Trump : భారత్​ సహా బ్రిక్స్​ దేశాలపై ట్రంప్​ '100శాతం టారీఫ్​' బాంబు.. చెప్పింది చేస్తారా?-trump threatens 100 tariff on brics countries which includes india ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Trump : భారత్​ సహా బ్రిక్స్​ దేశాలపై ట్రంప్​ '100శాతం టారీఫ్​' బాంబు.. చెప్పింది చేస్తారా?

Trump : భారత్​ సహా బ్రిక్స్​ దేశాలపై ట్రంప్​ '100శాతం టారీఫ్​' బాంబు.. చెప్పింది చేస్తారా?

Sharath Chitturi HT Telugu
Dec 01, 2024 05:39 AM IST

భారత్​ సహా ఇతర బ్రిక్స్​ దేశాలకు డొనాల్డ్​ ట్రంప్​ షాక్​ ఇచ్చారు. డాలరుకు ప్రత్యమ్నాయంగా మరో కొత్త కరెన్సీని తీసుకురావాలన్న ప్రణాళికలతో ముందుకెళితే, 100శాతం టారీఫ్​ విధిస్తామని హెచ్చరించారు.

డొనాల్డ్​ ట్రంప్​
డొనాల్డ్​ ట్రంప్​ (HT_PRINT)

భారత్​ భాగంగా ఉన్న బ్రిక్స్​పై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్​ ట్రంప్​ ‘టారీఫ్​’ బాంబ పేల్చారు! డాలర్​కి ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీని సృష్టించే ప్రణాళికలను ఉపసంహరించుకోవాలని, లేకపోతే బ్రిక్స్​ దేశాలపై 100శాతం సుంకాలను విధిస్తామని హెచ్చరించారు.

“డాలర్​ నుంచి తప్పించుకోవాలని బ్రిక్స్​ దేశాల చేస్తున్న ప్రయత్నాలను మేము చూస్తూ ఊరుకోము,” అని డొనాల్డ్​ ట్రంప్ శనివారం తన ట్రూత్ సోషల్ నెట్​వర్క్​లో చేసిన పోస్ట్​లో పేర్కొన్నారు.

“కొత్త బ్రిక్స్​ కరెన్సీ సృష్టించమని, బలమైన యూఎస్​ డాలర్​కి ప్రత్యామ్నాయంగా మరొక కరెన్సీకి మద్దతివ్వబోమని ఈ దేశాలు కట్టుబడి ఉండాలి. లేకపోతే 100శాతం టారీఫ్​లను ఎదుర్కోవాలి. అదే సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థలో అమ్మకాలు చేయకూడదు,” అని ట్రంప్​ అన్నారు.

అమెరికా డాలర్ నుంచి దేశాలు వైదొలగితే భారీ మూల్యం చెల్లించక తప్పదని తన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చెప్పరు. వాటిని పాటించేలా టారిఫ్​లను ఉపయోగిస్తామని బెదిరించారు.

డాలర్ కాకుండా ఇతర కరెన్సీల్లో ద్వైపాక్షిక వాణిజ్యం చేయాలనుకునే మిత్రదేశాలను, ప్రత్యర్థులను శిక్షించే మార్గాలపై ట్రంప్, ఆయన ఆర్థిక సలహాదారులు చర్చిస్తున్నారని తెలుస్తోంది. ఎగుమతి నియంత్రణలు, కరెన్సీ మానిప్యులేషన్ ఛార్జీలు, వాణిజ్యంపై సుంకాలు వంటి ఆప్షన్స్​ని పరిగణనలోకి తీసుకోవడం వంటివి ఈ చర్యలో ఉన్నాయని సమాచారం.

అమెరికా డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉండాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ చాలా కాలంగా నొక్కి చెబుతున్నారు.

బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాల సమూహాన్ని సంయుక్తంగా పిలుస్తున్న బ్రిక్స్ దేశాలు 2023లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో డీ-డాలరైజేషన్ అంశంపై చర్చించాయి. 2022లో రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించే ప్రయత్నాలకు అమెరికా నాయకత్వం వహించడంతో డాలర్ ఆధిపత్యంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ట్రంప్​నకు ఆర్థిక సలహాదారులు సైతం బ్రిక్స్ ప్రయత్నాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. డీ-డాలరైజ్ చేసే దేశాలకు జరిమానాల గురించి ట్రంప్ సన్నిహితులు చర్చించారు.

"అంతర్జాతీయ వాణిజ్యంలో యూఎస్ డాలర్ స్థానాన్ని బ్రిక్స్ భర్తీ చేసే అవకాశం లేదు. ఒకవేళ ఏ దేశం ప్రయత్నించినా అమెరికాకు వీడ్కోలు పలకాలి," అని ట్రంప్ శనివారం అన్నారు.

అమెరికా సరిహద్దుల వెంబడి అక్రమ మాదకద్రవ్యాలు, డాక్యుమెంట్లు లేని వలసదారుల ప్రవాహాన్ని నిరోధించడానికి ఆయా దేశాలు మరింత కృషి చేయకపోతే మెక్సికో- కెనడా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 25% సుంకాలు విధిస్తామని ట్రంప్ తన రెండొవ పదవీకాలానికి ముందు హెచ్చరించారు. అటు చైనా నుంచి వచ్చే వస్తువులపై అదనంగా 10% సుంకాలు విధిస్తామని తేల్చిచెప్పారు. ఆయన మాటలు ఇప్పటికే ప్రపంచ మార్కెట్లను కుదిపేశాయి.

సుంకాల ముప్పు తర్వాత రెండు మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో శుక్రవారం ట్రంప్​తో సమావేశమై వాణిజ్య, సరిహద్దు అంశాలపై చర్చించారు.

Whats_app_banner

సంబంధిత కథనం