Telangana News Live December 1, 2024: AP Ration Cards : కొత్త రేషన్ కార్డులపై అలర్ట్-రేపటి నుంచి అప్లికేషన్లు స్వీకరణ, ఇంకా ఆప్షన్ ఇవ్వలేంటున్న ఉద్యోగులు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 01 Dec 202405:11 PM IST
AP Ration Cards : మరో కీలక హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. రేపటి నుంచి కొత్త దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుందని ఇటీవల ప్రభుత్వం తెలిపింది. అయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ఏ ఆప్షన్ విడుదల కాలేదని ఉద్యోగులు అంటున్నారు.
Sun, 01 Dec 202404:04 PM IST
Mulugu Encounter : ములుగు జిల్లా మావోయిస్టుల ఎన్ కౌంటర్ తో ఉలిక్కిపడింది. ఆదివారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. మరో 7, 8 మంది తప్పించుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
Sun, 01 Dec 202403:48 PM IST
Chalpaka Encounter : ములుగు జిల్లా చల్పాక ఫారెస్ట్ ఏరియాలో జరిగిన ఎన్ కౌంటర్ లో 7గురు మావోయిస్టులు హతమయ్యారు. 33 ఏళ్ల క్రితం మావోయిస్టుల దాడిలో ఈ ప్రాంతంలోనే 7గురు పోలీసులు మరణించారు. సరిగ్గా ఇప్పుడు ఏడుగురు మావోలు ఎన్ కౌంటర్ లో మరణించడంతో.... పోలీసులు రివేంజ్ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది.
Sun, 01 Dec 202402:33 PM IST
Serial Actress Sobhita Shivanna : కన్నడ సీరియల్ నటి శోభిత శివన్న సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్ లోని శ్రీరాంనగర్ కాలనీలోని తన ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
Sun, 01 Dec 202411:36 AM IST
CM Revanth Reddy : తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా విధివిధానాలు నిర్ణయిస్తామన్నారు.
Sun, 01 Dec 202410:50 AM IST
- TG School Holidays : విద్యార్థులకు డిసెంబర్ మాసం సెలవులను పట్టుకొచ్చింది. అవును.. డిసెంబర్ నెలలో తెలంగాణలో స్కూళ్లకు ఏకంగా 8 రోజులు సెలవులు రానున్నాయి. పాఠశాలలకే కాకుండా.. కాలేజీలకు కూడా 8 రోజులు హాలిడేస్ రానున్నాయి. అటు 2025లో మొత్తం 27 రోజులు సాధారణ సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది.
Sun, 01 Dec 202410:02 AM IST
- Harish Rao : రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. విజయోత్సవాలు అంటూ ఈ బూటకపు ఎన్‌కౌంటర్లు ఏంటని ప్రశ్నించారు. ములుగు జిల్లాలో తాజాగా భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
Sun, 01 Dec 202408:54 AM IST
- Ayyappa Devotees : అయ్యప్ప దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వెళ్తున్నారు. అయితే.. శబరిమలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. శబరిమలలో వర్షాలు కురుస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. అటు వర్షాల కారణంగా రైళ్లు, బస్సులు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Sun, 01 Dec 202407:03 AM IST
- భూవివాదంతో తహసీల్దార్ ఆఫీస్ లో గొడవకు దిగారు. పరస్పరం దాడికి దిగటంతో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి తహసీల్దార్ ఆఫీస్ లో జరిగింది. రక్తపు గాయాలవుతున్నా దాడులు ఆపకపోవడంతో వివిధ పనుల నిమిత్తం ఆఫీస్ కు వచ్చిన వాళ్లంతా పరుగులు తీశారు.
Sun, 01 Dec 202406:25 AM IST
- Telangana ACB : తెలంగాణలో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్.. ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఆస్తులు ఎంత.. అవును ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. అటు మరో విషయం వైరల్ అవుతోంది. ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఆపరేషన్ అని అధికారులు చెబుతున్నారు. ఇటు ఏసీబీ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Sun, 01 Dec 202404:43 AM IST
- South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే రికార్డ్ సృష్టించింది. కరోనా కష్టకాలం నుంచి గట్టెక్కి.. భారీగా ఆదాయాన్ని పెంచుకుంది. ఊహించని విధంగా రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. దీంట్లో ఒక్క సికింద్రాబాద్ నుంచే 50 శాతానికి పైగా ఆదాయం వచ్చింది.
Sun, 01 Dec 202403:26 AM IST
- ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sun, 01 Dec 202402:45 AM IST
- ఓరుగల్లు బీజేపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలోని నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. జిల్లా అధ్యక్షురాలు లేకుండానే మిగతా నేతలు కలిసి కాజీపేట్ రైల్వే కోచ్ పై సంబరాల కార్యక్రమం చేపట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై అధినాయకత్వానికి కూడా ఫిర్యాదు అందినట్లు తెలిసింది.
Sun, 01 Dec 202401:59 AM IST
- కూతురుతో కలిసి భర్తపై పెట్రోల్ పోసి భార్య నిప్పంటించింది. తీవ్రంగా గాయాలపాలైన భర్త చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా గీసుగొండ మండల పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sun, 01 Dec 202411:51 PM IST
- కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలన్నీ సిద్ధంగా ఉంచాలని దిశానిర్దేశం చేశారు.