతో యశ్మీ సంతోషం మాములుగా లేదు.
జారుతున్నవురో పాట
యాంకర్ విష్ణుప్రియ నటించిన జారుతున్నవురో పాట ఎంత పాపులరో తెలిసిందే. ఇదే పాటను పదే పదే పాడుతూ, అలాగే డ్యాన్స్ చేస్తూ వెటకారం చేసింది యశ్మీ. విష్ణుప్రియ, నబీల్ అవుట్ అనే ప్రస్తావన వచ్చిన ప్రతిసారి పృథ్వీతో, సోనియాతో జారుతున్నవురో అంటూ రచ్చ చేసింది. అది విష్ణుప్రియ పాట అని తెలిసే.. కావాలనే తనను వెటకారం, చేసినట్లు అవమానించినట్లుగా అనిపించింది. ఇక ఆ టాస్క్‌లో నబీల్, విష్ణుప్రియకు అన్యాయమే జరిగింది.