US Top Universities: అమెరికాలో విదేశీ విద్యార్థులు ఎక్కువగా చేరుతున్న యూనివర్సిటీలు ఇవే..
US Top Universities: గ్రాడ్యుయేషన్ అనంతరం ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లడం సాధారణమైంది. భారతీయు విద్యార్థులు ఉన్నత విద్య కోసం ముఖ్యంగా అమెరికాఅమ, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలకు వెళ్తుంటారు. అయితే, విదేశీ విద్యార్థులు ఆసక్తి చూపే అమెరికా యూనివర్సిటీల వివరాలను ప్రాడిజీ ఫైనాన్స్ సంస్థ వెల్లడించింది.
అమెరికాలో ఉన్నత విద్య కోసం అంతర్జాతీయ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న కొన్ని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల వివరాలను ప్రాడిజీ ఫైనాన్స్ సంస్థ వెల్లడించింది. తమకు అందిన లోన్ అప్లికేషన్ల ఆధారంగా ఈ వివరాలను ప్రాడిజీ ఫైనాన్స్ కనుగొన్నది. ఈ విశ్వవిద్యాలయాలు వివిధ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లను అందిస్తాయి. తమ కెరీర్‌ను వృద్ధి చేసుకోవడానికి విద్యార్థులకు చాలా అవకాశాలను అందిస్తున్నాయి. విదేశాల్లో మాస్టర్స్‌ను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రాడిజీ ఫైనాన్స్ నో కొలేటరల్, నో కాసిగ్నర్ రుణాలను అందిస్తుంది.
నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ
బిజినెస్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ లేదా సైన్స్ కోర్సుల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. 2023 ఫాల్ నాటికి, ఈ యూనివర్సిటీలో మొత్తం 16,209 ఇంటర్నేషనల్ విద్యార్థులు జాయిన్ అయ్యారు. ఇక్కడ వర్క్ ఎక్స్ పీరియన్స్, రీసెర్చ్ ల కాంబినేషన్ లో విద్యార్థులకు రియల్ టైమ్ అవగాహన కల్పిస్తారు.
క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీ
క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీ లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను పొందవచ్చని అంతర్జాతీయ విద్యార్థులు భావిస్తున్నారు.ఈ యూనివర్శిటీ లో విద్యార్థులకు తమ కోర్సు లో స్టడీ అబ్రాడ్ ఆఫర్లు, ఫ్యాకల్టీ లెడ్ ప్రొగ్రామ్స్, స్టుడెంట్ ఎక్స్చేంజ్ ప్రొగ్రామ్స్ రెగ్యులర్ గా జరుగుతాయి. తాము ఎన్నుకున్న కోర్సులో ఇంటర్నేషనల్ ఎక్స్ పోజర్ పొందడానికి విద్యార్థులకు యూనివర్సిటీ సహాయపడుతుంది. కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అలాగే, బిజినెస్ మేనేజ్మెంట్ లో ఈ యూనివర్సిటీలో ఎక్కువ మంది విద్యార్థులు చేరుతారు. ఈ వర్సిటీలోని మొత్తం స్టుడెంట్స్ లో అంతర్జాతీయ విద్యార్థులు 6.2% ఉన్నారు. ఇక్కడ నుంచి ప్లేస్ మెంట్ పొందినవారు అధిక వేతనాలతో సెటిల్ అయ్యారు.
నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయం
యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (UNT) అంతర్జాతీయ విద్యార్థుల కోసం అనేక ఉన్నత విద్యా కార్యక్రమాలను అందిస్తుంది. సైన్స్, హెల్త్‌కేర్, ఇంజినీరింగ్, బిజినెస్, లిబరల్ ఆర్ట్స్‌లో ఇక్కడ ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఈ యూనివర్సిటీ చాలా కోర్సులను ఆఫర్ చేస్తోంది. విద్యార్థులు 14 కళాశాలల్లో 114 బ్యాచిలర్స్, 97 మాస్టర్స్, 39 డాక్టోరల్ ప్రోగ్రామ్‌ల నుండి తమకు నచ్చిన, అర్హత ఉన్న కోర్సును ఎంచుకోవచ్చు. ప్రస్తుతం 2,500 కంటే ఎక్కువ మంది అంతర్జాతీయ విద్యార్థులు UNTలో చదువుతున్నారు. వీరు 141కి పైగా దేశాల నుండి వచ్చారు.
పేస్ యూనివర్సిటీ
న్యూయార్క్ నగరంలోని పేస్ విశ్వవిద్యాలయం వ్యాపార ప్రపంచంలో తమదైన ముద్ర వేయాలనుకునే విద్యార్థులకు అత్యుత్తమ ఎంపిక. ఇది ప్రపంచంలోని కీలకమైన ఆర్థిక కేంద్రాలలో ఒకటిగా ఉన్నందున, పేస్ విద్యార్థులకు కనెక్షన్‌లను నిర్మించుకోవడానికి, వారి కెరీర్‌లో ఎదగడానికి అనేక అవకాశాలను అందిస్తుంది. ఈ యూనివర్సిటీలో 22% అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నారు. మానవ వనరులు, అకౌంటింగ్, బిజినెస్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, రిస్క్ మేనేజ్‌మెంట్, సోషల్ మీడియా మొబైల్ మార్కెటింగ్, ఇతర రంగాలలో ఇక్కడ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ USAలో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లకు అంకితమైన మొదటి సంస్థగా నిలుస్తుంది. ఈ కళాశాలలో చదివే విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉత్తేజకరమైన కెరీర్ (CAREER) అవకాశాలను పొందుతారు.
సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయం
సెయింట్ లూయిస్ యూనివర్శిటీ (SLU) ఏవియేషన్, వాతావరణ శాస్త్రాలు, ఔషధం, వ్యాపారం, లా కోర్సులకు అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. ఇక్కడి ఫాకల్టీకి మంచి పేరుంది. 2023లో, SLU లో 11% మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరు 20 దేశాల నుండి వచ్చారు. ఏవియేషన్ అండ్ టెక్నాలజీ, జియోసైన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సులకు ఈ విశ్వవిద్యాలయానికి చెందిన పార్క్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చాలా పాపులర్. ఇక్కడి స్కూల్ ఆఫ్ లా కూడా దాని JD, LLM ప్రోగ్రామ్‌లకు పేరెన్నిక గన్నది.
ప్రాడిజీ ఫైనాన్స్
యూఎస్ (USA) లోని పలు యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థులు అడ్మిషన్ పొందడానికిి ప్రాడిజీ ఫైనాన్స్ సహాయపడింది. అనేక మంది విద్యార్థులు ఇంజినీరింగ్, బిజినెస్, హెల్త్‌కేర్, పబ్లిక్ పాలసీ, సైన్స్, లా వంటి వివిధ కోర్సుల్లో బ్రిడ్జ్‌పోర్ట్ విశ్వవిద్యాలయం, డల్లాస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం, ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆర్లింగ్‌టన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం, అరిజోనా స్టేట్ యూనివర్శిటీ, క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీ, స్టీవెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా చదువుకునేందుకు రుణాలు అందించి ప్రాడిజీ ఫైనాన్స్ సహకరించింది.