Kharma Days 2024: నేటి నుంచి ఖర్మ రోజులు ప్రారంభం, అదృష్టం వరించాలంటే ఈ ఆచారాలు తప్పక పాటించండి!!-kharma days 2024 know about astrological significance and remedies for peace prosperity ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kharma Days 2024: నేటి నుంచి ఖర్మ రోజులు ప్రారంభం, అదృష్టం వరించాలంటే ఈ ఆచారాలు తప్పక పాటించండి!!

Kharma Days 2024: నేటి నుంచి ఖర్మ రోజులు ప్రారంభం, అదృష్టం వరించాలంటే ఈ ఆచారాలు తప్పక పాటించండి!!

Ramya Sri Marka HT Telugu
Dec 15, 2024 08:35 AM IST

Kharma Days 2024: ఖర్మలు లేదా ఖర్మాస్ అంటే పాపకాలమని హిందువులు నమ్ముతారు. ఈ రోజుల్లో శుభకార్యాలు చేయకూడదని నమ్మిక. ఈ సారి ఖర్మలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ ఉన్నాయి. కాకపోతే ఈ నెల రోజులు కొన్ని ఆచారాలను తప్పకుండా పాటించారంటే మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది.

 ఖర్మ రోజులు ప్రారంభం, తప్పక పాటించాల్సిన ఆచారాలు
ఖర్మ రోజులు ప్రారంభం, తప్పక పాటించాల్సిన ఆచారాలు

ఖర్మాస్ లేదా ఖర్మ రోజులు లేదా ఖర్మ మాసంగా పిలిచే ఈ నెల రోజులకు హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసం రోజుల్లో శ్రీమహావిష్ణువును, సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల ఆ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లవిరిస్తున్నాయని నమ్ముతారు. కాకపోతే ఈ ఖర్మ రోజుల్లో కొన్ని రకాల పవిత్రమైన పనులు చేయకూడదని వాయిదా వేసుకుంటారు. ఒకవేళ చేస్తే కచ్చితగా అశుభ ఫలితాలు ఎదుర్కొంటామని, అనారోగ్యాలకు కూడా గురవుతామని భావిస్తారు. అసలు ఈ ఖర్మరోజులు అంటే ఏమిటి? నెలరోజుల పాటు ఎటువంటి పనులు చేయకుండా ఉండాలో తెలుసుకుందాం.

కర్మ సిద్దాంతం నుంచి వచ్చిందే ఈ ఖర్మాస్ అనే పదం. మనం చేసిన చర్యలు, వాటి ఫలితాల ఆధారంగానే కర్మ ఫలితం ఉంటుందనేది చాలా మందికి తెలిసిన విషయమే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఖర్మ రోజుల్లో కర్మ ఫలితం నుంచి ఉపశమనం పొందడానికి అనువైన సమయం. అంటే దారుణమైన లేదా ప్రతికూలమైన కర్మలు కలగకుండా జీవితంలో పుణ్యం, శాంతిని పెంపొందించుకునేందుకు ఇది అనువైన సమయం. ధనస్సు రాశిలోకి లేదా మీన రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ ఖర్మ రోజులు సంభవిస్తాయి. ఇవి 30 రోజుల పాటు ఉంటాయి.

ఖర్మలు ఈ సారి ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ?

ద్రిక్ పంచాంగం ప్రకారం ఈ సారి సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తుండటంతో ఖర్మ రోజులు ప్రారంభం కానున్నాయి. అంటే ఈ సారి ఖర్మలు డిసెంబర్ 15న ప్రారంభమై జనవరి 14న ముగుస్తాయి.

కర్మ సమయంలో అదృష్టం వరించాలంటే తప్పక పాటించాల్సిన ఆచారాలు

ఖర్మాస్ సమయంలో సూర్యభగవానుడ్ని పూజించడం వల్ల ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. అంతేకాకుండా మీ జీవితంలో సంపద, ఆనందాన్ని తీసుకువస్తుందని నమ్మకం ఉంది. ప్రతిరోజూ సూర్యున్ని ఆరాధించడానికి అనుసరించాల్సిన పద్దతులివే.

సూర్యునికి నీళ్లు అర్పించడం: ఒక బంగారం లేదా స్వచ్ఛమైన పాత్రలో నీటిని పోసి, కొన్ని ధాన్యాలు, కుంకుమ వేసి ఈ నీటిని సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్పించాలి. నీరు పోసేటప్పుడు మంత్రాలు జపించాలి. ఇలా చేయడం వల్ల సూర్యుని శక్తిని మీ జాతకంలో పెంచుకోవచ్చు. ఇది మీ జీవితంలో శాంతి, సంపదను పెంపొందించుకునేందుకు సహాయపడుతుంది.

నెలరోజుల పాటు చేయాల్సిన పనులు

  • ఖర్మాస్ సమయంలో "బృహస్పతి చాలీసా", "సూర్య చాలీసా" పఠించడం ఎంతో ప్రయోజనకరమైనవి. ఇలా చేస్తే మీరు సూర్యభగవానుడితో పాటు శ్రీ విష్ణువు ఆశీర్వాదాలు పొందగలుగుతారు.
  • ఈ ఆచారాలు మీ జీవితంలో సానుకూల ఫలితాలు, ప్రతీ కార్యంలో విజయాన్ని తీసుకువస్తాయట.
  • వివాహ జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్న వారు ఖర్మాస్ ఈ సమయంలో దైవసహాయం కోసం శ్రీవిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి.
  • అలా చేయడం వల్ల జంటల మధ్య సాంత్వన, సంబంధాల మధ్య అనుకూలత ఏర్పడుతుంది.
  • ఈ అర్పణలు వివాహంలో ఉన్న అడ్డంకులను తొలగించి హర్షం, స్థిరత్వం తీసుకురావడంలో సహాయపడతాయి.

డిసెంబర్ 2024 ఖర్మాస్ సమయంలో గుర్తుంచుకోవాల్సినవి

  • ఖర్మాస్ కాలంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా శుభ కార్యాలను నిర్వహించడానికి అనుకూల కాలం కాదు.
  • రోజూ సూర్యుని ఆరాధిస్తే, అది మీ జాతకంలో సూర్యుని జ్యోతిషశాస్త్ర ప్రభావాన్ని బలపరుస్తుంది. శాంతి, సంపదను వృద్ధి చేస్తుంది.
  • పవిత్రమైన గ్రంథాలు, "సూర్య చాలీసా" ని పఠించడం ద్వారా ఆశీర్వాదాలు తీసుకోవడంలో, విజయాన్ని పొందడంలో అనుకూలంగా ఉంటుంది.
  • శ్రీవిష్ణువుని ఆరాధించడం వల్ల వైవాహిక జీవితంలో బంధాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

చేయకూడని పనులు

ఖర్మాస్ ఒక ముఖ్యమైన కాలం, ఈ సమయంలో వివాహాలు, గృహప్రవేశాలు, పేరు పెట్టే పూజలు వంటి శుభకార్యాలను చేయడం తప్పించుకోవాలని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే ఖర్మాస్ సమయంలో సూర్యుని శక్తి తగ్గిపోతుందని భావించబడుతుంది. ఫలితంగా, ఈ కాలంలో జరిగే శుభకార్యాలు అనుకూల ఫలితాలు ఇవ్వకపోవచ్చు. అయితే, ఖర్మాస్ సమయంలో కొన్ని నివారణలు, పూజలు చేయడం వల్ల సూర్యదేవుని అనుగ్రహం పొందడానికి సహాయపడుతుందని నమ్మకం ఉంది.

ఈ ఆచారాలను అనుసరించడం ద్వారా ఖర్మాస్ పరిమితులున్నా కూడా ఈ కాలాన్ని సానుకూలంగా మార్చుకుని, మీ జీవితంలో సానుకూలతను ఆహ్వానించవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner