7 Seater Cars : 7 సీటర్ కార్ల అమ్మకాల్లో ఇదే నెంబర్ వన్.. ప్రారంభ ధర రూ.8.69 లక్షలు!-7 seater car sales november 2024 maruti suzuki ertiga on number 1 position check list here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  7 Seater Cars : 7 సీటర్ కార్ల అమ్మకాల్లో ఇదే నెంబర్ వన్.. ప్రారంభ ధర రూ.8.69 లక్షలు!

7 Seater Cars : 7 సీటర్ కార్ల అమ్మకాల్లో ఇదే నెంబర్ వన్.. ప్రారంభ ధర రూ.8.69 లక్షలు!

Anand Sai HT Telugu
Dec 10, 2024 05:40 PM IST

7 Seater Car Sales : 7 సీటర్ కార్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. కంపెనీలు సైతం మార్కెట్లో వీటిని తెచ్చేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. నవంబర్‌ అమ్మకాల్లో 7 సీటర్ కార్లలో మారుతి సుజుకి ఎర్టిగా టాప్‌లో ఉంది.

మారుతి సుజుకి ఎర్టిగా
మారుతి సుజుకి ఎర్టిగా

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అనేక 7 సీటర్ కార్లు ఉన్నాయి. ఈ విభాగంలో నెలనెలకు మెరుగైన విక్రయాలు కూడా జరుగుతున్నాయి. నవంబర్ 2024లో అమ్మకాల్లో చూస్తే.. మారుతి సుజుకి ఎర్టిగా నంబర్ 1గా ఉంది. అయితే ఇదే కాలంలో టాటా సఫారీ విక్రయాల్లో భారీ క్షీణత కనిపిచింది. 7 సీటర్ కార్లలో టాప్ ఏం ఉన్నాయో చూద్దాం..

yearly horoscope entry point

మారుతి సుజుకి ఎర్టిగా

మారుతికి చెందిన ఈ సరసమైన 7 సీటర్ కారు గత నెలలో మంచి అమ్మకాలను చూసింది. నవంబర్ 2024లో మొత్తం 15,150 యూనిట్లు ఎర్టిగా అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 12,857 యూనిట్లతో పోలిస్తే 18 శాతం ఎక్కువగా ఉంది. ఎర్టిగా ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.8.69 లక్షలు. ఈ 7 సీటర్ కారు పలు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. సీఎన్జీ మోడ్‌లో 26.11 కి.మీ/కేజీ మైలేజీని అందిస్తుంది. అనేక అధునాతన ఫీచర్లతో వస్తుంది.

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా ఈ సూపర్ ఎస్‌యూవీ అమ్మకాల పరంగా రెండో స్థానాన్ని సంపాదించింది. గత నెలలో స్కార్పియో, స్కార్పియో ఎన్ 12,704 మంది కొత్త కస్టమర్‌లను పొందాయి. ఇది నవంబర్ 2023 నెలలో విక్రయించిన 12,185 కొత్త వాహనాల కంటే 4 శాతం ఎక్కువగా ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

మహీంద్రా ఎక్స్‌యూవీ700 విక్రయాలలో దూసుకెళ్లింది. గత నెలలో మొత్తం 9,100 యూనిట్లను విక్రయించింది. నవంబర్ 2023 నెలలో 7,221 అమ్మకాలు చేసింది. 26 శాతం పెరుగుదలను చూసింది.

మహీంద్రా బొలెరో

బొలెరో టాప్ 7 సీటర్ కార్ల జాబితాలోకి చేరింది. కానీ దాని అమ్మకాలు క్షీణించాయనే చెప్పాలి. ఎందుకంటే నవంబర్‌లో కంపెనీ మొత్తం 7,045 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 9,333 యూనిట్ల అమ్మకాలు చేసింది. దీనితో పోలిస్తే 24 శాతం క్షీణతను చూపుతోంది.

టయోటా ఇన్నోవా

టాప్ 7 సీటర్ కార్ల లిస్టులో ఇన్నోవా కూడా ఉంది. టయోటా గత నెలలో మొత్తం 7,867 యూనిట్లను విక్రయించింది. ఇది నవంబర్ 2023లో విక్రయించిన 6,910 యూనిట్ల కంటే 14 శాతం ఎక్కువగా ఉంది.

నవంబర్ 2024లో విక్రయించిన మరికొన్ని టాప్ 7-సీటర్ కార్లు చూస్తే.. కియా కేరెన్స్ 5672 యూనిట్లు, టయోటా ఫార్చ్యూనర్ 2865 యూనిట్లు, మారుతి సుజుకి ఎక్స్ఎల్6 2483 యూనిట్లు అమ్ముడయ్యాయి. హ్యుందాయ్ అల్కాజర్ 2134 యూనిట్లు, టాటా సఫారీ 1563 యూనిట్లుతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Whats_app_banner