బంగారం అనేది అత్యంత విలువైన అరుదైన లోహం. అత్యంత శుద్ధమైన రసాయనాలు, సంక్లిష్ట మార్పులతో కూడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బంగారం సంపన్నతకు, ఐశ్వర్యానికి, శుభానికి, పవిత్రకు, ప్రతీకగా భావిస్తారు. అందమైన ఆభరణాల రూపంలో బంగారానికి ఎంతో ప్రాచుర్యం ఉంటుంది. అయితే బంగారం అనేది కేవలం అలంకరణకు, ఆర్థిక స్థిరత్వానికి మాత్రమే కాదు. దీని గురించి చాలా మందికి తెలియని విషషయాలు ఎన్నో ఉన్నాయి. బంగారాన్ని సరైన సమయంలో, సరైన పద్ధతిలో ధరిస్తేనే శుభ ఫలితాలు కలుగుతాయి. బంగారం ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. జ్యోతిష్యశాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థిక రంగం, సాంస్కృతిక శాస్త్రాల్లో బంగారం గురించి చాలా అరుదైన విషయాలు ఉన్నాయి. అవేంటో వివరంగా తెలుసుకుందాం.
రసాయన శాస్త్రం ప్రకారం బంగారం అత్యంత నిలకడగా ఉంటుంది. ఆక్సీకరణ చెందకుండా నిలబడి ఉంటుంది. ఆర్థికంగా చూస్తే బంగారం ప్రాచీనకాలం నుండి ఇప్పటి వరకూ అత్యంత విలువైన పెట్టుబడిగా ఉంటుంది.
ఆర్థిక రంగంలో పరిశీలిస్తే.. ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా స్థిరమైన విలువను కలిగి ఉంటుంది. విలువ పెరిగే అరుదైన, పవిత్రమైన మూలిక బంగారం. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పెట్టుబడుల రూపంలో ఖర్చు చేసేది బంగారం కొనుగోలుతోనే. బంగారు ఆభరణాలు, సిక్ రేట్లలో ధరించడంతో పాటు, జీడీపీ ప్రదర్శనకు సంబంధించిన సూచికలుగా కూడా ఉపయోగిస్తారు.
సాంస్కృతికంగా చూస్తే బంగారం ఆభరణాల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైనది. వివాహం, పండుగలు వంటి సందర్భాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది.
ఆధ్యాత్మికంగా కోణంలో చూస్తే బంగారం శక్తిని, సౌభాగ్యాన్ని, శాంతిని, శుభాన్ని, పవిత్రతను ప్రేరేపిస్తుందని నమ్మకం ఉంది.అనుకూలమైన, ధనాన్ని సూచించే శుభసూచకంగా భావిస్తారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. బంగారం సూర్యుని ప్రతినిధిగా పరిగణించబడుతుంది.అత్యంత, పుణ్యదాయకంగా, శుభప్రదంగా భావిస్తారు. అలాగే రాహు, కేతు ప్రభావాలను నిరోధించడంలో బంగారం చాలా బాగా సహాయపడుతుందని నమ్ముతారు. బంగారాన్ని ధరించడం ద్వారా బృహస్పతి గ్రహ అనుకూలత పెరుగుతుంది. జాతకంలో గ్రహాల స్థానం, రాశిచక్రాన్ని బంగారంలో రత్నాలు కలిపి ధరించవచ్చు. అయితే బంగారం ధరించడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అవి పాటించడం చాలా ముఖ్యం. బంగారాన్ని సరైన పద్ధతిలో, సరైన పద్ధతిలో ధరిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. సంపద, సంతానం, ఆనందంతో పాటు జీవితం అన్ని రకాలుగా బాగుంటుంది. బంగారం ఎప్పుడు, ఎవరు, ఎలా ధరించాలో తెలుసుకుందాం.
బంగారానికి బృహస్పతితో సంబంధం ఉన్నందున, గురువారం రోజున బంగారం ధరించడం శుభప్రదంగా భావిస్తారు. శని, బుధ, శుక్రవారాల్లో ధరించడం కూడా పవిత్రంగా భావిస్తారు. గృహప్రవేశాలు, పుట్టిర రోజులు, వివాహాలు, ఉత్సవాలు, పండుగలు వంటి శుభకార్యాల సమయంలో బంగారాన్ని కొనడం, ధరించడం అదృష్టం, ఆర్థిక వృద్ధి, శాంతి, ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయని నమ్మిక.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం ధరించడం అనేది గ్రహాల స్థితి, లగ్నం ఆధారంగా ఉంటుంది. బంగారాన్ని ఉంగరం లేదా గొలుసు వంటి రకరకాల రూపంలో మీకు నచ్చినట్లుగా ధరించవచ్చు. కాకపోతే దీనిని ధరించే ముందు ప్రతి సారి శుద్ధి చేయడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. గంగనీరు, పాలు, తేనెలతో బంగారాన్ని శుద్ధి చేయచ్చు. ముఖ్యంగా కర్మకాండలు చేసిన తర్వాత బంగాారాన్ని ఉపయోగించే ముందు తప్పకుండా శుద్ధి చేయాలి. ఆ తర్వాత విష్ణుమూర్తి పాదాల వద్ద సమర్పించాలి. కాసేపటి తర్వాత ధరించాలి.
జ్యోతిషశాస్త్రం ప్రకారం మేషం, కర్కాటకం, సింహం, మిథునం, ధనుస్సు రాశి వంటి రాశులకు చెందిన వ్యక్తులు బంగారం ధరించడం శుభంగా పరిగణించబడుతుంది. జాతకంలో బృహస్పతి స్థానం చూసిన తర్వాతే బంగారాన్ని ధరించాలి. పొట్ట, ఊబకాయానికి సంబంధించిన సమస్యలు, నిద్రలేమి ఉన్నవారు బంగారానికి దూరంగా ఉండాలి.