LIVE UPDATES
Andhra Pradesh News Live December 1, 2024: Visakhapatnam : మత్తు మందు ఇచ్చి.. మంటలు అంటుకునే పొడి శరీరంపై చల్లి.. భార్యపై భర్త హత్యయత్నం
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 01 Dec 202403:51 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Visakhapatnam : మత్తు మందు ఇచ్చి.. మంటలు అంటుకునే పొడి శరీరంపై చల్లి.. భార్యపై భర్త హత్యయత్నం
- Visakhapatnam : విశాఖలో ఘోరమైన సంఘటన జరిగింది. భార్యకు మత్తు మందు ఇచ్చి, మంటలు అంటుకునే పొడి శరీరంపై చల్లి హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ భర్త. గ్యాస్‌స్టవ్ ప్రమాదం జరిగిందని అందరిని నమ్మించాడు. ఆమె కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోవడంతో అసలు విషయం బయటపడింది.
Sun, 01 Dec 202403:41 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Anantapur Road Accident : అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురు వైద్యులు మృతి, మరొకరి పరిస్థితి విషమం
- అనంతపురం జిల్లా విడపనకల్లులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రభుత్వ వైద్యులు మృతి చెందారు. వీరంతా బళ్లారికి చెందినవారిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
Sun, 01 Dec 202401:20 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rain ALERT : తీరం దాటిన 'ఫెంగల్' తుపాన్ - దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన!
- 'ఫెంగల్'తుపాన్ పూర్తిగా తీరం దాటింది. శనివారం రాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్లు ఐఎండీ తెలిపింది. క్రమంగా బలహీన పడనుందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.