Sun Arghyam: సూర్యుడికి అర్ఘ్యాన్ని ఎలా సమర్పించాలి? ఆ సమయంలో ఎలాంటి మంత్రాలను పఠించాలి?
Sun Arghyam: హిందూ ఆచారం ప్రకారం స్యూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా పవిత్రమైన కార్యక్రమం. గౌరవం, ఆధ్యాత్మికత, క్రమశిక్షణకు ఇది ప్రతీక. కొన్ని శతాబ్దాలుగా పాటిస్తున్న ఈ ఆచారాన్ని ఎలా పాటించాలి? సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే సమయంలో ఎలాంటి మంత్రాలను పఠించాలి.
ఆది భగవానుడైన సూర్యుడికి హిందూ పురాణాల్లో విశిష్ట ప్రాముఖ్యత ఉంటుంది. రామాయణం, మహాభారత వంటి ఇతిహాసాల్లో సూర్యడిపై గౌరవం, భక్తి స్పష్టంగా కనిపిస్తాయి. సూర్యవంశీకుడైన శ్రీరాముడు సూర్యుడికి అపారమైన భక్తుడని,సూర్యుడి ఆశీస్సులు ఉంటే సకల శుభాలను పొందవచ్చని చెబుతారు. మహాభారతంలోనూ కుంతీ దేవి సూర్యభగవానుడి ప్రార్థించి ఆశీర్వాదం పొందింది. ఫలితంగా ఆమెకు కుమారుడు జన్మించాడు. సూర్యభగవానుడిని గౌరవించాలనీ, పూజించాలనీ పురాణాలు, గ్రంథాలు సూచిస్తూనే ఉన్నాయి.సూర్యుడి ఆరాధనలో ముఖ్యమైన ఘట్టం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం. ఇప్పటికీ చాలా మంది భక్తులు సూర్య నమస్కారం, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వంటి పనులతోనే రోజును ప్రారంభిస్తారు.
సూర్యుడికి అర్ఘ్యం ఎందుకు సమర్పించాలి?
సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం అంటే ఉదయించే సూర్యుడికి నీటిని సమర్పించడం. ఆయనను భక్తి శ్రద్ధలతో పూజించి, ఆశీర్వాదం కోసం వేడుకునే పవిత్ర ఆచారం. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం..సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది, మానసిక స్పష్టత పెరుగతుంది, ఆధ్యాత్మిక క్రమశిక్షణ వృద్ధి చెందుతుంది. విజయం, అదృష్టాన్ని తెస్తుంది. కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది. హృదయనాళ వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఆందోళన, నిరాశ వంటి భావాలు తగ్గి మానసిక శ్రేయస్సు కలుగుతుంది. వ్యక్తిగత పురోగతి ఉంటుంది.
అర్ఘ్యం సమర్పించడానికి సరైన పద్ధతి ఏంటి?
సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడానికి రాగి పాత్రను మాత్రమే ఉపయోగించాలి. హిందూ పూరాణాల ప్రకారం రాగ స్వచ్ఛమైనది. గౌరవం, భక్తికి ప్రతీక కనుక రాగి పాత్రతోనే సూర్యుడికి నీరు సమర్పించాలి.
అర్ఘ్యం సమర్పించే నీటిలో పువ్వులు, బియ్యం వంటివి వేయాలి. ఇవి గౌరవ, మర్యాదలను సూచిస్తాయి.
సూర్య భగవానుడికి అర్ఘ్య సమర్పించే సమయంలో ఆయన కిరణాలు మీ ముందు నీటిలో ప్రతిబింబించాలి. ఇది దైవిక కాంతితో సంబంధాన్ని సూచిస్తుంది.
ఈ సమయంలో తూర్పు ముఖంగా మాత్రమే నిలబడాలి. అలాగే సూర్యుడికి అర్ఘ్యంగా పోసే నీరు మీ పాదాలకు తాకకుండా చూసుకొండి. ఇది ఆయన్ను అగౌరవపరిచినట్లుగా అవుతుంది.
వర్షాలు పడి ఆకాశం మేఘావృతమైన రోజుల్లో కూడా సూర్యుడి గోచరంతో సంబంధం లేకుండా అంతే భక్తిశ్రద్ధలతో తూర్పు ముఖంగా అర్ఘ్యం సమర్పించండి.
సూర్య అర్ఘ్య సమయంలో జపించాల్సిన మంత్రాలు:
1. గాయత్రీ మంత్రం:
“ఓం భూర్ భువః స్వాః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్”
సూర్యునికి నీటిని సమర్పించేటప్పుడు ఈ శక్తివంతమైన వేద మంత్రాన్ని తరచుగా పఠించాలి.
2. “ఓం సూర్యాయ నమః”
ఈ సరళమైన మంత్రం సూర్యునికి ప్రశంసించేందుకు ఉపయోగపడుతుంది. సూర్య భగవానుడి కాంతిని, జీవితాన్ని పొగడుతూ ఈ మంత్రాన్ని పఠించాలి.
3. సూర్య బీజ మంత్రం:
“ఓం హ్రం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః”
ఈ మంత్రం సూర్యుని సానుకూల ప్రభావాన్ని కోరుతూ నేరుగా సంబోధిస్తుంది.
4. సూర్య భగవానుడి నామాలు:
ఓం మిత్రాయ నమః — అందరికీ స్నేహితుడు
ఓం రవయే నమః - ప్రకాశవంతుడు
ఓం సూర్యాయ నమః — అందరికీ మార్గదర్శకుడు
ఓం భానవే నమః - అందాన్ని ప్రసాదించేవాడు
ఓం ఖగాయ నమః - ఆకాశంలో సంచరించేవాడు
ఓం పుష్ణే నమః — పోషణకర్త
ఓం హిరణ్యగర్భాయ నమః — సృష్టికర్త
ఓం మరీచయే నమః — వైద్యం చేసేవాడు
ఓం ఆదిత్యాయ నమః - విశ్వమాత అదితి కుమారుడు
ఓం సవిత్రే నమః - శ్రేయోభిలాషి
ఓం అర్కాయ నమః — స్తుతింపదగినవాడు
ఓం భాస్కరాయ నమః - జ్ఞానం, విశ్వ కాంతిని కలిగించేవాడు.