De-Dollarization : డీ-డాలరైజేషన్‌కు బ్రిక్స్ దేశాల మద్దతు.. సొంత కరెన్సీతో వాణిజ్యానికి ఆసక్తి!-dollar influence will be reduced and brics thoughts on de dollarization ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  De-dollarization : డీ-డాలరైజేషన్‌కు బ్రిక్స్ దేశాల మద్దతు.. సొంత కరెన్సీతో వాణిజ్యానికి ఆసక్తి!

De-Dollarization : డీ-డాలరైజేషన్‌కు బ్రిక్స్ దేశాల మద్దతు.. సొంత కరెన్సీతో వాణిజ్యానికి ఆసక్తి!

Anand Sai HT Telugu
Oct 23, 2024 07:51 AM IST

De-Dollarization : ప్రస్తుతం డీ-డాలరైజేషన్‌పై చర్చ నడుస్తోంది. బ్రిక్స్ సమ్మిట్‌తో చాలా మంది దీని గురించి ఆలోచిస్తున్నారు. అమెరికా సహా ఐరోపా దేశాలు చాలా విషయాల కోసం బ్రిక్స్ దేశాలపై ఆధారపడుతున్నాయి. బ్రిక్స్ దేశాలు తమ సొంత కరెన్సీలో వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని అనుకుంటున్నాయి.

ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్
ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ (AP)

రష్యాలోని కజాన్‌లో బ్రిక్స్ దేశాల సమావేశంపై ప్రపంచం కన్నేసింది. బ్రిక్స్ దేశాలు ప్రపంచంలోని ధనిక దేశాలతో సమానంగా తమను తాము నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాయి. ప్రపంచం ప్రస్తుతం కరెన్సీ కోసం డాలర్ పై ఆధారపడుతోంది. 90 శాతం లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. బ్రిక్స్ దేశాలు తమ సొంత కరెన్సీలో వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని, తద్వారా డాలర్ పై ఆధారపడటాన్ని తొలగించవచ్చని అనుకుంటున్నాయి. అమెరికా మార్కెట్ ఎక్సేంజ్ నాస్ డాక్ ప్రకారం బ్రిక్స్ దేశాలు డాలర్‌కు బదులుగా సొంత కరెన్సీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. నిపుణులు ఈ ప్రక్రియను డీ-డాలరైజేషన్ అని పిలుస్తున్నారు.

అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ప్రకారం, 1999-2019 మధ్య డాలర్ అంతర్జాతీయ వాణిజ్యంలో ఎక్కువగా వాడారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మొత్తం వినియోగంలో 74 శాతం వాణిజ్యానికి, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో 79 శాతం ఉంది. బ్రిక్స్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. అటువంటి పరిస్థితిలో బ్రిక్స్ దేశాల సొంత కరెన్సీతో డాలర్ ఖచ్చితంగా దెబ్బతింటుంది.

అమెరికా మార్కెట్ ఎక్స్ఛేంజ్ నాస్ డాక్ ప్రకారం, ప్రపంచంలోని చాలా దేశాలు డాలర్ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయి. చైనా, రష్యాలు తమ సొంత కరెన్సీల్లో వ్యాపారం చేస్తున్నాయి. భారత్ కూడా సొంత కరెన్సీలో పనిచేసేందుకు పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. కెన్యా, మలేషియాతో సహా అనేక దేశాలు డీ-డాలరైజేషన్ మంచిదని భావిస్తున్నాయి, ఎందుకంటే వారు ఆర్థికంగా అనేక ప్రయోజనాలను పొందుతారు.

అమెరికా సహా ఐరోపా దేశాలు చాలా విషయాల కోసం బ్రిక్స్ దేశాలపై ఆధారపడుతున్నాయి. బ్రిక్స్ దేశాలు 60 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక వ్యవస్థ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అమెరికా 29, ఐరోపా దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థ 19.35 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచంలోని సంపన్న దేశాలకు బ్రిక్స్ దేశాలు ఎంత ముఖ్యమైనవో, ఉపయోగకరమైనవో తెలుసుకుందాం.

భారత్

అమెరికా, యూరప్ దేశాలకు రత్నాలు, ఆభరణాలు, ఫార్మా, పెట్రోలియం ఉత్పత్తులతో పాటు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఇంజినీరింగ్ సంబంధిత వస్తువులను ఎగుమతి చేస్తోంది. అమెరికాకు ఏటా 78 బిలియన్ డాలర్లు, ఐరోపా దేశాలకు 124 బిలియన్ డాలర్ల నిత్యావసర వస్తువులను ఎగుమతి చేస్తోంది.

చైనా

యంత్రాలు, వాహనాలకు సంబంధించిన విడిభాగాల కోసం యూరప్ చైనాపై ఆధారపడుతోంది. కెమికల్స్, ఫార్మాస్యూటికల్ అంశాలను ఎగుమతి చేస్తుంది. అమెరికా రైల్వే విడిభాగాలను కొనుగోలు చేస్తుంది. అమెరికాకు ఏటా 200 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను చైనా విక్రయిస్తోంది.

రష్యా

అమెరికా పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్, ప్లాటినం, ఎరువులు కొనుగోలు చేసేది. రష్యా ఏటా 20 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను అమెరికాకు విక్రయిస్తోంది. ఐరోపా దేశాలు ఖనిజాలు, ఇంధనాలు, చమురు, గ్యాస్, ఉక్కు, రబ్బరు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ధాన్యాలను కొనుగోలు చేస్తాయి. మొత్తం టర్నోవర్ 195 బిలియన్ డాలర్లు.

దక్షిణాఫ్రికా

అమెరికా 24 శాతం ఖనిజ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. కూరగాయలు, టెక్స్ టైల్, ప్యాకేజ్డ్ ఫుడ్, ఎక్విప్ మెంట్, మెషినరీలను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. ఏటా పది బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది. యూరప్ 27 బిలియన్ డాలర్ల విలువైన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేస్తోంది.

యూఏఈ

చమురు, రసాయనాలు, లగ్జరీ వాహనాలు, బాయిలర్లు మొదలైన వాటిపై అమెరికా ఆధారపడుతోంది. యుఏఈ అమెరికాకు ఏటా 12 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను విక్రయిస్తుంది. ఐరోపా ఎక్కువగా నూనెలు, కందెనలు, ఇతర పెట్రోకెమికల్స్ మీద ఆధారపడుతుంది. మొత్తం వ్యాపారం 15 బిలియన్ డాలర్లు.

Whats_app_banner

సంబంధిత కథనం