Best Family Cars : ఈ 8 సీటర్ కార్లు ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్.. మంచి ఫీచర్లతో వస్తాయి
8 Seater Cars : ఫ్యామిలీకి సూట్ అయ్యే కార్లు చాలా ఉన్నాయి. అయితే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉంటే ఇంకా బెటర్. అలాంటి 8 సీటర్ కార్ల గురించి తెలుసుకోండి..
మీరు కొత్త కారు కొనాలనుకుంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు కూర్చునేలా కారు ఉండాలి. అప్పుడే అందరూ కలిసి హాయిగా ట్రిప్స్‌కి వెళ్లొచ్చు. పెద్ద కారు ఉంటే ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ కూర్చునేందుకు బాగుంటుంది. మార్కెట్‌లో అనేక రకాల 7 సీటర్ కార్లు ఉన్నాయి. దాదాపు అదే ధరలో లభించే.. 8 సీటర్ ఆప్షన్‌తో వచ్చే కార్ల గురించి చూద్దాం.. ఈ కార్లు సౌకర్యంగా ఉంటాయి.
టయోటా ఇన్నోవా హైక్రాస్
టయోటా ఇన్నోవా హైక్రాస్ 7, 8 సీట్ల ఆప్షన్స్‌తో కలిగి ఉంది. ఇందులో రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇది ఎలక్ట్రిక్ మోటార్‌తో పాటు 2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. దీని మైలేజీ గురించి లీటరుకు 23.24 కిలోమీటర్ల వరకు ఉంది. రూ. 19.94 లక్షల నుండి రూ. 31.34 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, ఏడీఏఎస్ వంటి కొన్ని ఫీచర్లతో వస్తుంది.
టయోటా ఇన్నోవా క్రిస్టా
టయోటా ఇన్నోవా క్రిస్టా అనేది భారతీయ మార్కెట్లో ఒక ప్రసిద్ధ ఎంపీవీ. ఇది జీఎక్స్, జీఎక్స్ ప్లస్, వీఎక్స్, జెడ్ఎక్స్ అనే నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఇది 7, 8 సీటర్ కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ కలిగి ఉంది. దేశీయ విపణిలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.19.99 లక్షల నుండి మెుదలవుతుంది. ఇది 2.4 లీటర్ల డీజిల్ ఇంజన్ కలిగి ఉంది. 150బీహెచ్‌పీ శక్తిని, 343ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టయోటా ఇన్నోవా క్రిస్టా ఫీచర్ల విషయనికొస్తే.. ఇందులో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8 వే పవర్ అడ్జస్ట్ డ్రైవర్ సీట్, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ విత్ రియర్ ఏసీ వెంట్ వంటి కొన్ని ఫీచర్లు ఉన్నాయి.
మారుతి సుజుకి ఇన్విక్టో
మారుతి సుజుకి ఇన్విక్టో కూడా 7, 8 సీట్ల కాన్ఫిగరేషన్ ఆప్షన్‌తో భారతీయ మార్కెట్లో దొరుకుతుంది. జీటా ప్లస్, ఆల్ఫా ప్లస్ అనే రెండు ట్రిమ్‌ల ఆప్షన్స్‌లో ఉంది. దీని ధర రూ. 25.26 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి మెుదలవుతుంది. పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే.. ఇది 2-లీటర్ హైబ్రిడ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 152పీఎస్ శక్తిని, 188ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 10.1-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక ఫీచర్లతో వస్తుంది.