Allu Arjun Villain: అల్లు అర్జున్‌ని పుష్ప 2 మేకర్స్ విలన్‌గా మార్చేశారు: బాలీవుడ్ సీనియర్ హీరో ముఖేష్ ఖన్నా కామెంట్స్-bollywood actor mukesh khanna says allu arjun perfect to shaktimaan role but pushpa 2 makers made him villain ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Villain: అల్లు అర్జున్‌ని పుష్ప 2 మేకర్స్ విలన్‌గా మార్చేశారు: బాలీవుడ్ సీనియర్ హీరో ముఖేష్ ఖన్నా కామెంట్స్

Allu Arjun Villain: అల్లు అర్జున్‌ని పుష్ప 2 మేకర్స్ విలన్‌గా మార్చేశారు: బాలీవుడ్ సీనియర్ హీరో ముఖేష్ ఖన్నా కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Mukesh Khanna Says Allu Arjun Perfect To Shaktimaan: అల్లు అర్జున్‌ను పుష్ప 2 ది రూల్ మూవీ మేకర్స్ విలన్‌గా మార్చేశారు అని బాలీవుడ్ సీనియర్ హీరో, శక్తిమాన్ ఫేమ్ ముఖేష్ ఖన్నా కామెంట్స్ చేశారు. అంతేకాకుండా శక్తిమాన్ పాత్రలో అల్లు అర్జున్ బాగా సరిపోతాడు అని ముఖేష్ ఖన్నా తెలిపారు.

అల్లు అర్జున్‌ని పుష్ప 2 మేకర్స్ విలన్‌గా మార్చేశారు: బాలీవుడ్ సీనియర్ హీరో ముఖేష్ ఖన్నా

Mukesh Khanna On Pushpa 2 Makers Made Allu Arjun As Villain: బాలీవుడ్‌లో సూపర్ హీరో రోల్ శక్తిమాన్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ తరంలో ఆ పాత్రలో ఎవరు నటించడానికి చాలా మంది బాలీవుడ్ యంగ్ హీరోలు పోటీ పడుతున్నారు. రణ్‌వీర్ సింగ్ లాంటి హీరోలు అడిగిన కూడా ఆ పాత్రతో క్రేజ్ సంపాదించుకున్న సీనియర్ హీరో ముఖేష్ ఖన్నా నో చెప్పారు.

విలన్‌గా మార్చేశారు

కానీ, తాజాగా శక్తిమాన్ పాత్రకు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ బాగా సరిపోతాడని కామెంట్స్ చేయడం విశేషంగా మారింది. అంతేకాకుండా పుష్ప 2 మేకర్స్ అల్లు అర్జున్‌ను విలన్‌గా మార్చేశారు అని మరో షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు ముఖేష్ ఖన్నా.

ముఖేష్ ఖన్నా ఇటీవల తన యూట్యూబ్‌ ఛానెల్‌లో ఇటీవల ఓ వీడియోను పోస్ట్ చేశారు ముఖేష్ ఖన్నా. అందులో "నేను ఎలాంటి కమిట్‌మెంట్ ఇవ్వడం లేదు. కానీ, అతను ( అల్లు అర్జున్) శక్తిమాన్ కాగలడని నేను అనుకుంటున్నాను. ఆయన లుక్స్, హైట్ బాగుంది. కానీ వాళ్లు (పుష్ప 2 మేకర్స్) అతన్ని విలన్‌గా మార్చేశారు. కానీ, శక్తిమాన్ పాత్రకు ఆయన సరిపోతారు'' అని ముఖేష్ ఖన్నా అన్నారు.

మీపై నమ్మకం ఉంటే

అలాగే, ఆ వీడియోలో పుష్ప 2 మూవీపై రివ్యూ ఇచ్చిన ముఖేష్ ఖన్నా "ఇదంత కేవలం డబ్బు విసిరినంత మాత్రాన సాధ్యం కాదు. దానిని (పుష్ప 2 చిత్రాన్ని) రూపొందించడానికి వారు ఎంత కష్టపడ్డారో మీరు చూడొచ్చు. మొదటి ఫ్రేమ్ నుంచే పుష్ప 2ను నేను ప్రశంసిస్తాను. ప్రతి ఫ్రేమ్ వారు ఎంత బాగా చేశారో, తీశారో చెబుతుంది. మీపై మీకు నమ్మకం ఉంటే మీరు ప్రేక్షకులను మెప్పించగలరు. అరే లాజిక్ గురించి మర్చిపోండి. ఇది మైండ్ బ్లోయింగ్" అని తెలిపారు.

అయితే, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను దర్శకనిర్మాతలు గ్లామర్‌గా చూపిస్తున్నారు అని ముఖేష్ ఖన్నా విమర్శించారు. "వాళ్లు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను చాలా గ్లామర్‌గా చూపిస్తున్నారు. మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు. పోలీసులను కొట్టి కూడా తాము స్మగ్లింగ్ చేయగలమని చూపించాలని అనుకుంటున్నారా. కేవలం హిట్ కొట్టడానికి ఇలాంటి సినిమాలు చేయొద్దని నేను సౌత్ డైరెక్టర్స్‌కు చెప్పాలని అనుకుంటున్నాను" అని ముఖేష్ ఖన్నా తప్పుబట్టారు.

3 ఫ్లాప్స్ తర్వాత కూడా

అలాగే, ఇదే వీడియోలో సౌత్ ఇండస్ట్రీ, బాలీవుడ్ ఇండస్ట్రీ ఫిల్మ్ మేకింగ్ మధ్య ఉన్న వ్యత్యాసం గురించి ముఖేష్ ఖన్నా మాట్లాడారు. "దక్షిణాదిని చూసి బాలీవుడ్ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెబుతారు మనకంటే వాళ్ల దగ్గర ఎక్కువ డబ్బు ఉందని. కానీ, అది నిజం కాదు. సౌత్‌లో సినిమా బడ్జెట్ అంతా హీరో పాకెట్‌లోకి వెళ్లదు. వాళ్లు బడ్జెట్‌ను బాగా ప్లాన్ చేసుకుంటారు" అని ముఖేష్ ఖన్నా అన్నారు.

"కానీ, ఇక్కడ రూ.150 కోట్ల సినిమాకు రూ.60 కోట్లు హీరోకే అప్పగిస్తారు. పెద్ద హీరోలు అయితే, అంతకంటే ఎక్కువే తీసుకుంటారు. సినిమా ఆడనప్పుడు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి. మూడు ఫ్లాప్స్ తర్వాత కూడా ఇక్కడ హీరోలు రూ. 90 కోట్లు తీసుకుంటున్నారు. దానికి బదులు హీరోకు రూ. 60 కోట్లు ఇస్తే రచయితకు రూ.30 కోట్లు ఇవ్వొచ్చు" అని ముఖేష్ ఖన్నా బాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్‌పై ఆరోపణలు చేశారు. దీంతో ముఖేష్ ఖన్నా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.