తెలుగు న్యూస్ / ఫోటో /
Telangana Tourism Packages : ఇయర్ ఎండ్ వేళ ట్రిప్ ప్లాన్ ఉందా..! ఈ టూర్ ప్యాకేజీలపై ఓ లుక్కేయండి..!
- Telangana Tourism Packages : ఇయర్ ఎండ్ వేళ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీలాంటి వారికోసం తెలంగాణ టూరిజం పలు టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అరకు, షిర్డీ, నాగార్జున సాగర్, హైదరాబాద్ ప్యాలెస్ టూర్ ప్యాకేజీలు ఇందులో ఉన్నాయి. వివరాలు ఇక్కడ తెలుసుకోండి…
- Telangana Tourism Packages : ఇయర్ ఎండ్ వేళ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీలాంటి వారికోసం తెలంగాణ టూరిజం పలు టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అరకు, షిర్డీ, నాగార్జున సాగర్, హైదరాబాద్ ప్యాలెస్ టూర్ ప్యాకేజీలు ఇందులో ఉన్నాయి. వివరాలు ఇక్కడ తెలుసుకోండి…
(1 / 7)
మరికొద్దిరోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. కొత్త సంవత్సరం ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఇయర్ ఎండ్ వేళ చాలా మంది ఏదో ఒక ట్రిప్ కు వెళ్తుంటారు. అయితే తెలంగాణ టూరిజం పలు రకాల టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది.
(2 / 7)
తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తుండగా… ముందస్తుగానే టికెట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ట్రైన్ జర్నీ, మరికొన్ని బస్సు జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తోంది. https://tourism.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.
(3 / 7)
Shirdi Ellora Tour - Telangana Tourism పేరుతో హైదరాబాద్ నుంచి షిర్డీకి టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ట్రైన్ జర్నీ ఉంటుంది. ఈ ప్యాకేజీ డిసెంబర్ 20వ తేదీన అందుబాటులో ఉంది.
(4 / 7)
కేవలం రూ. 800 ధరతోనే నాగార్జున సాగర్ ట్రిప్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. హైదరాబాద్ నుంచి బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. బుద్ధవనంతో పాటు సాగర్ డ్యామ్ చూపిస్తారు. ఈ ప్యాకేజీ డిసెంబర్ 21, 2024వ తేదీన అందుబాటులో ఉంది.
(5 / 7)
ఇక అరకు చూసేందుకు కూడా తెలంగాణ టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. 4 రోజులపాటు ఈ ట్రిప్ ఉంటుంది. ఈ ట్రిప్ లో భాగంగా… అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకులోని బొర్రా గుహలు, అనంతగిరి చూడొచ్చు. ఈ ప్యాకేజీ డిసెంబర్ 18, 2024వ తేదీన అందుబాటులో ఉంది.
(6 / 7)
హైదరాబాద్ లోని పలు ప్యాలెస్ లు చూసేందుకు ‘Nizam Palaces Tour - Telangana Tourism 21’ పేరుతో ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ట్రిప్ ను బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీ డిసెంబర్ 21, 2024వ తేదీన అందుబాటులో ఉంది.
ఇతర గ్యాలరీలు