Sports Bikes : రెండు లక్షల బడ్జెట్‌లో యూత్‌కి నచ్చే స్పోర్ట్స్ బైకులు.. ధర, మైలేజీ, ఫీచర్లు
Sports Bikes : యూత్‌కి స్పోర్ట్స్ బైకులు అంటే చాలా ఇష్టం. అలాంటివారికి బడ్జెట్ ధరలో కొన్ని సూపర్ బైకులు ఉన్నాయి. రూ.2 లక్షల వరకూ బడ్జెట్ ధరతో ఉంటాయి. ఆ బైకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్‌లో ఆటోమెుబైల్ మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది. అందులో బైకులు ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. యూత్‌కు స్పోర్ట్స్ బైకులు అంటే చాలా ఇష్టం. ఇందులోనూ చాలా లక్షలు విలువ చేసే బైక్స్ ఉంటాయి. భారత్‌లో యూత్‌కు ఈ బైక్స్ అంటే ఇష్టం. అయితే మధ్యతరగతివారు ఎక్కువ ధర పెట్టలేరు. రూ.2లక్షల బడ్జెట్‌తో వచ్చే బైకులు ఏమున్నాయో చూద్దాం.. మంచి డిజైన్, మైలేజీతో ఉంటాయి.
సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250
సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250ని స్పోర్ట్స్ బైక్‌గా కూడా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. జపనీస్ టూ వీలర్ కంపెనీ దీనిని రూ. 1.92 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరకు విక్రయిస్తోంది. సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250.. 249 హెచ్‌పీ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో ఉంటుంది. ఇది 26.1 బీహెచ్‌పీ శక్తిని, 22.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది.
హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్
ఈ జాబితాలో హీరో కరిజ్మా బైక్ కూడా ఉంది. ఇటీవలే అప్‌డేట్ వెర్షన్‌లో విడుదలైంది. రూ. 1.79 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో కొనేందుకు అందుబాటులో ఉంది. దీనిని 210 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో విక్రయిస్తోంది. ఇది 25.1 బీహెచ్‌పీ శక్తిని, 20.4 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో కూడా ఉంటుంది.
బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200
200 సీసీ సెగ్మెంట్‌లో చౌకైన స్పోర్ట్స్ బైక్ కోసం చూస్తున్నట్లయితే.. పల్సర్ ఆర్ఎస్ 200 మీకు బెటర్ ఆప్షన్. బజాజ్ దీనిని కేవలం రూ. 1.74 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరకు అమ్ముతోంది. ఇందులోని 200 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 24.1 బిహెచ్‌పీ పవర్, 18.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
యమహ ఆర్15 వీ4
జపనీస్ ద్విచక్ర వాహన తయారీదారు అయిన ఈ బైక్ భారత్‌లో కూడా తయరు చేస్తారు. దేశీయ మార్కెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. ఆర్15 వీ4 ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.82 లక్షలు, రంగును బట్టి దీని ధర రూ. 1.87 లక్షల వరకు ఉండొచ్చు. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఏబీఎస్‌తో వస్తున్న ఈ స్పోర్ట్స్ బైక్‌లో 155 సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది, ఇది 18.1 బీహెచ్‌పీ పవర్, 14.2 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది.