Tossing coins into river: నదుల్లో నాణేలు ఎందుకు వేస్తారు? అలా చేస్తే పుణ్యం వస్తుందా?-what is the reason behind throw coins into the river ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tossing Coins Into River: నదుల్లో నాణేలు ఎందుకు వేస్తారు? అలా చేస్తే పుణ్యం వస్తుందా?

Tossing coins into river: నదుల్లో నాణేలు ఎందుకు వేస్తారు? అలా చేస్తే పుణ్యం వస్తుందా?

Gunti Soundarya HT Telugu
Dec 07, 2023 05:07 PM IST

Tossing coins into water: పుణ్యక్షేత్రాల వద్ద ఉన్న నదుల్లో నాణేలు ఎందుకు విసిరేస్తారు? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏంటి?

నదిలోకి నాణేలు విసరడం మంచిదేనా?
నదిలోకి నాణేలు విసరడం మంచిదేనా? (pixabay)

పుష్కర స్నానాలకి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైన తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు చాలా మంది నాణేలు నీటిలో వేస్తూ ఉంటారు. అలాగే వంతెన మీద ప్రయాణం చేసే సమయంలో కూడా నీటిలోని కాయిన్స్ విసురుతుంటారు. అలా చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని అనేకుల నమ్మకం.

నదుల్లో నాణేలు వేయడం అనేది పూర్వీకుల నుంచి వస్తున్న మతపరమైన ఆచారం. అలా ఎందుకు చాలా మందికి తెలియకపోయినా ఇతరులు చేస్తున్నారనే ఉద్దేశంతో మరికొందరు చేస్తారు. నదిలో నాణేలు విసరడం వల్ల పాపాలు తొలగిపోతాయని, అదృశం వరిస్తుందని అంటారు. అలాగే నదిలో విలువైన వాటిని వదిలేయడం వల్ల కోరికలు తీరతాయని నమ్ముతారు. కానీ నదిలో నాణేలు వేయడానికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. అదేంటో తెలుసుకుందాం.

నీటిలో నాణేలు ఎందుకు విసిరేస్తారు?

పురాతన కాలంలో డబ్బులు అంటే నోట్లు కాదు కేవలం నాణేలు మాత్రమే. ఇప్పుడు స్టీల్, అల్యూమినియంతో చేసిన నాణేలు వాడులో ఉన్నాయి. కానీ అప్పుడు మాత్రం రాగితో చేసిన నాణేలు వాడుకలో ఉండేవి. రాగి లోహం మాత్రమే కాదు శరీరానికి అవసరమైన మినరల్. రోజులో కొంత మొత్తంలో రాగి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.

స్వచ్చమైన తాగునీరు

రాగి నాణేలు నీటిలో వేయడం వల్ల అవి శుద్ధి చేయబడతాయని నమ్ముతారు. నీటిని శుద్ది చేసే గుణం రాగికి ఉంటుంది. అందుకే పూర్వీకులు రాగి పాత్రలో నీటిని నిల్వ చేసుకుని తాగేవారు. అదే విధంగా నీటిలో రాగి నాణేలు వేయడం వల్ల నీరు శుభ్రపడతాయి. వాటిని తాగేందుకు ఉపయోగిస్తారు. అందుకే నాణేలు నదుల్లో వేస్తారు.

రాగి నాణేలు పవిత్ర నదుల్లో విసిరేయడం వల్ల ఇన్ఫెక్షన్ లేని తాగునీటిని అందిస్తుందని పూర్వీకుల నమ్మకం. అప్పట్లో అంతా నదుల నుంచి నేరుగా వచ్చిన నీటిని తాగేవారు. ఇప్పటి మాదిరిగా ఫిల్టర్లు ఉండేవి కాదు. నదులు తాగునీటికి ప్రధాన వనరు. రాగి నాణేలు నీటి అడుగున ఉండటం వల్ల బ్యాక్టీరియా చనిపోయి నీరు స్వచ్చంగా మారుతుంది. నాణేలు ఎక్కువ కాలం నదుల్లో ఉంటే ఆ నీటిని తాగే వారికి ఆరోగ్య సమస్యలు ఉండవని చెబుతారు. కొన్నేళ్ళ పాటు ఈ పద్ధతి చాలా చక్కగా పని చేసింది.

ప్రస్తుత కాలంలో నాణేలు నీటిలో వేయడం మంచిదేనా?

ఆధునిక కాలంలో రాగి నాణేలు ఉపయోగించడం లేదు. వాటి స్థానంలో స్టీల్, అల్యూమినియం నాణేలు వినియోగిస్తున్నారు. వీటిని నదిలో వేయడం వల్ల అవి తుప్పు పట్టి నీటిని కలుషితం చేస్తున్నాయి.

నీరు కలుషితం

అది మాత్రమే కాదు పవిత్రమైన నదులు కూడా ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. అటువంటి నీరు తాగేందుకు ప్రయోజనకరంగా ఉండటం లేదు. ఆ నీటిని మనుషులు మాత్రమే కాదు పశువులు తాగినా అనారోగ్యం పాలవుతున్నారు. అందువల్ల ఇప్పుడు నాణేలు నీటిలోకి విసరడం వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరకపోగా కలుషితం చేస్తుంది.

ప్రమాదంలో చిన్నారులు

పూర్వీకులు పాటించిన సాంప్రదాయాలు పాటించాలని అనుకుంటే మీ దగ్గర రాగి నాణేలు ఉంటే వాటిని నీటిలో వేయవచ్చు. ఇప్పుడు నాణేలు నదుల్లో వేయడం వల్ల వాటిని తీసుకునేందుకు తమ ప్రాణాలు పణంగా పెట్టు నీటిలోకి దిగుతున్నారు. ఒక్కోసారి ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే నదుల్లో నాణేలు వేయకపోవడమే మంచిది.

నదుల్లో పుణ్య స్నానాలు ఆచరించిన వాళ్ళు పూజ చేసిన వస్తువులు వాటిలోనే నిమజ్జనం చేయడం వల్ల కుప్పలు తెప్పలుగా చెత్త పేరుకుపోతుంది. దీపాలు వదలడం, కొబ్బరి కాయలు, పూలు వంటి వాటిని ఎక్కువగా నీటిలో వదిలేస్తున్నారు. అవి కుళ్లిపోయి నీరు కలుషితం అవుతుంది. చెత్త ఎక్కువగా పేరుకుపోవడం వల్ల దుర్వాసన వెదజల్లుతుంది.

Whats_app_banner