తెలుగు న్యూస్ / ఫోటో /
Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్ - ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
- Telangana Weather Updates : తుపాన్ ప్రభావంతో తెలంగాణకు ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎల్లుండి నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
నైరుతి బంగాళాఖాతంలోని 'ఫెంగల్ ' తుపాన్ శనివారం తీరాన్ని తాకింది. తమిళనాడు-పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. అయితే తుపాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి.
(2 / 6)
తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు చాలా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
(3 / 6)
ఇవాళ తెలంగాణలోని (డిసెంబర్ 1) కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(4 / 6)
డిసెంబర్ 2వ తేదీన మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోనూ వానలు పడనున్నాయి. ఈ జిల్లాలన్నింటికి హెచ్చరికలు జారీ అయ్యాయి.
(5 / 6)
డిసెంబర్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇతర గ్యాలరీలు