తెలుగు న్యూస్ / ఫోటో /
Shah Rukh Khan Net Worth: 200 కోట్ల బంగ్లా, లగ్జరీ కార్లు, పద్మశ్రీ అవార్డ్.. షారుక్ ఖాన్ రెమ్యునరేషన్, ఆస్తులు ఎంతంటే?
- Shah Rukh Khan Net Worth On His Birthday: ఇవాళ షారుక్ ఖాన్ బర్త్ డే సందర్భంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 59వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఆస్తుల విలువ ఎంతనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
- Shah Rukh Khan Net Worth On His Birthday: ఇవాళ షారుక్ ఖాన్ బర్త్ డే సందర్భంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 59వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఆస్తుల విలువ ఎంతనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
(1 / 9)
నేడు (నవంబర్ 2) బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ పుట్టినరోజు. నేడు ఆయన 59వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. షారుక్ ఈ రోజు తన పుట్టినరోజును ఘనంగా జరుపుకోనున్నారు.
(2 / 9)
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఏడాది షారుఖ్ బంగ్లా అయిన మన్నత్ దగ్గర జనం గుమిగూడి మరి శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.
(3 / 9)
1965 నవంబర్ 2న న్యూఢిల్లీలో జన్మించిన షారుక్ ఖాన్ నటనా రంగంలో రాణించి తన నటనతో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. నేటికీ ఆయన సినిమాలు చూసేందుకు అభిమానులు పోటెత్తుతున్నారు.
(4 / 9)
సెయింట్ కొలంబియా స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన షారుక్ ఆ తర్వాత జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో పట్టభద్రుడయ్యాడు.
(5 / 9)
షారుక్ ఖాన్ మొదట “ఫౌజీ”, "వాగ్లే కీ దునియా" వంటి టెలివిజన్ షోలలో నటించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
(6 / 9)
1992లో 'దీవానా' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన షారుఖ్ కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ బాద్ షాగా పేరు తెచ్చుకున్నాడు.
(7 / 9)
షారుఖ్ ఖాన్ నటన కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. 14 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. అలాగే, షారుఖ్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
(8 / 9)
దాదాపు రూ.200 కోట్ల విలువైన మన్నత్ అనే బంగ్లాను షారుఖ్ సొంతం చేసుకున్నారని, అక్కడ ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు.
(9 / 9)
బాలీవుడ్ కింగ్‌గా పేరొందిన షారుఖ్ ఖాన్ కు ఎన్నో కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నాయి. అలాగే, సినిమాకు దాదాపుగా షారుక్ రూ. 150 నుంచి 200 కోట్ల వరకు పారితోషికం అందుకుంటాడు. మొత్తంగా షారుక్ ఖాన్ నెట్ వర్త్ సుమారుగా రూ. 7,300 కోట్లు ఉంటుందని అంచనా. ఇక మీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత, విద్యపై కూడా దృష్టి సారించారు కింగ్ ఖాన్.
ఇతర గ్యాలరీలు